అమ్మాయిలూ హై హీల్స్ (ఎత్తు మడ మల చెప్పులు) వాడుతున్నారా?
అయితే మీరు ఈ హీల్స్ గురించి తెలుసుకోవాల్సిందే.. అందం కోసం అప్పుడప్పుడూ వాడితే ఫర్లేదు కానీ అదే అలవాటు అయిందనుకోండి ఆ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావాల ను చూపిస్తుంది మరి! ఇంకో మాట లో చెప్పా లంటే ముని వేళ్ళమీద నడవటం. ఇది చూడ డానికి బాగానే వుంటుంది. కానీ ఇది చూపించే దుష్ప్రభావాలు కూడా అలాగే వుంటాయి. మునివేళ్ల మీద నడ వటం వల్ల ఒత్తిడి పెరిగి పోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలు న్నాయని ఆర్థోపెడియన్ (ఎముకలు డాక్టర్) లు అంటు న్నారు.మడమ ఎత్తు కారణంగా మోకాలి జాయింట్లపై ఒత్తిడి పెరిగి తొడ భాగంలోని కండరాలపై తీవ్ర ప్రభా వం చూపుతాయి. తద్వారా కండ రాల కదలిక భారమై మోకాలి జాయింట్లు అరిగిపోయే ప్రమాద ముంది. ఒక్కోసారి శాశ్వతంగా నడకను కూడా కోల్పోయే ప్రమాద ముందని నిపుణులు చెపుతున్నారు. హై హీల్స్ వాడకం ద్వారా వచ్చే నొప్పులను వదిలించుకోవడానికి దాదాపు 12 నుంచి 15వేల రూపా యల వరకు ఖర్చు ఉంటుంది.మన శరీర భారాన్నంతా మోసేది మన కాళ్లేకదా! మరి వాటి కోసం మనం జాగ్రత్తలుతీసు కోమా? పోనీ మీకు హీల్స్ వేసుకోవాలని మరీ కోరికగా ఉంటే డాక్టరును సంప్రదిం చి ఎంత ఎత్తు వరకు హీల్ వాడవచ్చో అనేవిషయాన్ని ధృవీకరించుకొని వాడితే మంచిది.
No comments:
Post a Comment