ముఖసౌందర్యంలో మెడ కూడా ఒక భాగమే.
ముఖం అందంగా ఉం డాలని కోరుకునేవారు మెడను కూడా పట్టించుకుంటూ, మెడ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. అందరి మెడలు ఒకే తీరుగా ఉండవు. కొంతమంది మెడ పొడవుగా ఉంటే, కొందరి మెడభాగం ఎత్తు తక్కువగా ఉంటుంది. కొందరు మెడ వెడల్పుగాఉండి, గుండ్రంగా ఉంటుంది. ఇంకొందరి మెడభాగం చాలా తక్కువగా కనిపిన్తుంది. ఒక్కొక్కరి మెడ ప్రాంతం రకరకాలుగా ఉంటుంది. తమ మెడ ఆకారాన్ని బట్టి స్త్రీలు జాకెట్ల నెక్‌కు ప్రాధాన్యతనివ్వాలి. పొడుగ్గా మెడ ఉండే స్త్రీలు మెడ చుట్టూ వెడల్పుగా ఉండే ఆభరణాన్ని ధరిస్తే బాగుంటుంది. మెడవెడల్పుగా ఉన్నవారు నెక్లస్ పెట్టుకుంటే మెడ ఆకర్షణీయం గా ఉంటుంది. మెడ చిన్నగా ఉన్నవారు సన్నని గొలుసును వేసుకోవచ్చు. మెడను పరిశుభ్రంగా ఉంచుకుంటే, మెడ కూడా అందంగా కనిపిస్తుంది.
1. బయటకు వెళ్ళినప్పుడు చెమటపడుతుంది. ఆ చెమట తడిలో వాతా వరణంలోని దుమ్ము, దూళి అతుక్కుని మెడ అపరిశుభ్రంగానూ, నల్ల గానూ కనిపిస్తుంది. మెడచర్మపు ఛాయ బాగుండాలంటే, బయటనుంచి రాగానే ముఖం, కాళ్ళుచేతులతో పాటు మెడను కూడా నీటితో శుభ్రపరచుకోవాలి.
2. గిల్టు నగలు కొందరికి ఎలర్జీ కలిగిస్తాయి. చర్మం వికారంగానూ, నల్లబడి అందవిహీనంగాను కనిపిస్తుంది. ఎలర్జీ వల్ల చర్మానికి సన్నని దద్దుర్లు ఏర్పడుతాయి. అటువంటి స్త్రీలు గిల్టునగలు ధరించకూడదు. మెడ చర్మపు సౌందర్యాన్ని పాడుచేయ కూడదు.
3. జిడ్డు చర్మం ఉన్నవారు మెడ చర్మపు శుభ్రత, సౌందర్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శిరోజాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా వారానికి రెండుసార్లు మాత్రమే వెంట్రుకలకు స్వల్పంగా నూనెను పట్టించాలి.
4. జిడ్డుచర్మం తీరును మార్చలేకపోయినా, వేసవిలో తలలోని ఆయిల్, స్వేదం మెడ మీదకు చేరుకుని మెడ అపరిశుభ్రంగా, నల్లగా, జిడ్డుగా వికారంగా మారకుండా జాగ్రత్తపడాలి. వేసవిలో తలస్నానం ఎక్కువసార్లు చేస్తూ, వెంట్రుకలను శుభ్రపరచి, మెడశుభ్రతనూ అందాన్నీ కాపాడుకోవాలి.
5.తలవెంట్రుకలు మెడపైనపడి, మెడచర్మం జిడ్డుగా మారుతుంది. మెడచర్మం జిడ్డుగానూ, అపరిశుభ్రంగానూ, నల్లగానూ మారకుండా పెరుగులో సున్నిపిండి, నిమ్మరసం, పసుపుపొడికలిపి ఆ పేస్టును మెడకుపట్టించి, పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మెడ చర్మాన్ని శుభ్రపరచాలి.
6. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను మెడకు రాయాలి. వేసవిలో స్నానమయిన తర్వాత ప్రిక్లీహీట్ పౌడరును మెడ చుట్టూతా చల్లుకోవాలి.
7.చలికాలంలో మెడకు మాయిశ్చరైజర్‌ను రాయాలి.
8.తలకు చుండ్రు రాకుండా జాగ్రత్తపడాలి. తలలో చుండ్రు ఏర్పడితే, మెడ చర్మం అపరిశుభ్రమవుతుంది.
9. తలగడ గట్టిగానూ, మరీ ఎత్తుగానూ ఉండకూడదు. అందు వల్ల మెడకు బాధ కలగటమేకాక, చర్మానికి ముడుతలు వస్తాయి.
No comments:
Post a Comment