సహజమైన అందం కోసం....!
మేకప్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే కింద చెప్పిన టిప్స్ పాటించండి. సహజ అందంతో అందరినీ ఆకట్టుకోండి.
* మంచినీళ్లు బాగా తాగండి. నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చర్మం నునుపు దేలి కాంతివంతంగా ఉంటుంది.

* ప్రమాదకరమైన రసాయనాలు లేని మాయిశ్చరైజర్స్‌ను వాడాలి. ఇవి చర్మాన్ని రక్షించడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా మాయిశ్చరైజర్‌ను ముఖానికి, చేతులకు, పాదాలకు, మెడకు తప్పకుండా రాసుకోవాలి. ఎందుకంటే చర్మం తొందరగా వదులు అయ్యే భాగాలు ఇవే. ఇలా చేస్తే చర్మంపై ముడతలు ఏర్పడవు. వయసు కనపడదు.
* చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ఫేస్ వాష్ బాగా ఉపయోగపడుతుంది. దుమ్ము, ధూళి చర్మంలో ఇట్టే చేరిపోతుంటాయి కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేస్తే ముఖం మీద చర్మం నిగ నిగలాడుతుంటుంది.
* చర్మం ఆరోగ్యంగా ఉండడానికి టోనర్ చాలా అవసరం. ఇది చర్మం రంగు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం బిగుతుగా ఉండేట్టు చేస్తుంది. ముడతలు పడనీయదు.
* వారానికి కనీసం మూడుసార్లు షాంపుతో తలస్నానం చేయాలి. అలా చేస్తే జుట్టు నిగ నిగలాడుతూ శుభ్రంగా ఉంటుంది. తలకు నూనె బాగా పట్టించవద్దు. అలా చేస్తే ముఖం జిడ్డోడుతూ కనిపిస్తుంది.
* బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలి. లేకపోతే ఎండవేడిమికి చర్మం దెబ్బతింటుంది.
* ఉదయం లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లను తాగడం మరవొద్దు. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయరసం పిండి ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
No comments:
Post a Comment