WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 30 September 2016

DASARA FESTIVAL STARTING FROM 01-10-2016 TO 11-10-2016 - FIRST AVATHAR SRI SWARNA KAVACHALANKRUTHA DEVI ALANKARAM AND DEVI PUJA PRASADHAM INFORMATION IN TELUGU


ఆశ్వయుజ మాసం లో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి ప్రీతి పాత్రమైన కాలం గా మనకు పెద్దల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతి రోజూ భగవంతుని ఆరాధనకు బ్రాహ్మి సమయం, సంధ్యా సమయం ఎంత అత్యుత్తమ మైనవొ, అలాగే ఏడాది లో ఆశ్వయుజ మాసం లో శుక్ల పక్షం లో పాడ్యమి మొదలు దశమి తిధి వరకు ఉన్న రోజులు అమ్మ వారి ఆరాధనకు, సాధనకు అంత అత్యుత్తమ మైన సమయం గా ఋషుల చేత నిర్ణయింప బడినదని మనకు తెలుస్తోంది. శరద్ ఋతువులో భారత దేశం అంతా సమతుల్యమైన ఉష్ణోగ్రత ఉండటం వలన సాధనకు చాల అనువైన కాలం గా కూడా చెప్పబడుతుంది.
ఈ పవిత్ర పర్వ దినాలలో మన పాఠకులకు ప్రత్యేకంగా శరన్నవరాత్రి విశిష్టతను మరొక్క సారి గుర్తుకు తెస్తూ శ్రీమతి నయన కస్తూరి గారు ముందుగ శరన్నవరాత్రుల వైభవాన్ని వివరించటమే కాక, ఈ నవ రాత్రులలో ప్రతి రోజు అ మరుసటి రోజు యొక్క దేవీ అలంకార ప్రభావాన్ని విశదీకరిస్తూ, అ దేవికి సమర్పించే ప్రత్యేక నివేదన గురించి ప్రస్తావించటం జరుగుతుంది. పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ దేవి అలంకారాలూ నివేదనలు, ప్రాంతానుసారం ఉత్తర తూర్పు దక్షిణ భారతాలలో కొంత మార్పుతో ఉంటాయి. అంతేకాక అచ్చటి దేవీ క్షేత్రాల సంప్రదాయం అనుసరించి కూడా స్వల్పమైన మార్పుతో ఉండవచ్చు. మనం ఇక్కడ పొందు పరిచేవి, సామాన్యం గా మన ప్రాంతాలలో జరుపుకునే పద్ధతి ని అనుసరించి వుంటాయి.
కనుక అక్టోబర్ 1 వ తేదీ నుండి, అక్టోబర్ 11 వ తేదీ వరుకు కొనసాగే దేవి నవరాత్రులలో పాఠకులంతా అమ్మవారి వివిధ రూపాలని అర్చించి తరించగలరని ఆశిస్తూ, మన అందరిపై ఆ తల్లి కృపా కటాక్ష వీక్షణాలు నిరంతరం నిలవాలని కోరుకుంటున్నాము.
రమణ బంధకవి
సంపాదకుడు
శరన్నవరాత్రులు-------- ప్రధమం - ప్రసన్న రూపం (01-10-2016)
శ్రీ స్వర్ణకవచాలంకృత దేవీ అలంకారం
శ్రీమతి నయన కస్తూరి
వసంత ఋతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్ఠం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుండే శ్రీ శక్తిని పూజించే విధానం పురాణేతిహాసాల ద్వారా మనకు విదితమవుతోంది. మహాభారత సమయం లో శ్రీ కృష్ణుడు పాండవుల విజయం కోసం అమ్మవారిని ప్రార్ధించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నవరాత్రులలో దేవీ ఆరాధనే ప్రముఖం గా వుంటుంది కనుక ఈ నవరాత్రులు, దేవీ నవరాత్రులుగా కూడా భక్తులచే పిలవబడుతున్నాయి.

మనం నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో శక్తి రూపానికి పూజలు జరిపిస్తామని చెప్పుకున్నాం కదా? అయితే నవరాత్రుల యందు ప్రధమ మైన శుక్ల పాడ్యమి రోజున అలరారించే సువర్ణ కవచాలంకృత దేవీ దివ్య రూపాన్ని ఈ రోజు దర్శించుకుందాము. ఒకసారి కనులు మూసుకుని ఆ సువర్ణ దివ్యమంగళ విగ్రహాన్ని మనసు నిండా నింపుకుని, ధ్యానించు కుందాము.

“ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం!
చంద్రాం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మా అవహ!”


“అమ్మ మనసు ఎప్పుడూ బంగారమే! ఇక రూపం కూడా సువర్ణమైతే చెప్పేదేముంది? అమ్మ వారి స్వర్ణకవచాలంకారం వీక్షించడానికి సహస్రాక్షువులు ఉన్నా తక్కువే! అమ్మ అందం స్వర్ణ కవచాలంకరణతో ద్విగుణీకృతం అవుతుంది. అష్ట భుజాలతో శంఖ, చక్ర, గదాంకుశ, త్రిశూల దారి అయి, అలరారుతుంది. శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా సువర్ణ రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనురాలై చిరుమందహాసం తో భక్తుల కోరికలు ఈడేరుస్తుంది. ఆ శాంభవి యొక్క సువర్ణ కవచం భక్తుల పాలిట రక్షణ కవచం అవుతుంది. ఆపదలకు అడ్డు కాస్తుంది. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించుకుని, శ్రీ దుర్గా అష్టోత్తరం తో షోడశోపచార పూజలు సలిపి, రాజోపచారాలు, భక్తోపచారాలు, శక్త్యోపచారాలు జరిపి తీపి బూందీని, నాన బెట్టిన శనగలు సుండలు శ్రద్ధగా చేసి, భక్తిగా నివేదించుకుని, మంగళ నీరాజనాలు అలది, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ దుర్గా చాలీసా పారాయణం చేసి, ప్రధమ రోజు పూజ ముగించుకుని, దివ్యమైన ద్వితీయ అలంకారం తో రేపు కలుద్దాము!

ధరించవలసిన వర్ణం: పసుపు
ప్రసాద నివేదన: తీపిబూంది, శనగల సుండలు, పెసరసున్నుండలు.
ఇక ఈ నాటి అమ్మ వారి ప్రసాదాల తయారీ ని ఒక సారి చూద్దామా?

