WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 30 January 2016

HEALTH WITH LIME WATER


 నిమ్మ రసంతో నిండైన ఆరోగ్యం

వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్ మటన్ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది. ఆ నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. 

నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్ యాసిడ్ వుంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేడ్స్ నిమ్మకాయలో పుష్కలంగా ఉంచేందుకు దోహదపడుతాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి.

అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం, నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది. వయసు మీద వడుతుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది. బ్లాక్ హెడ్స్ వంటివాటిని నివారిస్తుంది నిమ్మరసం.

ఎవరైనాసరే, పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది. అంతేకాదు గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం, నీరు కలిపి పుక్కిళీస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా వుండే పొటాషియం రక్తపోటు అంటే, బీపిని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా వుండడం, ఒత్తిడికి పనిచేస్తుంది నింబు పానీ. శ్వాశ కోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. ఆ విషయాన్నీ డాక్టర్లూ అంగీకరిస్తారు.

HEALTH BENEFITS WITH LIME WATER - NIMBO JUICE


నిమ్మరసంలో ఉండే దివ్య ఔషదం

నిమ్మకాయ దీని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రకృతి నుండి మనకు లభించే నిమ్మకాయను వరదాయినిగా చెప్పవచ్చు.నిమ్మపండు ను కేవలం కొన్ని వంటకాలలో రుచికోసం ఉపయోగిస్తారు,అలాంటి నిమ్మపండులో గొప్ప ఔషద గుణాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తేలియదు. 

నిమ్మకాయని నిత్యం మన నిజజీవితం లో ఏదో రూపం లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలామంచిది.

* ఉదాహరణ కు

01. ఎండాకాలంలో నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం మూలంగా నీరసం తగ్గి ఉత్సాహంగా పనిచేస్తారు.

02. పెసరుపప్పు,చారు లో కాస్త నిమ్మరసం కలిపి తింటె తేలికగ జీర్ణం అవుతుంది.

03. మాంసాహారంలో టేస్ట్ కోసం నిమ్మకాయను ఎక్కువగా వాడుతుంటారు.

* నిమ్మరసంలో ఉండే పోషకాలు

నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తుంది.

* నిమ్మరసం లో ఔషద గుణాలు

01. నిమ్మరసం కాస్తే ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచి ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతంగా తయారు అవుతుంది.ఈ రకంగా నిమ్మరసం చర్మసంరక్షణకు మేలు చేస్తుంది.

02. పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

03. నిమ్మరసంతో చేసే నిమ్మకాయ జ్యూస్‌లో ఎక్కువగా ఉండే పొటాషియం “రక్తపోటు” అదుపులో ఉంచుతుంది.

04. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండటం వంటివాటికి నిమ్మరసం దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

05. నిమ్మరసాన్ని తగినన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు తగ్గుముఖం పడుతుంది.

06. నిరాహార దీక్ష చేస్తూ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరం కోల్పోయిన ఉత్తేజాన్ని తిరిగి పొందుతుంది.

07. అజీర్ణంతో బాధపడుతుంటే నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.

08. నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.

09. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది.

10. ప్రతి రోజు నిమ్మరసం తో తయారు చేసిన టి తీసుకుంటే రక్తంలో చెక్కెర శాతం నియత్రణలో ఉంచుకోవచ్చు.

11. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

NIMBO FRUIT JUICER


నిమిషంలో నిమ్మరసం!

నిమ్మకాయను రెండు బద్దలుగా కోసి, గింజలు తీసి, బద్దను గట్టిగా పిండి రసం తీయడం అందరికీ బాగా తెలిసిన, అలవాటైన పద్ధతి. ఆ తర్వాత రసం తీసుకోవడానికి కొన్ని యంత్రాలు వచ్చాయి. వాటిలో నిమ్మబద్దను పెట్టి గట్టిగా నొక్కితే రసం వస్తుంది. అయితే ఈ పద్ధతిలో చేతికి రసం అంటుతుంది. కొన్నిసార్లు తొక్కలోని చేదు రసంలో కలిసిపోతుంది. కానీ సిట్రస్ స్ప్రిట్జర్‌తో మాత్రం ఇలాంటి సమస్యలేమీ ఉండవు.

నిమ్మకాయ మొదలును కొంచెం కోసి, స్ప్రిట్జర్‌ను కాయలోకి గుచ్చాలి. తర్వాత దీన్ని గట్టిగా నొక్కితే... స్ప్రే మాదిరిగా రసం బయటకు వస్తుంది. డెరైక్ట్‌గా వంటకంలో గానీ, సలాడ్ మీద గానీ చల్లేసుకోవచ్చు. చేతికి జిడ్డు, వాసన అంటవు. తొక్కలోని చేదు కాస్త కూడా రసంలో కలవదు. సులువుగా, శుభ్రంగా నిమిషంలో పనైపోతుంది. దీని వెల 150 రూపాయలు. ఈ ఫొటోలో ఉన్నది కాక మరో రెండు రకాలున్నాయి. వాటి ధర కూడా దాదాపుగా అంతే!

