ముఖంపై ఉండే మొటిమలు, సన్నని గీతలు, ముడతలు ఎక్కువగా ఉంటే.. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. మేకప్‌తో కవర్ చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి సహజసిద్ధమైన శాండల్ఉడ్ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం ద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది.
అలాగే బాదం ఆయిల్‌లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ పోషణకు సహాయపడుతుంది. అలర్జీలు రాకుండా, ప్రకాశవంతమైన చర్మానికి బాదం ఆయిల్‌తో అప్పుడప్పుడు మర్దనా చేసుకుంటూ ఉండాలి. కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. కొబ్బరినూనె జుట్టు పెరుగుదలతో పాటు చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. కాబట్టి రాత్రిపూట లేదా స్నానానికి ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
ఆలివ్ నూనె చర్మంలో అంతర్గత తేమ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేగాకుండా సమర్థవంతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్యఛాయలను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది.
No comments:
Post a Comment