తీపి బూందీ:

రెండు గ్లాసుల జల్లించిన శనగపిండిని తీసుకోండి. తగినన్ని నీళ్ళు తీసుకుని పిండిని జాలువారుగా కలుపుకోండి. ఒక బాండీ లో రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నీళ్ళ లో కలిపి, స్టవ్ మీద పెట్టి తీగ పాకం పట్టుకోవాలి. పాకాన్ని పక్కకు పెట్టి, ఇంకొక బాండీ లో నూనె పోసి స్టవ్ మీద పెట్టాలి, నూనె కాగాకా బూంది చట్రం తీసుకుని, దాని మీద ఇంకొక గరిటతో పిండి పోసి, కింద నుండి బూందీ ఆకారం లో పడేలా తిప్పుతూ వుండాలి. బూందీ మరీ కరకర మనకుండా నే తీసి, పంచదారపాకం లో వేస్తూ వుండాలి. పాకానికి సరి పడ బూందీ అయ్యాక బాగా కలిపి, ఒక పళ్ళెంలో కి తీసుకుని ఆరబెట్టు కోవాలి. బూందీ పాకం పీల్చుకుని బాగుంటుంది.


శనగల సుండలు:
ఒక అరకిలో శనగలు ముందు రోజు రాత్రి బాగా కడిగి నాన బెట్టుకోవాలి. మరునాడు నానిన శనగలను తీసి సరి పడ నీరు పోసి కుక్కర్ లో ఉడక బెట్టుకోవాలి. బాగా ఉడకడానికి కుక్కర్ ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఉడికిన తర్వాత చిల్లుల బుట్టలో వేసి నీళ్ళు పోనివ్వాలి. ఒక బాండిలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి, నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు, రెండు చెంచాల మినప్పప్పు, ఒక అరచెంచా ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర వేసి, పోపు వేయించుకోవాలి. చివరలో 
నాలుగు పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సుండలు తయార్! ఈ సుండలంటే అమ్మ వారికి అత్యంత ప్రీతి సుమండీ!


ఇతర నివేదనలు:
పై చెప్పినవే కాక కొందరు పెసర సున్నుండలు కూడా తయారు చేసి నివేదించటం కద్దు!

పెసర సున్నుండలు :
పెసర పప్పు ని వేయించి, మెత్తగా పొడి చేసుకుని, పెసర పిండి, చెక్కర ను కలిపి, కరిగించిన నేతిని తగినంత వేసి, యాలకుల పొడి వేసి చక్కగా ఉండలు కట్టుకుంటే పెసర సున్నుండలు తయార్!




PRAHALADHA CHARITHRA - TELUGU POEMS


ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు.

(పోతనామాత్యుడు.)

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !

చదువగ వలయును జనులకు

చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

చదివించిరి నను గురువులు

చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే

చదివినవి గలవు పెక్కులు

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !!

ఇందు గలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే !!

మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు బోవునే మదనములకు !

నిర్మల మందాకినీ వీచికల దూగు

రాయంచ సనునె తరంగిణులకు !

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు

కోయిల సేరునే కుటజములకు !

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

మ్మరుగునే సాంద్ర నీహారములకు !

అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు

వినుత గుణ శీల మాటలు వేయు నేల !!

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

I LUV YOU BANANA - FULL STORY ABOUT BANANA FRUIT - HEALTH AND BEAUTY BENEFITS IN TELUGU ABOUT BANANA - ARATIKAYALU


అరటి పండ్లు , Banana

పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం . 
అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజంచెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
ప్రపంచం మొత్తంమీద మన దేశం అరటిని పండించే విషయంలో రెండో స్థానంలో ఉంది. ఎంతోమంది రైతులకు, వ్యాపారస్థులకు ఇది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆర్థిక వెసులుబాటును కల్గిస్తూ బాసటగా నిలుస్తోంది.
* అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.
* నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
* అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.
* మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).
* అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)
* అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)
* ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.
* అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.
పోషక విలువలు : అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు
74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది.
23% కార్బోహైడ్రేటులు, ~
1% ప్రోటీనులు,
2.6% ఫైబరు ఉంటుంది.
ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం , శ్రేష్టమైనది . వందగ్రాముల అరటిలో
* నీరు - 70.1 గ్రా.
* ప్రోటీన్ - 1.2 గ్రా.
* కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
* పిండిపదార్థాలు - 27.2 గ్రా.
* కాల్షియం - 17 మి.గ్రా.
* ఇనుము - 0.4మి.గ్రా.
* సోడియం - 37 మి.గ్రా.
* పొటాషియం - 88 మి.గ్రా.
* రాగి - 0.16 మి.గ్రా.
* మాంగనీసు - 0.2 మి.గ్రా.
* జింక్ - 0.15 మి.గ్రా.
* క్రోమియం - 0.004 మి.గ్రా.
* కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
* రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
* సి విటమిన్ - 7 మి.గ్రా.
* థయామిన్ - 0.05 మి.గ్రా.
* నియాసిన్ - 0.5 మి.గ్రా.
* శక్తి - 116 కిలోకాలరీలు

DEATH STRIKE - SALOON WORKING DEAR

అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది.
చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు.
డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత
చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.
రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.
ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.
“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.
“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.

###

” ప్రియా , నీ చెంపలు ఎంతో నున్నగా వున్నాయి,రోజుకు ఎన్ని సార్లు షేవింగ్ చేస్తావు?” మత్తుగా అడిగింది రజని.
“ ఒక ఇరవై సారులు చేస్తాను”
“ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా, రోజుకు ఇరవై సార్లు షేవింగా ?” ఆశ్చర్యంగా అడిగింది రజని.
“ అవును, నేను సెలూన్ లో పని చేస్తాను” అసలు సంగతి చెప్పాడు గణేశ్.