TELUGU BHAKTHI SONG FROM ANNAMAYYA


పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా


HOW TO TAKE CARE OF KIDNEYS - HEALTH TIPS FOR KIDNEYS


శరీరంలో ద్రవాలను సరైన స్థాయిలో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమ తుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి తొలగించడం, వివిధ రకాల హార్మోన్లను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలువరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి.
ఎక్కువ మందిలో కనిపించే సమస్య కిడ్నీలో స్టోన్స్‌. తీసుకునే ఆహారం, శరీరతత్వం వంటివి స్టోన్స్‌ ఏర్పడటానికి కారణమ వుతున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు గట్టిగా క్రిస్టల్‌ రూపంలో ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో గానీ, మూత్రనాళాల్లో గానీ ఏర్పడ తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడినట్లయితే నెఫ్రోలిథియాసిస్‌ అని, మూత్రనాళాల్లో ఉంటే యూరోలిథియాసిస్‌ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. అయితే స్ర్తీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఏర్పడతాయి. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న వారి లో ఈ సమస్య కనిపిస్తుంధీ
నొప్పి ఎప్పుడొస్తుంది ?
మూత్ర పిండంలో రాయి తయారవుతున్న సమయంలో ఏ బాధా ఉండదు. అందుకే ముందే గుర్తించలేరు. తయారయిన రాయి మూత్రనాళం ద్వారా బయటికి రాబోతున్న సమయంలో మాత్రమే నొప్పి వస్తుంది. వెన్నుభాగంలో మొదలయ్యే ఈ నొప్పి మామూలుగానూ కొన్ని సార్లు తీవ్రంగానూ ఉంటుంది. కొన్నిసార్లు, కూర్చోవడం, నిలబడటం, పడుకోవడం కూడా దుర్భరంగా మారుతుంది..
మూత్రనాళం సన్నగా ఉండడం వల్ల రాయి వెలుపలికి రాలేక పోవడం వల్ల కలిగే ఒరిపిడిలో ఈ నొప్పి వస్తుంది. మూత్రపిండాల్లో ఉన్నప్పుడు రాళ్లు చిన్నవిగానే ఉంటాయి. మూత్రాశయంలోకి చేరాక మాత్రం ఒకటి రెండు సెంటి మీటర్ల నుంచి దాదాపు చిన్న బంతి పరిమాణం దాకా పెరగవచ్చు. మూత్ర పిండం నుంచి రాయి మూత్రాశయంలోకి చేరగానే నొప్పి తగ్గిపోతుంది. కానీ, మూత్రాశయం నుంచి మూత్రనాళం ద్వారా బయటికి వచ్చే దశలో మళ్లీ నొప్పి తీవ్రమవుతుంది.
నీరు పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ స్పటికాలు, వ్యర్థపదార్థాలు సులువుగానే కొట్టుకుపోతాయి
మూత్రనాళంలో రాయి అడ్డుపడి నొప్పి పెరిగిపోతున్నప్పుడే శస్త్ర చికిత్స అవసరం రావచ్చు. రాళ్లు ఏర్పడటం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలకు మంచి మందులు ఉన్నాయి. మందులతో రాళ్లు కరిగిపోవు గానీ, మూత్రనాళాన్ని మందులు విశాలం చేస్తాయి.దీని వల్ల ఒకటి రెండు సెంటీ మీటర్ల పరిమాణం గల రాళ్లు బయటికి వెళ్లిపోతాయి.
మందులు వేసుకుంటున్నప్పుడు రాళ్లు మూత్రంలో వెళ్లిపోతుంటాయి. వాటిని భ ద్రపరిచి పరీక్షలకు పంపడం చాలా అవసరం. పలు కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. వైద్య పరీక్షల ద్వారా ఆ కారణమేమిటో తెలిసిపోతే అవి మళ్లీ రాకుండా అరికట్టడం కూడా సాధ్యమవుతుంది.
అయితే ఈ సమస్యను శాశ్వతంగా నివారించడం అన్నది కేవలం మందులతోనేకాదు. ఆహార పదార్థాల్లో చేసే మార్పులు కూడా ఇందుకు తోడ్పడతాయి. వీటన్నిటినీ మించి విరివిగా నీళ్లు తాగడం అన్నది మళ్లీ రాళ్లు రాకుండా చేసే గొప్ప విరుగుడు అని మరిచిపోవద్దు.

Home Remedies for Acidity - Top 10 Home Remedies FOR ACIDITY


అసిడిటీ

"ఇదివరకు ఏం తిన్నా అరాయించుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు
మనం తీసుకునే ఆహారం, మన జీవన శైలి, మన అలవాట్లు ఇవ్వన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అసిడిటీ కి కారణం అవుతున్నాయి
ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానివేయాలి.
మానసిక ఆందోళనను తగ్గించుకోవాలి.
ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ఫుడ్స్ తినకూడదు.
మసాలాలు ఉండే ఆహారం కాస్త తగ్గించాలి

దాని ప్రభావానికి గుండెల్లో మంట, నొప్పి, చికాకు వంటివి మొదలవుతాయి. ఇది గుండె నొప్పిలానూ ఉండొచ్చు. గుండెల్లో మొదలయ్యే నొప్పి గొంతు వరకూ కూడా వ్యాపించొచ్చు. అందుకే చాలామంది దీన్ని గుండె జబ్బుగా పొరబడి కార్డియాలజిస్టులనూ సంప్రదిస్తుంటారు
కానీ కాదు
ఇప్పుడున్న ఉరుకులు పరుగులు పెట్టె మన జీవన విధానం లో మార్పు తీసుకురావాలి, ఆహార నియమాలు, వ్యాయామం, భోజనం చేసాక కాసేపు నడవడం, తినగానే పడుకోకుండా ఉండటం, బాగా నూనె, వేసి చేసిన వేపుళ్ళు కాస్త తగ్గించడం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ జోలికి ఎక్కువ పోకుండా ఉండటం ఇలాంటి మార్పులు తీసుకొస్తే అసిడిటీ రాకుండా చూసుకోగలం ...
time కి తినడం, బాగా నమిలి తినడం ప్రధానం,..కాని మనకి ఉండే బిజీ షెడ్యూల్ ఉద్యోగాలు పనులు మానసిక వొత్తిడి వీటన్నిటి మూలంగా ఈ time కి తినడడం, నమిలి తినడం, మనం ఏం తింటున్నామో గమనించుకోకుండా ఉండటం సాధారణంగా చేస్తుంటాం
కాబట్టి కాస్త మన ఆహార అలవాట్లు జీవన శైలి మార్చుకోడానికి ప్రయత్నం చేద్దాం

BIRTH STORY OF LORD HANUMAN


 హనుమంతుని యొక్క జన్మ రహస్యం

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. 

