WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 19 September 2016

INFORMATION IN TELUGU ABOUT WORKING PROCEDURE OF HUMAN KIDNEYS AND PROBLEMS ARISING TO KIDNEYS


ప్రతి రోజు మూత్ర పిండాలు నీరు, రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడబోస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో వ్యర్థపదార్థాలు అన్ని విసర్జింపబడతాయి. మధుమేహం ఉన్న వారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగాఉంటుంది. రక్తంలో కాల్షియం, పాస్పేట్లు, ఆక్సిలేట్లు, మెగ్నీషియం, యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఇవి ఉంటే ఇవే అతి చిన్న స్పటికాలుగా మారతాయి. కొన్నిసార్లు ఒకే ఒక్క స్పటికం కూడా రాయిగా మారవచ్చు లేదా కొన్ని కలిసి రాయిగా మారవచ్చు.

కొందరిలో విటమిన్ ఎ, డిలు ఎక్కువగా ఉన్నా, విటమిన్ బి కాంప్లెక్స్ తక్కువగా ఉన్నా రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది. రాళ్లు ఏర్పడటానికి యూరిక్ ఆసిడ్ ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. అందుకే మాంసాహారుల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ సమస్య కారణంగా వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా తీసుకునే జెలసిల్ లాంటి ద్రవాలు కూడా రాళ్లు తయారు కావడానికి కారణం కావచ్చు. ఈ ద్రవాల్లో కాల్షియం ఉండటం వలన రాళ్లు ఏర్పడతాయి.

దాదాపు 10 శాతం రాళ్లు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి తీసుకునే మందుల వల్లే ఏర్పడతాయి. రోజూ మద్యపానం చేసేవారిలో కూడా ఈ సమస్యలు అధికంగా కనపడతాయి. అలాగే గౌట్ వ్యాధి ఉన్న వారిలోనూ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువే. వీటన్నిటినీ మించి అవసరమైనంత నీరు తాగకపోవడం రాళ్లు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఆహారంలోనూ రసాలూ, పులుసులూ ఇవేవీ లేకుండా పూర్తిగా ఘనాహారమే తీసుకునే వారిలో కూడా ఎక్కువ మంది ఈ సమస్యకు లోనవుతుంటారు.

No comments:

Post a Comment