రెండు చెంచాల పెసళ్ళ పౌడర్ మరియు చిటికెడు పసుపు తీసుకోవాలి . దీనికి కొద్దిగా పాలు జోడించి చిక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
బంతిపువ్వుల యొక్క రేకులను మెత్తగా పేస్ట్ చేసి దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం మరియు మెడకు పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . ఇది ఒక బెస్ట్ హోం మేడ్ ఫేస్ ప్యాక్.
తాజాగా ఉండే పుదీనా ఆకులు మెత్తగా గ్రైండ్ చేసి, దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేయాలి . తర్వాత అందులో కొద్దిగా ముల్తానీ మట్టి మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ గంధంలో చిటికెడు పసుపు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి . ఈ పేస్ట్ ను ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ఫేస్ ప్యాక్ వల్ల నేచురల్ ఫెయిర్ ను పొందవచ్చు.
తులసి మరియు వేప ఫేస్ ప్యాక్: ఈ ఫేస్ ప్యాక్ ను కోసం తులసి ఆకులు మరియు కొద్దిగా వేప ఆకులు తీసుకొని పేస్ట్ లా చేయాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
No comments:
Post a Comment