హనుమాన్ జన్మ కథ, అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు, అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో, కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న కోతిని చూసి, ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా, చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది, కోపంతో అంజనను, ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా, ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి, వెంటనే ఆమె కోతిరూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన, ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు, అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు, అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు, అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు, గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె కోతి ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను, తన తండ్రిఅయిన కేసరి, తల్లి, అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

హనుమాన్, ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు, రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ, మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

REAL RAMAYANA STORY ABOUT KUMBHA KARNA


రామాయణంలో కుంబకర్ణుడి మరణం కథ..!

కుంబకర్ణడు సంవత్సరం అంటే ఇయర్ లో ఆరు నెలలు నిద్రపోతూనే ఉంటాడు. మేల్కొన్నప్పుడు ఆ ఆరునెలల ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. మళ్ళీ ఆరు నెలలు నిద్ర. ఇలా అన్నమాట. అతని శరీరం కొండంత పెద్దగా ఉంటుంది. పైగా అతడు చాలా బలవంతుడు కూడా. అలాంటి కుంబకర్ణుడికీ ఒక కథ ఉంది ఆ కథ గురించి తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథ చదవాల్సిందే...

* కుంబకర్ణ అంటే అర్థం

రామ మరియు లక్ష్మణుడు, ఇద్దరూ కూడా రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని సోదరుడు,కుంభకర్ణుడిని నిద్ర నుండి మేల్కొలపవలసిన అవసరం ఉన్నదని కనుగొన్నారు. కుంభ అంటే అర్థం ఒక రకమైన నీటి కుండ; కర్ణ అంటే వినికిడి అని అర్థం. కుంభకర్ణుడు తాటిచెట్టంత ఎత్తు ఉండి, అపారమైన శరీర పరిమాణం గల ఒక దిగ్గజం మరియు అతను ఆరు నెలల కాలం నిరంతరం నిద్ర పోతుంటాడని మరియు అతను నిద్ర నుండి మేల్కొనగానే ఏది కనపడినా,తన మార్గంలో ఏది ఎదురైనా ప్రతిదీ తినేస్తాడని చెప్పబడిఉన్నది.

* కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర

అతను నిద్ర మేల్కునే రోజు అతని ముందు ఎవరూ నిలబడలేరని రామాయణంలో చెప్పబడింది. కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర పూర్తి కాకముందే రావణాసురుడు మేల్కొల్పాడని మరియు అతనిని యుద్దానికి వెళ్ళమని సూచించాడని ఒక విచలనం ఉన్నది.

* యుద్ధం కోసం కుంభకర్ణుడు

యుద్ధం కోసం కుంభకర్ణుడు సిద్ధంగా ఉన్నాడని విభీషణుడు వినగానే, అతను రాముడితో " నా ప్రభువా, ఇది మరొక గొప్ప ప్రమాదం, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కుంభకర్ణుడు మీరు ఎప్పుడు చూడనటువంటి చాలా ప్రమాదకరమైన ఒక దెయ్యం. ఆధ్యాత్మికత గురించి వినటం చాలా సాధారణం, కాని ఈ కుంభకర్ణుడిని చూస్తే మీరు ఆధ్యాత్మికత గురించి మర్చిపోతారు మరియు ఆధ్యాత్మికత గురించి అనేక బాహ్య కల్పనలు, మాయలు మరియు మంత్రాలు సేకరించాలని అనుకుంటారు. కేవలం ఆధ్యాత్మికత యొక్క పదాలు వింటూ, మీకు పూర్తి జ్ఞానం కలిగినట్లుగా, ప్రతిదీ తెలుసు అన్న అనుభూతికి లోనవుతారు మరియు ఆచరణాత్మక ధ్యానం నుండి ఇది ఒక విచలనం మరియు దాదాపు ఒక స్థిరమైన నిద్ర అనే చీకటి వంటిది.

* కుంభకర్ణుని లక్షణాలు

ఇక్కడ, విభీషణుడు దైవ సంకల్పంతో, మనో నిబ్బరంతో ఈ విధంగా సూచించాడు. 'నా ప్రభువా! ఇవి కుంభకర్ణుని లక్షణాలు. అతనిని చంపగలిగినవాడు, మొదటగా పద్నాలుగు సంవత్సరాలపాటు పగలు, రాత్రి ఎటువంటి నిద్రపోనివాడు మరియు రెండవది గత పద్నాలుగు సంవత్సరాలపాటు ఏమీ ఆహారం తీసుకోనివాడు అయి ఉండాలి."

రాముడు చాలా కృంగిపోయి, అతను "ఎక్కడ నుండి అటువంటి వ్యక్తిని తెగలను?" అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు "నేను తిండి మరియు నిద్ర లేకుండా గత పద్నాలుగు సంవత్సరాలుగా జీవిస్తున్నాను. కాబట్టి నేనే తనను చంపగలిగే వాడిని" అని చెప్పాడు.