ALUM - PATIKA - MEDICINAL HEALTH BENEFITS IN TELUGU


పటిక ఔషధోపయోగాలు,Alum as medicine
ఏ ఔషధమైతే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దానిని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇటువంటి ఔషధం విరివిగా, చవుకగా లభిస్తూ, అన్ని వర్గాల ప్రజలకూ అందుబా టులో ఉండి, దానిని వ్యాధి అవస్థానుసారం చూర్ణం, మాత్ర, ద్రవ రూపాలలో తీసుకోవడా నికి అనువుగా ఉంటే ఆ ఔషధాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఈ లక్షణాలు కలిగి, సర్వసాధారణంగా లభ్య మయ్యే పటిక ఔషధ గుణాలను తెలుసుకోవడం అవసరం. మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాలనుంచి అతి స్వల్ప ఖర్చుతో విలువైన ప్రయోజనం పొందడానికి పటిక ఎంతగానో ఉపకరిస్తుంది.
కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గు తుంది.
వ్రణాలను, గాయాలను పటిక నీటితో కడి గితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా, అతి త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లనుంచి రక్షణ లభిస్తుంది.
పటిక నీటిని నోటిలో పోసుకుని పుక్కిలి పడితే, నోటిలోనూ, అంగిలిలోనూ, నాలుకపైన ఉన్న గుల్లలు, పుళ్లు, వ్రణాలు, టాన్సిల్స్‌ వాపు, నొప్పి మొదలైనవి తగ్గుతాయి.
పరిశుభ్రమైన నీటిని 600 మిల్లీలీటర్లు తీసుకుని, దానికి 15 గ్రాముల పటిక కలిపి ఆ నీటితో యోనిభాగాన్ని శుభ్రంగా కడిగి పటిక నీటితో తడిపిన శుభ్రమైన వస్త్రాన్ని రోజూ కొంతసేపు యోనిమార్గంలో ఉంచితే స్త్రీలలో ఎదురయ్యే తెల్లబట్ట, యోని వ్రణాలు, దురద తగ్గుతాయి.
పటిక కలిపిన నీటిని రెండు మూడు చుక్కలు రోజూ రెండుసార్లు కళ్లలో వేసుకుంటే కళ్ల కలక వ్యాధి త్వరగా తగ్గుతుంది.
100 మిల్లీగ్రాముల పొంగించిన పటికను చనుబాలలో కరిగించి రోజూ రెండుసార్లు చెవిలో వేస్తుంటే చెవినుంచి చీము కారడం తగ్గుతుంది.
పొంగించిన పటిక చూర్ణాన్ని తగినన్ని నీళ్లలో చిక్కగా కలిపి ప్రతినిత్యం మూలవ్యాధి పిలకలను కడుగుతుంటే అవి ఎండిపోతాయి.
పావుతులం పటిక చూర్ణాన్ని ఒక లీటరు నీటిలో కలిపి ఉంచుకుని అరగంటకు ఒకసారి కొద్దికొద్దిగా తాగుతుంటే కలరా వ్యాధి త్వరగా తగ్గుతుంది.
ఐదు గ్రాముల పటిక చూర్ణాన్ని 100 మిల్లీ లీటర్ల పాలలో వేసి కాచి వడగట్టి రోజూ మూడు పూటలా తాగుతుంటే నోరు, ముక్కు, మూత్ర, మలద్వారం వెంట రక్తం పడటం, రక్త విరేచ నాలు, స్త్రీలలో బహిష్టు సమస్యలు తగ్గుతాయి.
200 గ్రాముల ముల్లంగి రసంలో 10 గ్రాముల పటిక చూర్ణాన్ని కలిపి సన్నని మంటపై ముద్ద కట్టే వరకూ వండాలి. దానిని రేగిపండు పరి మాణంలో మాత్రలు చేసుకుని ఎండబెట్టి రోజూ ఉదయం ఒక మాత్రను మింగి, రెండు స్పూన్ల వెన్న సేవిస్తుంటే మూల వ్యాధిలో నొప్పి, మంట, దురద, విరే చనంలో రక్తం పడటం తగ్గి మూలవ్యాధి తగ్గుతుంది. ఇదే ఔషధం మూత్రపిండాల నొప్పికి కూడా ఉపయోగ పడుతుంది.
పటిక, హారతి కర్పూరం, దానిమ్మపెచ్చులు నీటితో మెత్తగా నూరి, రాత్రి రొమ్ములకు పట్టించి, పైన బట్ట కట్టుకుని ఉదయం కడుక కుంటే రొమ్ములు దృఢత్వాన్ని సంతరించు కుంటాయి.
వివిధ రకాల అనారోగ్యాల వలన దీర్ఘకాలం పడకకే పరిమితమైపోయిన వారిలో శరీరంపై, ముఖ్యంగా వెనుక భాగంలో పుళ్లు పడి (బెడ్‌సోర్స్‌) ఎంతకూ తగ్గక చాలా ఇబ్బందులు పడుతుంట, పొంగించిన పటికను కోడిగ్రుడ్డు పచ్చ సొనతో కలిపి పట్టిస్తుంటే అవి త్వరగా మానుతాయి.
పొంగించిన పటిక చూర్ణానికి పదిరెట్ల పటిక బెల్లం కలిపి ఉంచుకుని రోజూ కొటి రెండుసార్లు పావు స్పూను నుంచి అరస్పూను వరకూ వేడినీటి అనుపానంతో కళ్లెదగ్గు ఉన్నవారు, వేడిపాలు అనుపానంగా పొడిదగ్గు ఉన్న వారు సేవిస్తే దీర్ఘకాలిక దగ్గులు తగ్గుతాయి.
200 గ్రాముల కొబ్బరి నూనెలో 50 గ్రాముల తేనె మైనంవేసి కరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు 30 గ్రాముల పటి చూర్ణాన్ని కల పాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గచ్చకాయ ప్రమాణంలో సేవి స్తుంటే నోటి పూత, పేగుపూత, పేగుల్లో వ్రణాలు మొదలైన వాటిలో సుగుణం కనిపిస్తుంది.
పొంగించిన పటికను పూటకు 500 మిల్లీ గ్రాముల వంతున తగినంత వెన్నలో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో అమితవేడి తగ్గుతుంది. పురుషుల్లో శుక్రనష్టం, స్త్రీలలో తెల్లబట్ట తగ్గుతాయి. మూత్రంలో మంట, నొప్పి తగ్గుతాయి.
పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు.


GO 2 HELL - CAR BREAKS FAIL - TELUGU JOKES

" ఏమిటండీ ఈ రోజు ఇంత త్వరగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసారు ?" మూడు

 గంటలకే ఇంటికి చేరుకున్న భర్త గణేశ్ ను అడిగింది భార్య కమల.

