బాలలం మేం బాలలం
బడిలో బుద్ధిగా వుంటాము
బాలలం మేం బాలలం
చిలిపి అల్లరి చేస్తాము
ఎక్కాలను చదివేస్తాం
లెక్కలు మేం చేసేస్తాం
గుణింతాలు గుర్తులతో
గబగబ మేం చదివేస్తాం
పాటలు చక్కగా పాడేస్తాం
ఆటలు అన్నీ ఆడేస్తాం
బొమ్మలు అన్నీ వేసేస్తాం
చదువుల్లో మేమే ముందుంటాం
గురువుకి దండం పెడతాం
పెద్దల మాటలు వింటాం
బాలలం మేం బాలలం
బడికి బుద్ధిగా వెళతాము

No comments:
Post a Comment