* బహుణ స్రుతేణ - మరియు కుంభకర్ణుడు

ఇది యుద్ధం రెండవ రోజున కుంభకర్ణుడితో చెప్పబడింది, యుద్ధం మొదటిరోజున కుంభకర్ణుడు ఇద్దరు సోదరులు చాలా శక్తివంతమైనవారుగా గ్రహించాడు, తన శక్తియుక్తులకు సరితూగగలిగేవారు అని కానీ రాముడి ప్రమాణాలకు తాను సరిపోక పోవచ్చు అని గ్రహించాడు మరియు - అందువలననే ఆధ్యాత్మికత కేవలం వినడం ద్వారా సాధించలేరు అని వేదాలలో చెప్పబడింది - న బహుణ స్రుతేణ - మరియు కుంభకర్ణుడు, తన నిజమైన సవాలు తమ్ముడు, లక్ష్మణుడే అని భావించాడు.

* రావణుడికి యుద్ధ పురోగతిని

అతను తన సోదరుడు, ఐదవ అంతస్తులో నిలబడి ఉన్న రావణుడికి యుద్ధ పురోగతిని వివరించటానికి వెళ్ళాడు. ఐదవ అంతస్తు విసుధ చక్ర (వెన్నెముకలో గర్భాశయ కేంద్రభాగం) ఆకారంలో ఉండి, శబ్దం ప్రతిధ్వని ఇస్తున్నది.

* కుంభకర్ణుడు అతనికి యుద్ధ విశేషాలను వివరిస్తూ ఇలా చెపుతున్నాడు

కుంభకర్ణుడు అతనికి యుద్ధ విశేషాలను వివరిస్తూ ఇలా చెపుతున్నాడు 'నా సోదరా! ఇది ఒక గొప్ప విజయం, కానీ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఇద్దరు సోదరులు గొప్ప యోధులు. నేను ఇటువంటి 'నరవీరులు' (మానవ హీరో, మానవ యోధుడు) ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. బహుశా వీరు ఇద్దరూ స్వయంగా దైవ అవతారపురుషులేమో అని నాకు ఒక అనుమానం కలిగుతున్నది. '

* రావణుడు చాలా కోపంతో

అప్పుడు రావణుడు చాలా కోపంతో ఈ విధంగా సమాధానమిచ్చాడు 'నేను ఇలాంటి బలహీనత మరియు నిరుత్సాహ పదాలు నా సోదరుడు నుండి వినదలుచుకోలేదు. నీవు ఒక పిరికిపందలాగా మాట్లాడటం తగదు. నీవు రావణుని సోదరుడు అని మర్చిపోవోద్దు.

* కుంభకర్ణుడు మరణం

కుంభకర్ణుడు చాలా నిరుత్శాహపడి తన సోదరుడితో ఇలా అన్నాడు " సోదరా! ఎప్పుడూ నేను బలహీనపడలేదు, నేను ఎప్పుడూ పిరికివాడిని కాను, కాలేదు కానీ ఒక నిజం అంగీకరించాలి. నేను నీ చిన్న తమ్ముడిని, నీకు ఏ విధమైన సలహాలను ఇవ్వలేను సరే! కానీ రేపు జరగబోయే యుద్ధంలో నేను మరణిస్తే మీరు లొంగిపోవాలని, స్వర్ణ లంక రక్షింపబడాలని ప్రార్థిస్తున్నాను.' మరుసటి రోజు జరిగిన యుద్ధంలో కుంభకర్ణుడు చంపబడ్డాడు.

HELATH BENEFITS WITH BROWN RICE


బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం)తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు. కానీ ఒంటికి మాత్రం ఖచ్చితంగా మంచిది. బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం. పాలిష్ చేయని బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. అసలు పాలిష్ పెట్టకుండా కేవలం వడ్ల పైన వుండే బయటి పొరను తొలిగిస్తే బియ్యపు గింజ గోధుమ రంగు లో వుంటుంది. పాలిష్ బాగా ఎక్కువ చేస్తే బియ్యపు గింజ తెల్లగా వుంటుంది. అయితే కావాలని కోరుకున్నా, ఇప్పుడు పట్టణాలలో దంపుడు బియ్యం కనపడ్డం కష్టం.

గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాల బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది. గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది. 

REASON BEHIND WEARING PEACOCK EYES OVER HEAD BY LORD SRI KRISHNA


శ్రీకృష్ణుడు నెమలి ఫించము ఎందుకు ధరిస్తాడు

మయూరనృత్యం మనసును ఆహ్లాద పరుస్తుంది. అందానికి నిండైన ఉదాహరణ నెమలి. హిందువుల ఆరాధ్యుడైన శ్రీకృష్ణ భగవానుడి అలంకారంలో నెమలిపింఛానికి ఉన్న విలువ అంతాఇంతాకాదు. పురాణేతిహాసాల్లో నెమలి ప్రస్తావన ఉండనే ఉంది. అందుకే మన జాతీయపక్షిగా నెమలిని గుర్తించారు. ఈ నెమలి ఈకలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసుకోవాంటే ఈ కథ చదవాల్సిందే..

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు? ‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం. ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు. పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి. అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది. అసలు నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము: శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షుల గాయాలు నయంచేసినందుకు గాను వృద్దుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, మీకు మల్లే నేను విహాంగంగా ఆకాశంలో విహారించాలిని ఉందని అది అనుగ్రహించండి. అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు, పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి ఉండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు' అని వెళ్ళిపోయాయి.