" ఫైలు తీసుకెళ్ళి ఆఫీసరు గారి ముందు పెడితే కోపం గా నాలుగు తిట్లు తిట్టీ గో టు 

హెల్ 
అన్నాడు. వెంటనే ఇంటికి అదే నా హెల్ కు వచ్చేసాను" అసలు సంగతి చెప్పాడు 

గణేశ్.

***

ఏమిటండీ కారు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి ఎవరో 

తరుముకొస్తునట్టు ఎందుకంత తొందర ?” అడిగింది భార్య.

“ అదేం కాదు! కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్ జరిగే లోపల ఇల్లు 

చేరుకుందామని స్పీడుగా పోనిస్తున్నాను” అసలు సంగతి చెప్పాడు భర్త,

LIFE IS FULL OF MISERY - TELUGU JOKES

" మా ఆయన ఈ మధ్య బాగా మారిపోయారు తెలుసా ?" ఏడుస్తూ అంది రాధ.

" ఏమయ్యిందో చెప్పవే,నాకు తోచిన సలహా ఇస్తాను" అనునయం గా అంది అనురాధ.

" పెళ్ళి కాకముందు ప్రేమిస్తున్నానంటూ వెంటబడే రోజులలో నువ్వు లేకుండా 

బ్రతకలేనంటూ హుషారుగా పాత సినిమాలలో శోభన్ బాబులా సినిమా డైలాగులు 

చెప్పేవారు. ఈ మధ్య జీవితమే నరకం, జీవితం మూణ్ణాళ్ళ ముచ్చటే అంటూ మజ్ఞూ లా

 విషాదం గా పాటలు పాడుతున్నారు" ముక్కు చీదుతూ అసలు సంగతి చెప్పింది రాధ.

MAHALAYA AMAVASYA - DASARA FESTIVAL BEGINNING - TELUGU ARTICLE


మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది. ఇంకా మహాలయ అమావాస్య రోజున పేదలకు తమకువీలైనంత దానము చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
సాధారణంగా ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమ కాలము. అయితే దక్షిణాయణము పితృదేవతల కాలము గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసం.

ప్రతి మాసంలో వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆరోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంటూ ఉంటారు.

ఇందులో మహాలయము అంటే.. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిధి త్రయోదశి.
"యత్యించిన్మధునా మిశ్రం ప్రదద్యాత్తు త్రయోదశీమ్ |
తదప్య క్షయమేవస్యాత్ వర్షాసుచ మఘాసుచ" ||
అనగా వర్షఋతువు నందు భాద్రపద కృష్ణత్రయోదశి మాఘా నక్షత్రంలో కూడి ఉన్న సమయంలో ఏ పదార్థమైనా శ్రాద్ధం చేసిన అది పితృదేవతలకు అక్షయ తృప్తిని ఇస్తుందని విశ్వాసం.

అంతటి విశిష్టత గాంచిన ఈ మహాలయ పక్షమందు అందరూ వారి వారిశక్తిని తగినట్లుగా పితృదేవతలకు తర్పణమివ్వాలని పురోహితులు చెబుతున్నారు. కొందరు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయాతిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు ఆచరించవచ్చును. ఒకవేళ గతించిన పెద్దల తిథి గుర్తులేనప్పుడు "మహాలయ అమావాస్య"నాడే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం ఉత్తమమని పురోహితులు అంటున్నారు.

కావున పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు.

NO KISS DEAR



 నేను ఈ రోజు నుండి నీ దగ్గర ఏమీ దాచదలచుకోలేదు. 
ఫ్రాంక్ గా అన్నీ నిజాలనే చెప్పెస్తాను. నేను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి
నువ్వు మాత్రం కాదు” శొభనం రోజున భార్యతో ఆవేశంగా చెప్పాడు రాజేష్.


“మీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది. నేనూ ఈ రోజు నుండి
మీ దగ్గర అన్నీ నిజాలే చెబుతాను. మీకు అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం రాదు”
తాపీగా చెప్పింది శొభన.

FUNNY TELUGU POETRY



శ్రీనాధుడికి అరవ పిల్లలు అంటే, యెంత ఇష్టమో... హాస్య ధోరణిలో చెప్పిన
ఈ చాటువు చూడండి...
ఇదిగో, మీరు ఏమైనా తిట్టాలన్నా, ఇరికించాలన్నా ... శ్రీనాధుడినే పట్టుకోవాలి.
చదివే ముందు అదే నియమం.
.
మేత కరిపిల్ల; రణమున మేకపిల్ల
పారుబోతు తనమున పందిపిల్ల
ఎల్లపనులను చెరుపంగ పిల్లిపిల్ల
అందమున కోతిపిల్ల , ఈ అరవ పిల్ల
.
అరవం అంటే కరవం అనే కదా మీ భావన.
సంగీత త్రిముర్తులు మా ప్రాంతం వారే,
వ్యాకరణం రాసిన పరవస్తు చిన్నయసురి మా ప్రాతం ,

THANKS TO SRI Vinjamuri Venkata Apparao GARU FOR HIS ARTICLE

LORD SEVEN HILLS TELUGU PRAYER


అన్నమయ్య కీర్తన కామధేనువిదే
కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ||
హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ||
దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము |
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ||
యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు ||

TELUGU PURANA STORY CHAKARAKUKSHI


చకారకుక్షి!
_
కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట.
దానిపరిణామక్రమం తెలిసికుందాం!
భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట!
అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం.
కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు.
అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట.
కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది.
.
కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట.

కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి -
.
శ్లో: ద్రౌపద్యా ః పాండుతనయాః
పతి ,దేవర, భావుకాః,
నదేవరో ధర్మరాజః
సహ దేవో నభావుకః; -
.
అని వెంటనే ఒకశ్లోకం చెప్పారట. నెచ్చుకుంటున్నానయ్యా!
నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట.
కాళిదాసు వేలు బయట పడింది.
ఇంతకీ దీనికి అర్ధంయేమిటి అని మీసమదేహంకదూ!
చెపుతా వినండి.

" ద్రౌపదీ దేవికి పాండవులతో భర్త, మరది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరదికాడు , సహదేవుడు బావగాడు"
అనిదీవియర్ధం! చూశారా కాళిదాసు ప్రతిభ!
కాళికా వర ప్రసాదిగదా ఆతవికి యిక తిరుగేది?

