అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అందులోనూ మహిళలకు మరింత ద్విగుణీకృతమవు తుంది. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తను అందానికి మరింతగా మెరుగులు దిద్దు కుంటున్నారు. ప్రతి సందుకి, వీధికి ఒక బ్యూటీపార్లర్ వెలు స్తున్నాయంటే కారణం ఇదే. అయితే ఉద్యోగం చేసే మహి ళలకు, కొంతమంది గృహిణులకు ఇలా గంటల తరబడి బ్యూటీపార్లర్‌కు వెళ్ళే అవకాశం ఉండదు. మరి అలాంటి వారు ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో అందంగా కనిపించవచ్చు. దీనికి చేయవలసింది ఒక్కటే. ఒక పది లేదా పదిహేను నిముషాలు కేటాయించడం. చల్లటి టీలో ఒక కాటన్ బట్టను ముంచి, టీని కొద్దిగా పిండి, ఆ బట్టను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకు మెరుపు వస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు రెండు కీరాదోస ముక్కలు పెట్టు కుంటే కళ్ళు చల్లబడి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి. అలాగే ముఖ వర్చస్సు కోసం క్యారెట్‌ను రసం తీసి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. అలాగే బొప్పాయి గుజ్జును పదిహేను నిముషాలు ఉంచి కడిగినా కూడా ముఖ వర్చస్సు పెరుగుతుంది. మహిళలు ఎన్నో ఎన్నో రంగాలలో ముందుంటు న్నారు. అలాగే ప్రతి రంగంలో ఉన్న స్త్రీలు ఎన్నో విజయాలతో పాటు ఒత్తిడిని కూడా ఎదుర్కొం టున్నారు. అలా ఒత్తిడి పెరిగి చర్మం ఒడలిపోయిన ట్లుగా తయారయితే ఇలా చేసి చూడండి. బాగా పండిన అరటిపండును తీసుకొని దానిని బాగా గుజ్జులాగా మెత్తగా చేసి దానిలో తేనె ఒక చెంచా, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి బాగా పట్టించి అరగంట తరువాత కడిగేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి, ముఖంపై ఉన్న చర్మం బిగుతుగా తయారవు తుంది. అంతేకాకుండా మెరుస్తుంది కూడా. ఒక టీస్పూన్ శనగపిండిని తీసుకుని దానిలో కొంచెం పాలు, చిటికెడు పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగేస్తే ముఖం మిలమిలా మెరుస్తుంది. జిడ్డు ముఖం కలవారు అయితే రాత్రిళ్ళు గులాబి ఆకులను నీళ్ళల్లో వేసి ఉదయం ఆ నీళ్ళతో ముఖం కడుక్కుంటే తేటగా ఉంటుంది. ఇలా చిన్న చిట్కాలతో ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు ఆలస్యం? చేసి చూస్తే సరిపోతుంది.


No comments:
Post a Comment