ఒకనాడు ఆకాశం మేఘావృతమై ఉండగా ఈ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్చరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తుండగా అతని భార్య చూసింది. ఆనాటి నుండి భర్తను ఎన్నో విధాలుగా హింసిస్తూ, వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలిసికున్న ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్దిచెప్పాలకున్నది. ఆ మంత్రము చేత కారుమేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో ‘అతి సుందర:' అనబోయి‘అసుందర' అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడనెమలిగా మారిపోయింది.

తమకు ఇచ్చిన వాగ్ధానాన్ని తప్పాడని ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మన్నాయి. రేతస్సు అనగా వీర్యం: దీనిలో అమొఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్ని పొంది వీర్యహీనులు అంటే తేజమును, శక్తిని కోల్పోతుండగా, యోగులు ఇదే వీర్యాన్ని‘ఊర్ధ్వపతన' క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గగాములుగా అవుతున్నారు.

ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానుడు పరమొత్తమమయిన పరమయోగి. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన నిఖార్సైన బ్రహ్మచారి. అందుకే ఆయన ‘అస్ఖలిత బ్రహ్మచారి' అయ్యాడు. నెమళ్ళకు తమ వీర్యాన్నీ ఊర్ద్వముఖంగా నడిపించినగల శక్తి గలవి. అయితే జ్జానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ రేతస్సు(వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్బం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీ పురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు. ఎప్పుడైతే, ఎక్కడైతే స్ఖలనము లేదో దాన్ని యోగీ యోగ సమానమై ఆరాధ్యనీయము , సూజనీయము గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత, సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు.

KISS - JOKES IN TELUGU

*అమ్మకానికి ముద్దులు జోక్*

ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. 

కౌంటర్ వెనుక గులాబిపువ్వుకంటే అందంగా ఉన్న రాణి అనే అమ్మాయి నిలబడి ఉంది.

"అమ్మకానికి ముద్దులు, ఒక్కో ముద్దు కేవలం వందరూపాయలే...!" అని అక్కడ బోర్డు కనిపిస్తోంది.

ఆశగా జేబులోనుంచి ఐదువందల రూపాయల నోటు తీశాడు మాధవరావు 

"ఐదు ముద్దులివ్వు" అన్నాడు అర్జెంటుగా.

"అలాగే..." అని డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న తన బామ్మవైపు తిరిగి రాణి, 

"బామ్మా ...! ఈయనకి ఐదు ముద్దులివ్వు..." అంది.

వెంటనే డ్రైవర్ వైపు తిరిగాడు మాధవరావు. 

"పెద్దమ్మగారు ఐదు ముద్దులిస్తారు, తీసుకొనిరా... 

అని గంభీరంగా చెప్పి వెళ్ళి కార్లో కూర్చున్నాడు.

FACE - BOOK - TELUGU JOKES


ఫేస్ బుక్
"ఫేస్ బుక్ తో కాలక్షేపం బాగానే వున్నట్టుందేమే.......ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు!" అడిగింది ఆండాళు.
.
"యేం కాలక్షేపమోనే......తెల్లారగానే అందరికీ 'శుభోదయం' అని చెప్పడం;
ఈనాడు పేపర్లో 'గ్రహం- అనుగ్రహం', 'అంతర్యామి' చదవడం,
ఆ తిథీ, వార నక్షత్రాలనుబట్టీ, పండగలని బట్టీ అందరికీ శుభాకాంక్షలు కొట్టడం;
ఇంక యెవరు ఆసుపత్రుల్లో వున్నారో చూసి, వాళ్లెప్పుడు పోతారో
అని 'RIP' సందేశాలని రెడీ చేసుకుని పెట్టుకొని, వాళ్లు పోయారని తెలియగానే 'అందరికన్నా ముందు' పోస్టు కొట్టడం;
మధ్య మధ్య లో ప్రొఫైల్ పిక్చర్ మారుస్తూ వుండడం;
రాత్రి అందరికీ 'శుభరాత్రి' అని చెప్పడం--వీటి తోనే సరి పోతోంది!
ఇంకా గ్రూపుల్లో ఛాట్లోటీ!
నేను రాద్దామనుకున్నవాటికీ, చూడాలనుకున్న వాటికీ టైమేదీ!"
వాపోయింది తాయారు నిట్టూరుస్తూ.

SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE - BHADRA


 లక్ష్మీ నరసింహ దేవాలయం, భద్ర

ఈ దేవాలయం 13వ శతాబ్దిలో హోయసల వంశస్ధులచే నిర్మించబడింది. విష్ణువర్ధన మనుమడు వీర నరసింహ దీనిని నిర్మించాడు. దీని ప్లాట్ ఫారం నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఈ గుడి మూడు అడుగుల ఎత్తున ఉండి మహా విష్ణువుకు అంకితం చేయబడినట్లు చెప్పబడుతుంది. ఇక్కడ శ్రీక్రిష్ణ, గణేశ, పురుషోత్తమ, మాత శారదాంబల విగ్రహాలను భక్తులు చూసి తరించవచ్చు. ఈ దేవాలయాన్నే త్రికూటాచల గుడి అని కూడా పిలుస్తారు. అదే ప్రాకారంలో బయటవైపు, రాతి స్తంభ ద్వజస్తంభం ఉంటుంది. ఈ దేవాలయ వెలుపలి భాగం హొయసలుల శిల్ప శైలిలో అందంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధీనంలో ఉంది.

LORD MAHADEV'S SIVA PURANAM IN TELUGU


శివపురాణం నుంచి కొన్ని విశేషాలు

01. పార్వతీదేవి విష్ణువు చెల్లెలు. అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది. లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు. ఎర్రగా ఉంటుంది. సరస్వతి శివుని చెల్లెలు. తెల్లగా ఉంటుంది.

02. సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.

03. శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమె వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు. ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.

04. నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.

05. విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు.విభూతి వైదికం. ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది. స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద, యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి.

06. తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.

07. శివుడికి పునః ప్రతిష్ఠ లేదు. శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.

08. ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం -కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ, అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.

09. కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించినవారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.

10. మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.

11. నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు.

ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.

Thursday, 28 January 2016

LORD SRI VENKATESWARA SWAMY PUJA ARTICLE


వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు. ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు.

ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ.
వాటిని తిరిగి పునఃప్రతిష్టించారు.

ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.

శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .

ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ.. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.

నారాయణ పాదములు

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.

అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.



ARTICLE ABOUT SRI TRILINGHA SWAMY VARU


త్రైలింగస్వామి

త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు.

ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు. తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు. తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150 సంవత్సరాలు పైన ఉన్నాడు.

స్వామివారు కేవలం ఆకులూ అలములు, పండ్లు ఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు. స్వామివారు ఎన్నో విషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. వేలాది ప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు. ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు. ఒక్కొక్కసారి నీటిలోపల, అలల క్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు. వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికా ఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం, స్వామికి ఏమీ కాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.

స్వామి అద్వైత ఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన విషపూరిత ద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామి అబద్దాలకోరు అని ఋజువు చేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు. సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు. త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు. స్వామివారిని కరుణించమన్నాడు. అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా! సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను. ఇంకెప్పుడు ఇలా చేయవద్దు. వెళ్ళీపో" అన్నాడు. ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.

స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు. అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది. అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు. కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పుల పైన పచార్లు చేస్తూ కనిపించేవారు. ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు. అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా. అలా ఐతే నీ మలం నీవే తినగలవా?" అని ప్రశ్నించాడు. స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు. ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది. ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు. ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.

స్వామివారు పుష్య శుద్ధ ఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు. వీరి సమాధి కాశి లో పంచగంగ ఘాట్ లో ఉంది.


NEW TECHNOLOGY FOR DETECTING CANCER DISEASE


క్యాన్సర్‌ కణాల గుర్తింపు ఇక సులువు ...!

• కలం పరిమాణంలో మైక్రోస్కోపు సిద్ధం 

మెదడులోని కణతి కణాలను విస్పష్టంగా చూపించే చిన్న మైక్రోస్కోపును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పెన్ను పరిమాణంలో ఉండే ఈ సాధనం ద్వారా శస్త్రచికిత్స సమయంలో రోగి మెదడులో కణతి కణాలన్నీ విజయవంతంగా తొలగించిందీ లేనిది ఆపరేషన్‌ గదిలో చూసుకోవడానికి వైద్యుడికి వీలు కలుగుతుంది. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన మిలింద్‌ రాజ్యాధ్యక్ష కూడా పాలుపంచుకున్నారు. కణతిని తొలగించే సమయంలో దాన్ని పూర్తిగా తొలగిస్తున్నదీ లేనిదీ తెలుసుకునే మెరుగైన విధానమేదీ ప్రస్తుతం శస్త్రచికిత్స నిపుణులకు లేదు. ఆపరేషన్‌కు ముందు మెదడుకు సంబంధించి తీసిన చిత్రాలు, స్వీయ స్పర్శ జ్ఞానం, దృష్టి జ్ఞానం సాయంతో వైద్యులు ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తుంటారు. అయితే శస్త్రచికిత్స సమయంలో కణస్థాయిలో జూమ్‌ చేసి వీక్షించడం వల్ల కణతికి, సాధారణ కణజాలానికి మధ్య తేడాను వైద్యుడు కచ్చితత్వంతో గుర్తించగలడు. దీనివల్ల రోగి పరిస్థితి మెరుగవుతుందని పరిశోధనకు నాయకత్వం వహించిన జోనాథన్‌ లియు తెలిపారు. ఈ దిశగా.. ప్రస్తుతమున్న మైక్రోస్కోపుల కన్నా నాణ్యమైన చిత్రాలను, వేగంగా అందించేలా చిన్న మైక్రోస్కోపును రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ‘డ్యుయల్‌-యాక్సిస్‌ కాన్ఫోకల్‌ మైక్రోస్కోపీ’ అనే కొత్త పరిజ్ఞానాన్ని వాడారు. అస్పష్టంగా ఉన్న కణజాలంలోకి చూడటానికి ఇది వీలు కల్పిస్తుంది. కణజాల ఉపరితలం కింద అర మిల్లీమీటరు వరకూ కూడా ఇది వీక్షించగలదు.

DENTAL PROBLEMS LEADS TO HEART ATTACK - BE CAREFUL


చిగుళ్ల వ్యాధి చిన్నది కాదు!

చిగుళ్ల వ్యాధి చిన్నగా.. పంటి మీద గార పేరుకుపోవటంతోనే మొదలవుతుంది. నెమ్మదిగా అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందటంతో తీవ్రమవుతుంది. చివరికి చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారటం, నొప్పి వంటి వాటి లక్షణాలతో తీవ్రంగా వేధిస్తుంది. తగు చికిత్స తీసుకోకపోతే దంతాలూ రాలిపోవచ్చు. కాబట్టి చిగుళ్ల జబ్బు బారినపడకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం ఉత్తమం.