RAINY SEASON HEALTH WITH PUDINA CURRIES



పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో జీర్ణశక్తి.. వర్షాకాలంలో ఆహార జాగ్రత్తలు
వర్షాకాలం వచ్చేస్తోంది. వర్షాకాలం మహిళలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు. వర్షాకాలంలో అజీర్ణవ్యాధి కలిగేటంత ఆహారం తీసుకోకూడదు. ఆకుకూరలు, వర్షాకాలంతో తినకపోతే మంచిది. కాయలు పులుసు సాంబార్, చట్నీలను తరుచూ తీసుకోవాలి.

ఆకుకూరలలో నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. వర్షాకాలంలో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వీలైనంత వరకు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించండి.

ఇక పుదీనా చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో చేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి రక్తాన్ని శుద్ధిపరుస్తాయి కూడా. వీటిని తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతోంది.

అలాగే పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి పూర్తిగా తగ్గించాలి. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. వేడిచేసి చల్లార్చిన నీరుతాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

WEEKLY THREE TIMES - TELUGU JOKE


ఆ మాట అడిగితే ఎలాగా.
.
. “పాశ్చాత్య సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఒక ఇరవై అయిదేళ్ళ అందాల భామ
ఒక కంపెనీలో సెక్రెటరీ పోస్టుకు అప్లయి చేసింది. 
పేరు, వయస్సు,విద్యార్హత,జాతీయత వగైరా వివరాలను అప్లికేషనులో పూర్తిచేసాక 
“సెక్స్” అనే కాలం వద్ద ఆగిపోయింది.
ఒకటి, రెండు నిమిషాలు సిగ్గుపడి చివరకు”వారానికి మూడు సార్లు మాత్రమే” అని రాసింది.

INFORMATION ABOUT NEW VEGETABLE - KASARAKAYALU OR KANCHARAKAYALU


ఇవి ఏమిటో ఎవరికైనా తెలుసా..?
రాయలసీమలో కడప,కర్నూల్, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన " కాసర కాయలు అక్కడి మాండలికంలో వేగంగా పలకడంలో..కాంన్చ్సర కాయలు" అనే కాయగూర ఇది.
కాకరకాయ లానే ఇది కూడ చెదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు.
ఒకటి ః వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడి ( పుట్నాల పొడి ) తో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న రొట్టల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు. 
రెండు ః నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు అప్పుడు నూనెలో వడియాల లాగ వేయించుకొని భోజనంలొ తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక నిలువ వుంటాయి చెడిపోకుండా...!!
ఇవి పంటి కింద పడి కరుమ్ కరుమ్ అని నులుగుతూ తింటూంటే  అదో రకపు చేదె గాని.. ఆ చెదు కూడ చాలా రుచిగా వుంటుంది.

WOMEN LIFE TELUGU POETRY


నువ్వు ఒప్పుకోవడానికి కాదు నేస్త౦ . . . ! ! ! ( స్త్రీ జీవితం)
.
నీకై నేనున్నానని,
నీకోస౦ నే వస్తానని,
నీతో నే వు౦టానని,
నువ్విచ్చిన ఆ మాట ఓ నేస్త౦ ఏనాటి నీటి మూట.!
నన్ను నమ్మి౦చడ౦ నీ నేర్పు,
నిన్ను నమ్మడ౦ నా తప్పు,
భగవ౦తుడు నాకిచ్చిన శాప౦ ఈ ఓర్పు.!
అ౦త్య ప్రాసల ఆన౦ద౦ కాదిది,
అతి(వ)వాదపు ఆలాపన కాదిది,
అశ్రువులలో ఆవిరౌతున్న ఓ అతివ ఆవేదన ఇది.!
.
(మనకవితలు )

FRESH KOTHIMERA HEALTH BENEFITS



ఆకుకూరలలో పచ్చిగా తినగలిగిన వాటిలో ఇది ఒకటి.దీని వల్ల మన శరీరానికి విలువైన పోషకపదార్దాలు అందుతున్నాయి. ఇకపోతే ఇందులో ఖనిజ పదార్దాలు, ఇనుము,విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, ఇనుము, సోడియం, కాల్షియం చాలా ఎక్కువగా వుంటాయి. అందుకే ఇది మానవుని ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఆకుకూర. అవ్వన్ని పక్కనపెడితే దీని వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

1.కొత్తిమీరలో వుండే బోర్నియోల్ జీర్ణ శక్తిని పెంచడమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో భాదపడే వారికి ఈ జ్యూస్ మంచి ఔషధం.

2.దీనిలో వుండే స్పెషల్ గుణాలు చర్మ సమస్యలను ముఖ్యంగా మొటిమలు,నల్లటి మచ్చలను దూరం చేస్తుంది.

3.బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ వుంచుతూ ఒత్తిడిని తగ్గిస్తూ ,గుండె సమస్యలను దూరం చేస్తుంది.

4.దీనిలో ఐరన్ కంటెంట్ అనీమియాను దూరం చేస్తుంది.

5.కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను నయం చేయడంలో ముఖ్యంగా అల్సర్ లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.

6.దీనిలో వుండే కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి.

7.జీర్ణ శక్తిని మెరుపరచడంతో పాటు కళ్ళ అరోగ్యాన్ని పెంచుతుంది.

8. కొత్తిమీరలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికరమైన కొవ్వు పదార్దాల స్థాయిని తగ్గిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు.

CAPITAL CITY OF PANDAVAS - INDRAPRASTHAM - FULL INFORMATIVE STORY IN TELUGU



ఇంద్రప్రస్థం

ఇంద్రప్రస్థం కథ... ధర్మచింతనులైన పాండవులను దుర్యోధనాదులకు దూరంగా గెంటివేయాలన్న దురుద్దేశంతో చక్రవర్తి ధృతరాష్ట్రుడు వారిని పిలిచి `నాయనలారా, మీరు ఖాండవప్రస్థం అనే చోటికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండండి… ‘ అని ఆదేశించాడు. మహారాజు ఆదేశానుసారంగా పాండవులు ఖాండవప్రస్థం చేరారు. అయితే, అది ఎలా ఉన్నదంటే- పూర్తిగా కొండలు గుట్టలు, చెట్లూచేమలూ… జనసంచారం చాలాతక్కువ. 

