WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 30 September 2016

I LUV YOU BANANA - FULL STORY ABOUT BANANA FRUIT - HEALTH AND BEAUTY BENEFITS IN TELUGU ABOUT BANANA - ARATIKAYALU


అరటి పండ్లు , Banana

పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం . 
అరటి ఒక చెట్టులా కనిపించే మొక్క (నిజంచెప్పాలంటే ఇది ఒక హెర్బ్ మాత్రమే). ఇది మూసా అను ప్రజాతికి, మరియూ మూసేసి కుటుంబానికి చెందినది. కూర అరటి కి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది . అరటి చెట్టు కాండము, చాలా పెద్ద పెద్ద ఆకులతో (సుమారుగా రెండు నుండి మూడు మీటర్లు పొడుగు) నాలుగు నుండి ఎనిమిది మీటర్లు ఎత్తు పెరుగును. అరటి పండ్లు సాధారణంగా 125 నుండి 200 గ్రాములు బరువు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణము, ప్రాంతముల వారీగా మారుతుంది. ఈ బరువులో 80% లోన ఉన్న తినగల పదార్థము, 20% పైన ఉన్న తోలు.
ప్రపంచం మొత్తంమీద మన దేశం అరటిని పండించే విషయంలో రెండో స్థానంలో ఉంది. ఎంతోమంది రైతులకు, వ్యాపారస్థులకు ఇది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆర్థిక వెసులుబాటును కల్గిస్తూ బాసటగా నిలుస్తోంది.
* అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.
* నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.
* అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.
* మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).
* అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)
* అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)
* ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.
* అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.
పోషక విలువలు : అరటిపండులో ముందే చెప్పుకున్నట్లు
74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది.
23% కార్బోహైడ్రేటులు, ~
1% ప్రోటీనులు,
2.6% ఫైబరు ఉంటుంది.
ఈ విలువలు వాతావరణాన్ని, పక్వదశనుబట్టి, సాగు పద్దతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం , శ్రేష్టమైనది . వందగ్రాముల అరటిలో
* నీరు - 70.1 గ్రా.
* ప్రోటీన్ - 1.2 గ్రా.
* కొవ్వుపదార్థాలు - 0.3 గ్రా.
* పిండిపదార్థాలు - 27.2 గ్రా.
* కాల్షియం - 17 మి.గ్రా.
* ఇనుము - 0.4మి.గ్రా.
* సోడియం - 37 మి.గ్రా.
* పొటాషియం - 88 మి.గ్రా.
* రాగి - 0.16 మి.గ్రా.
* మాంగనీసు - 0.2 మి.గ్రా.
* జింక్ - 0.15 మి.గ్రా.
* క్రోమియం - 0.004 మి.గ్రా.
* కెరోటిన్ - 78 మైక్రో గ్రా.
* రైబోఫ్లెవిన్ - 0.08 మి.గ్రా.
* సి విటమిన్ - 7 మి.గ్రా.
* థయామిన్ - 0.05 మి.గ్రా.
* నియాసిన్ - 0.5 మి.గ్రా.
* శక్తి - 116 కిలోకాలరీలు

No comments:

Post a Comment