* రోజూ ఉదయం పూట, రాత్రి పడుకునే ముందు పళ్లను తోముకోవటం.. ఫ్లాసింగ్‌ చేసుకోవటం ద్వారా చిగుళ్లవ్యాధితో పాటు పలు దంత సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే దంత నిపుణులతో ఏడాదికి కనీసం రెండుసార్లు పళ్లను శుభ్రం చేయించుకోవటమూ మంచిదే. దీంతో పళ్లకు గార పట్టకుండా చూసుకోవచ్చు.

* పొగ తాగేవారికి చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ. పైగా వీరికి చిగుళ్ల వ్యాధి వస్తే మందులు కూడా అంతగా పనిచేయదు. కాబట్టి సిగరెట్లు, బీడీల వంటివి కాల్చేవాళ్లు వాటిని మానెయ్యటం ఉత్తమం.

* ఒత్తిడిని తగ్గించుకోవటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

* సమతులాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అందువల్ల యాంటీఆక్సిడెంట్‌ గుణాలతో కూడిన విటమిన్‌ ఇ, విటమిన్‌ సి లభించే పదార్థాలు తీసుకోవాలి.

* పళ్లు నూరటం వల్ల పంటికి దన్నుగా ఉండే కణజాలం మీద ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ కణజాలం త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి పళ్లు నూరే అలవాటు గలవారు దాన్ని మానుకోవాలి.

BEAUTY AND HEALTH BENEFITS WITH MANDHARAM FLOWER


ముగ్ధ మందారం! 

ఆహ్లాదాన్నిచ్చే అందం మందార పూల సొంతం. పూలే కాదు ఆకులూ, వేళ్లూ ...ఇలా అన్నింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ అధికమే. 

మరి వాటిని ఉపయోగించుకుని ఎలా మెరిసిపోవచ్చో తెలుసుకుందామా?

వార్థక్య లక్షణాలను నిలువరించే శక్తిమంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్‌ ప్లాంట్‌ అనికూడా పిలుస్తారు. ఈ మొక్కలో చర్మానికి సాగే గుణాన్ని అందించి యవ్వనశోభతో మెరిసిపోయేలా చేసే లక్షణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని యాంటీ-యాక్సిడెంట్‌లు దుమ్మూధూళీ. అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. మందార పువ్వు రేకల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే అలసిన చర్మానికి ఉపశమనం ఉంటుంది.

* మందార ఆకులు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. పొడిబారిన వెంట్రుకలకు తగిన పోషణనందించి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. మందార ఆకుల్ని మెత్తగా నూరి దానికి బాగా మగ్గిన అరటిపండునూ చేర్చి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుని చూడండి. జుట్టు పట్టులా మెరిసిపోతుంది.

* రెండు టేబుల్‌స్పూన్ల మందారపొడికి చెంచా తేనె, కాసిని పాలు కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తుంది. అలానే మందారంలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. గాయాల తాలూకు మచ్చలు కూడా త్వరగా పోతాయి.

* పది నుంచి పదిహేను మందార ఆకుల్ని పావుకిలో కొబ్బరినూనెలో వేసి చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో మూడు నుంచి ఆరువారాల పాటు ఉంచాలి. ఆ తరవాత ఆకులు తీసేసి ఆ నూనెతో తలకు మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. మందార ఆకులతో పాటు కాసిని కరివేపాకు ఆకుల్నీ చేర్చి వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడి శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి.


ARTICLE ABOUT THE IMPORTANCE OF SEEMANTHAM



సీమంతం.!
(Babay Shower .)

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది.సీమంతం . 
కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం 
(అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం).
సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును. 
అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును. 
అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసెడి నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.

కాబట్టి సీమంతమనగా మనము చేసుకునే వేడుక గాదు. 
తల్లి, అత్తగారు, భర్త, శ్రేయోభిలాషులతో సంతోషముగా, ముత్తైదువుల ఆశీర్వాదము పొందుట ఏ మహిళకైనా మంచిదే. 

ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతం లో గాజులు తొడిగి పండంటి బిడ్డను
ఇమ్మని ఆశీర్వదిస్తారు. 
అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత జీవనాడుల ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకీ, గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉంది. అలా ఎక్కువ గాజులు తొడగడం వలన గర్భకోశం పై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుంది

Wednesday, 27 January 2016

QUICK BEAUTY TIPS FOR WOMEN IN TELUGU


రాత్రి రాస్తే.. ఉదయాన్నే అందం...!