మహాసౌధాలతో కళకళలాడే హస్తినాపురి ఎక్కడ ? ఈ అటవీప్రాంతమైన ఖాండవప్రస్థం ఎక్కడ? కానీ, ధృతరాష్ట్రులవారు మాత్రం- `నాయనలారా, హస్తినాపురి ఎంతో ఈ ఖాండవప్రస్థం కూడా అంతే సుమీ… మీరక్కడ సుఖశాంతులతో వర్థిల్లండి’ అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేదన్నట్టుగా తేల్చి చెప్పాడు. పాండవులు హస్తినాపురి విడిచి ఖాండవప్రస్థం బయలుదేరారు. ఈ రాజ్యపంపకం హస్తినాపురవాసులకు నచ్చలేదు. ఇది అన్యాయమని వాపోయారు. కానీ మహారాజు నిర్ణయాన్ని ఎదిరించలేకపోయారు. పాండవులు ఖాండవప్రస్థం వెళ్ళిచూశారు. అక్కడ మెరక, పల్లపు భూములు చాలానేఉన్నాయి. చిన్నచిన్న గుట్టలు, భయంకరమైన అడవులు…అక్కడక్కడా పల్లెలు కనిపించాయి. ఇదీ ఖాండవప్రస్థ భౌగోళిక స్థితి. అయితే ఒకే ఒక్క సౌకర్యం ఉంది. ఈ ప్రాంతం పక్కనుంచే యమునానది ప్రవహిస్తోంది.

ఈలాంటి ఖాండవప్రస్థాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యుధిష్టిరుడు సంకల్పం చెప్పుకున్నాడు. అందుకు శ్రీకృష్ణుడు మద్దతు పలికాడు. స్థానికుల సాయంతో అటవీభూములను వ్యవసాయానికి అనుకూలంగా మలుచుకున్నారు. సకాలంలో వానలు పడటంతో నదులూ వాగులూ ఒప్పొంగాయి. పంటలు బాగా పండాయి. తినడానికి తిండి, త్రాగడానికి నీరు సంవృద్ధిగా అందుబాటులోకి వచ్చింది. దీంతో అభివృద్ధికి బాటలుపడ్డాయి. అవసరమైన చోట్ల రహదారులు నిర్మించారు. నెమ్మదిగా వాణిజ్యానికి అనుకూలవాతావరణం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వర్తక శ్రేణులు తమ వ్యాపారాలను ఈ ప్రాంతానికే తరలించారు. ధనధాన్యరాశులు వచ్చిపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

హస్తినాపురికి తీసిపోని విధంగా ఖాండవప్రస్థం రూపుదిద్దుకుంటోంది. ఖాండవప్రస్థం కాస్తా ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అంటే సాక్షాత్తు ఇంద్రుడు నివసించే ప్రాంతంలా విరాజిల్లింది. పాలనాపరమైన సౌకర్యాల కోసం ఒక రాజ్యసభ అవసరమైంది. దేవతలశిల్పి మయుడు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుని అందమైన రాజ్యసభను నిర్మించారు. ఆసభకు మయసభ అన్న పేరు సార్థకమైంది. సామంతరాజులు ధర్మరాజుని కీర్తించారు.

అడవిలో పడిఉండమని చక్రవర్తి శాసించినా కారడవిని మహానగరంలా మార్చిన పాండవుల తెలివితేటలు చూసి దుర్యోధనాదులకు కన్నుకుట్టింది. పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంతో ఈర్ష పతాకస్థాయికి చేరుకుంది. వెళ్లకూడదనుకుంటూనే ధుర్యోధనాదులు రాజసూయయాగానికి వెళ్ళారు. అక్కడి మయసభను విభ్రాంతితో చూశారు. దుర్యోధనుడు చిత్తభ్రాంతికి గురై మడుగులో కాలుజారి పడ్డాడు. అదే సమయంలో అక్కడున్న పాంచాలి నవ్వింది. దీంతో పరాభవాగ్నితో దహించుకుపోతున్న దుర్యోధనుడ్ని శాంతిపచేయడానికి శకుని మాయాజూదం అంకానికి తెరతీశారు. ఫలితంగా చివరకు మహాభారత యుద్ధం జరిగింది. ఇదీ నాటి ఇంద్రప్రస్థ కథ.

TRUE LOVE POETRY OF KRISHNA AND RADHA


అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

(దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత)

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల

పడిపోవు విరికన్నె వలపువోలె

తీయని మల్లెపూదేనె సోనలపైని

తూగాడు తలిరాకు దోనెవోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ,

పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు

కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద

TELUGU INFORMATION ABOUT MAYALAYA AMAVASYA



దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.

ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.
స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు.

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

Wednesday, 28 September 2016

SEX AND DIABETES IN ADULTS



మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన అనుమానాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా భలహిన పరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటి వారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచాటానికి కౌన్సిలింగ్‌ ఇచ్చి తరువాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడం వలన లైంగిక వైఫల్యాల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహా వ్యాధి గ్రస్తులతో లైంగిక సామర్థ్యం తగ్గకుండ ఉండాలంటే…

మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూర, మొలకెత్తిన విత్తనాలు, పాలు,గ్రుడ్లు, తాజా ఆకు కూరలు తీసుకోవాలి.

కీర దోసకాయ,క్యారెట్‌, బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి.

యాపిల్‌, జామ దానిమ్మ,ద్రాక్ష, నేరేడు, వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట స్మోకింగ్‌ గుట్కాలు, పాన్‌పరాగ్‌, నార్కోటిక్స్‌ తీసుకోవడం వంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం స్టెరాయిడ్‌ నిత్యం వాడటం వలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోతుంది.

తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్ల ప్రభావం చూపి లైంగిక సామర్థ్యంను తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తో పాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవర్చుకొనుటకు ప్రయత్నం చేయాలి.

ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్‌ చేయడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చును.

చికిత్స

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తి వంతమైన ఔషాధాలెన్నో హోమియో వైద్యంలో కలవు. వ్యక్తి యెక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకుని వైద్యం చేసినవో లైంగిక సమస్యలును త్వరితంగా నివారించవచ్చును.

మందులు

ఆసిడ్‌ ఫాన్‌

వీరికి నీరసం, నిస్త్రాణ ఎక్కువ.శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పని చేయును. అలాగే అంగము పూర్తిగా చెందక ముందే గాని, లేదా అంగప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతు, మధుమేహాంతో బాధపడేవారికి ఈ మందువాడి ప్రయోజనం పొందవచ్చును.

ఫాస్పరస్‌

వీరికి లైంగిక వాంఛ అధికం, కానీ సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించి దగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సున్నిత స్వభావులు. ఎదుటి వారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతి దానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

లైకోపోడియం

ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికి ముఖ్యమైనది. అతిగా కామకాలాపాల్లో పాల్గొనడం వల్ల , హస్త ప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పొయిన వారికి ఈ మందు చాలా ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఎప్పుడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం అహాం, పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లు నుదిటిపై ముడతలు పడుతాయి. ఎవరైనా కృతజ్ఙతలు తెలిపితే వెంటనే కంటతడి పెడుతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే వారు లైంగిక సామర్ధ్యం కొరకు ఆ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

ఎగ్నన్‌ కాక్టన్‌

వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామ వాంచ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరుచుగా జరుగును. వీరికి సంభోగ వాంచ కూడా ఉండకపోవుట గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న మధుమేహా వ్యాధి గ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

అవైనా సటైవా

నిత్యం మద్యం సేవిస్తూ, సరైనా నిద్రలేక నరాల బలిహీనత ఏర్పడి సంభోగ శక్తిని కోల్పోయిన డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

సెలీనియం

మానసికంగా కామ వాంఛ కొరిక ఉన్నా శారీరక అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధపడేవారకి ఈ మందు అలోచించదగినది.ఈ మందులే కాకుండా డామియాన, కెలాడియం, ఒనాస్మోడియం, చైనా వంటి మందులను లక్షణ సముదాయమును బట్టి డాక్టర్‌ గారి సలహా మేరకు వాడి మధుమేహాంలో ఎదుర్కునే లైంగిక సమస్యలనుంచి విముక్తి పొందవచ్చును.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌, హోమియోఫిజీషియన్‌
అంజనా హోమియో హెల్త్‌కేర్‌
హన్మకొండ సెల్‌ – 94402 29646

TENSION RELIEF IN WOMEN WITH EATING MUSHROOMS - ALSO PROTECTS FROM BREAST CANCER


మహిళలకు ఆరోగ్య చిట్కాలు

మహిళలూ పుట్టగొడుగులు తినండి.. ఒత్తిడిని తగ్గించుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

పుట్టగొడుగుల్లో “మ్యాజిక్ మష్రూమ్” అనే ఓ రకం మహిళలలో తరచుగా వచ్చే ఒత్తిడిని దూరం చేస్తుంది. ఈ పుట్టగొడుగుల్లో “సిలోసైబిన్”, “సిలోసిన్ మనోధర్మి” సమ్మేళనాలను కలిగి వుండే పుట్టగొడుగుల్ని మ్యాజిక్ మష్రూమ్ అంటారు. మెదడులోని నాడీ ప్రసారాన్ని ప్రభావిత పరిచే సామర్థ్యాన్ని కలిగి వుండి సైకోథెరపీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ మష్రూమ్‌లలో ఫోటోట్రోఫీక్ మందులుగా చేసి, కేంద్రనాడీ వ్యవస్థను ప్రభావిత పరచి, ఒత్తిడిని దూరం చేస్తాయి.

మష్రూమ్‌లలో ఏ రకమైనా “రక్తహీనత”ను దూరం చేస్తుంది. “మధుమేహాన్ని” నియంత్రిస్తుంది. మష్రూమ్ వెజ్ కావడంతో “హైబీపీ”ని కంట్రోల్ చేయడంతో పాటు “రక్తనాళాల్లోని కొవ్వును” తొలగిస్తుంది. వారంలో “నాలుగు సార్లు” మష్రూమ్ తీసుకోవడం ద్వారా పోషకలేమిని తొలగించుకోవచ్చు. ఇందులో” పీచు, విటమిన్, అమినో యాసిడ్స్, కొవ్వు, పిండిపదార్థాలు” తక్కువ స్థాయిలో ఉంటాయి.

మష్రూమ్‌లో కూరగాయలు, పండ్ల కంటే “ప్రోటీన్లు” అధికంగా ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ప్రోటీన్లు ఇందులో ఉండటం ద్వారా రక్తహీనతకు మష్రూమ్ దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇకపోతే మధుమేహగ్రస్థులకు మష్రూమ్స్ దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇవి పీచును కలిగివుండటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మోకాలు నొప్పులను దూరం చేస్తుంది. సంతాన లేమి, మహిళలకు గర్భ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. రోజూ మష్రూమ్ సూప్ తీసుకోవడం ద్వారా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణు సూచిస్తున్నారు.

Monday, 19 September 2016

INFORMATION IN TELUGU ABOUT WORKING PROCEDURE OF HUMAN KIDNEYS AND PROBLEMS ARISING TO KIDNEYS


ప్రతి రోజు మూత్ర పిండాలు నీరు, రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడబోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో వ్యర్థపదార్థాలు అన్ని విసర్జింపబడతాయి. మధుమేహం ఉన్న వారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగాఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్పేట్లు, ఆక్సిలేట్లు, మెగ్నీషియం, యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఇవి ఉంటే ఇవే అతి చిన్న స్పటికాలుగా మారతాయి. కొన్నిసార్లు ఒకే ఒక్క స్పటికం కూడా రాయిగా మారవచ్చు లేదా కొన్ని కలిసి రాయిగా మారవచ్చు.

కొందరిలో విటమిన్ ఎ, డిలు ఎక్కువగా ఉన్నా, విటమిన్ బి కాంప్లెక్స్ తక్కువగా ఉన్నా రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది. రాళ్లు ఏర్పడటానికి యూరిక్ ఆసిడ్ ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. అందుకే మాంసాహారుల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ సమస్య కారణంగా వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా తీసుకునే జెలసిల్ లాంటి ద్రవాలు కూడా రాళ్లు తయారు కావడానికి కారణం కావచ్చు. ఈ ద్రవాల్లో కాల్షియం ఉండటం వలన రాళ్లు ఏర్పడతాయి.