ఒక్కోసారి రాత్రికి రాత్రే అందం రెట్టింపు అయిపోతే బావుణ్ణు అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఏ పెళ్లి వేడుకకో, పార్టీకో వెళ్లాల్సి వస్తుంది. అందం అనేది రోజుల్లోనే మెరుగవ్వదు కాని.. ఇలా పొద్దున్నే వేడుకలకు వెళ్లాలనుకునే వాళ్లు.. ఆ ముందు రోజు రాత్రి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
తక్కువ టైమ్‌లోనే ముఖ సౌందర్యాన్ని వెలుగులీనేలా చేసే గుణం అలొవీర సొంతం. జ్యూస్‌ లేదా జెల్‌ ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం మీదున్న చిన్న చిన్న గాయాలు, మచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. జెల్‌ రాసుకున్న గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అందరి ఇళ్లలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే క్రీమ్‌ వాజెలిన్‌. రాత్రి పడుకోబోయే ముందు కాళ్లు, చేతులకు రాసుకోవాలి. మునివేళ్లతో మెల్లగా మసాజ్‌ చేసుకుని.. చేతులకు కాటన్‌బట్టతో తయారైన గ్లౌజులు, కాళ్లకు ఉతికిన సాక్సులు వేసుకుంటే తడి ఆరిపోదు. పొద్దున్నే చర్మం నిగనిగలాడుతుంది. చర్మం సున్నితంగా తయారవుతుంది.
శరీరంలోని అన్ని భాగాల గురించి మనం పట్టించుకుంటాం కాని కనురెప్పల గురించి పెద్దగా పట్టించుకోము. అందుకనే మీరు రాత్రి పడుకునే ముందు.. కనురెప్పలకు ఒక టేబుల్‌ స్పూన్‌ ఆముదం పట్టించుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా తయారవుతాయి. రాత్రి పడుకునే ముందు తాజా కొబ్బరినూనెను ముఖానికి పట్టించుకోవాలి. ముఖరక్తనాళాల్లో రక్తం సాఫీగా సాగేందుకు చిన్నపాటి మసాజ్‌ కూడా అవసరం. దీనివల్ల ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. వయసుతో పాటు వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
చలికాలం, వర్షాకాలంలో దప్పిక తక్కువ. కాబట్టి మంచినీళ్లు ఎక్కువగా తాగరు. దానివల్ల శరీరం మొత్తం డీ హైడ్రేట్‌ అవుతుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లను తప్పక తాగాలి. ఆ చిన్న అలవాటే శరీరాన్ని డీ హైడ్రేట్‌ కాకుండా చూస్తుంది.
ఆల్మండ్‌ ఆయిల్‌లోకి కాస్త నిమ్మరసం కలుపుకుని.. ముఖానికి, కళ్లకింది భాగంలో రాసుకుంటే బెటర్‌. దీనివల్ల ఉదయాన్నే ముఖం చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కళ్లు నీరసంగా కనిపించవు.

MANGO BRINJAL FRY RECIPE IN TELUGU


వంకాయ+మామిడికాయ వేపుడు

కావాల్సిన పదార్ధాలు ;-

వంకాయలు -- అర కేజీ
మామిడికాయ -- సగం కాయ
ఉప్పు -- ఒకటిన్నర టీ స్పూన్స్
కారం -- రెండు టీ స్పూన్స్
సెనగపిండి -- ఒక టేబుల్ స్పూన్
ఎం . టి . అర్ సాంబార్ పౌడర్ -- ఒకటిన్నర టేబుల్ స్పూన్స్
నూనె -- రెండు టేబుల్ స్పూన్స్

తయారుచేసే విధానం ;-

ముందుగ వంకాయలను ముక్కలుగా తరిగి పెట్టుకుని , ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి . తరువాత మామిడికాయను ముక్కలుగా తరిగి మెత్తని గుజ్జులాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి . ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో నూనే వేసి ఉప్పు వంకాయ ముక్కలు వేసి వేయించాలి . వేగిన వంకాయలో మామిడి గుజ్జు వేసి ఐదు నిముషాలు వేయించి సెనగపిండి వెయ్యాలి . మళ్లీ ఐదు నిముషాలు ఆగి ఎం . టి . అర్ పౌడర్ వేసి కారం వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి . అంతే ఘుమఘుమ లాడే పుల్లపుల్లగా ,కారం కారంగా వంకాయ+మామిడికాయ వేపుడు రెడీ 

TOP ELEVEN WHATSUP TIPS IN TELUGU


ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 11 వాట్సాప్ ట్రిక్స్!
వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత సమర్థవంతంగా వాడుకునేందకు బెస్ట్ టిప్స్‌ను మీకు సూచిస్తున్నాం…
1.మీ వాట్సాప్ అకౌంట్ లో ఏదైనా మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే బుక్ మార్క్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేసి కొద్ది సేపు ఉంచండి. అప్పుడు, టాప్ బార్ పై delete, copy, forward అలానే star iconలు కనిపిస్తాయి. వాటిలో స్టార్ ఐకాన్ పై టాప్ చేసినట్లయితే మెసేజ్ బుక్ మార్క్ కాబడుతుంది.

2.>స్ర్కీన్ ఆఫ్ అయిన సమయంలోనూ వాట్సాప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..? వాట్సాప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సాప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.
3.మీ వాట్సాప్ మెసేజ్ లను ఈమెయిల్ కు పంపుకోవటం ఏలా..? మీ వాట్సాప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీ వాట్సాప్ మేసేజ్‌లను ఈమెయిల్‌లో బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారు..? అయితే ఇలా ట్రై చేయండి.. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.
4.మీ వాట్సాప్ అకౌంట్‌కు డీఫాల్ట్‌గా వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను చూసి బోర్‌గా ఫీలవుతున్నారా..? అయితే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో వాట్సాప్‌ను తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.
5.మీ వాట్సాప్ అకౌంట్ లోని కాంటాక్ట్స్ కు షార్ట్ కట్ లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. షార్ట్ కట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పై టాప్ చేయండి. ఇప్పుడు అనేక ఆప్షన్ప్ స్ర్కీన్ పై పాపప్ కాబడతాయి. వాటిలో మొదటి ఆప్షన్ అయిన ‘add chat shortcut’ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కాంటాక్ట్ కు షార్ట్ కట్ క్రియేట్ కాబడుతుంది.
6.వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.
7.వాట్సాప్ వెబ్ ఫీచర్ అందుబాటులోకి రావటంతో వాట్సాప్ అకౌంట్‌లను డెస్క్‌టాప్ పీసీల పై హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మీ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.
8.ఆండ్రాయిడ్ యూజర్లు మెనూ‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సాప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.
9.>వాట్సాప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్ క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్‌‍లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి.
10.మీ వాట్సాప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody’.
వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ’ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.