దాదాపు 10 శాతం రాళ్లు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి తీసుకునే మందుల వల్లే ఏర్పడతాయి. రోజూ మద్యపానం చేసేవారిలో కూడా ఈ సమస్యలు అధికంగా కనపడతాయి. అలాగే గౌట్ వ్యాధి ఉన్న వారిలోనూ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువే. వీటన్నిటినీ మించి అవసరమైనంత నీరు తాగకపోవడం రాళ్లు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఆహారంలోనూ రసాలూ, పులుసులూ ఇవేవీ లేకుండా పూర్తిగా ఘనాహారమే తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది ఈ సమస్యకు లోనవుతుంటారు.

FOOD HEALTH TIPS TO PREGNANT WOMEN AND ALSO AFTER DELIVERY TO KID


ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు - 


* బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 

* గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును.

* బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను.

* బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును.

* స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను.

* బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను.

* కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర
ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి .

* ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు .

* మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు .

బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు -


* ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు.

* చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.

* పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు.

* చల్లటి పదార్దాలు ముట్టరాదు.

పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి
గమనిక -

పైన చెప్పిన ద్రాక్షారిష్ట , సౌభాగ్య శొంటి ప్రముఖ ఆయుర్వేద షాపుల్లో లభించును.

************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

HOME REMEDY FOR KNEE PAIN - TAMARIND SEEDS GIVES PERMANENT SOLUTION TO OVERCOME KNEE PAIN


లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని మోకాళ్ల నొప్పి.. చింతగింజలతో మాయం

ఒకప్పుడు ముసలి వయసులో ఉన్నవాళ్లు 'మోకాళ్ల నొప్పులు' అంటూ ఉంటె.. వయసు అయిపోయిందని అనుకునే వారు. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం.. ఆహారపు అలవాట్లు. ఈ మోకాళ్ళ నొప్పులతో నే కాలం భారంగా గడుపుతూ ఉంటారు. ఇంకొందరు డబ్బులు ఉన్నవాళ్లు.. లక్షలు పోసి మందులు వాడిన వారు ఉన్నారు. అయినా వారికి ఆ నొప్పులు తగ్గడం లేదు. అయితే.. ఎన్ని మందులు వేసుకున్నా.. తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది. ఆయుర్వేద నిపుణులు సైతం ఈ వైద్యాన్ని అంగీకరిస్తున్నారు.

చింతకాయలు, చింతపండు తిన్నాక వచ్చే.. చింతగింజలను ఉపయోగించి మోకాళ్ల నొప్పికి మంచి ఔషదం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.

1: చింతగింజలను పండుగా వేయించాలి. 

2: బాగా వేగిన చింతగింజలను 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. 

3 : నీటిని మారుస్తూ 2 రోజులు నానిన తర్వాత వాటి పొట్టు త్వరగా వస్తుంది.

4: పొట్టును తీసి.. చింతగింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. 

5: ఎండిన తర్వాత ఆ చింతగింజలను మిక్సీ లో వేసి పొడిలాగా తయారు చేసుకోవాలి. 

6: ఆ పొడిని ప్రతి రోజూ ఒక్కో స్పూన్‌ చొప్పున రెండు సార్లు నీటిలో లేదా పాలల్లో కలుపుకుని తాగాలి.

ఇలా చేయడం వల్ల 30 రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుండి శాస్వత పరిష్కారం దొరుకుతుంది. 

Argan oil HEALTH AND BEAUTI TIPS IN TELUGU


ఆర్గాన్‌ నూనెతో అందం... ఆరోగ్యం..!

అందానికీ ఆరోగ్యానికీ ఆలివ్‌ నూనె ఎంతో మంచిదన్నది తెలిసిందే. కానీ ఆర్గాన్‌ నూనె దానికన్నా అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాయి తాజా పరిశోధనలు. మొరాకోలో ఎక్కువగా పెరిగే ఆర్గాన్‌ చెట్ల నుంచి తీసే ఈ నూనెను అంతా ‘మొరాకో బంగారం’ అని పిలుస్తారు. ఎందుకంటే విటమిన్‌-ఇ, విటమిన్‌-ఎలు సమృద్ధిగా ఉన్న ఆ నూనె అందానికీ ఆరోగ్యానికీ పెట్టింది పేరు. ఆలివ్‌నూనె(కిలోకి 320 మి.గ్రా.)లోకన్నా ఆర్గాన్‌ నూనె (కిలోకి 620 మి.గ్రా.)లో టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ) రెట్టింపు ఉంటుంది. ఈ టోకోఫెరాల్‌ సహజ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తూ కణాల్లోకి చేరి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎనాలజెసిక్‌ గుణాలు ఈ నూనెలో మెండుగా ఉన్నాయట. అందుకే ఇది అద్భుత ఔషధంగానూ అంతకుమించిన సౌందర్యలేపనంగానూ పనిచేస్తుంది.

* ఈ నూనెలో మోనో అన్‌శాచ్యురేటెడ్‌, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాలు ఎక్కువగా ఉండటంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఓలియాక్‌, లినోలిక్‌ ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఫలితంగా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది.

* ఇందులో పాలీఫినాల్స్‌తోబాటు రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా నిరోధించే స్టెరాల్సూ ఎక్కువగా ఉండటంవల్ల క్యాన్సర్లు వంటివి వచ్చే అవకాశం కూడా తక్కువట. పైగా ఇది బీపీనీ తగ్గిస్తుందని ఎలుకల్లో చేసిన పరిశీలనల ద్వారా తెలుస్తోంది.

* ఇది కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుందట. సంప్రదాయ వైద్యంలో భాగంగా మొరాకన్లు ఈ నూనెను అనేక చర్మసంబంధ వ్యాధుల్లోనూ వాడుతుంటారు.

* మొహంమీద మొటిమలూ చికెన్‌పాక్స్‌ మచ్చలూ వంటి వాటిని తొలగించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీన్ని అక్కడివాళ్లు బంగారంతో సమానంగా భావిస్తారు. ఇది మేనిమెరుపుని కాపాడడంతోపాటు శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేందుకూ దోహదపడుతుందట. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది.

Argan oil is a plant oil produced from the kernels of the argan tree that is endemic to Morocco. In Morocco, argan oil is used to dip bread in at breakfast or to drizzle on couscous or pasta. It is also used for cosmetic purposes.