WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 28 January 2016

DENTAL PROBLEMS LEADS TO HEART ATTACK - BE CAREFUL


చిగుళ్ల వ్యాధి చిన్నది కాదు!

చిగుళ్ల వ్యాధి చిన్నగా.. పంటి మీద గార పేరుకుపోవటంతోనే మొదలవుతుంది. నెమ్మదిగా అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందటంతో తీవ్రమవుతుంది. చివరికి చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారటం, నొప్పి వంటి వాటి లక్షణాలతో తీవ్రంగా వేధిస్తుంది. తగు చికిత్స తీసుకోకపోతే దంతాలూ రాలిపోవచ్చు. కాబట్టి చిగుళ్ల జబ్బు బారినపడకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం ఉత్తమం.

* రోజూ ఉదయం పూట, రాత్రి పడుకునే ముందు పళ్లను తోముకోవటం.. ఫ్లాసింగ్‌ చేసుకోవటం ద్వారా చిగుళ్లవ్యాధితో పాటు పలు దంత సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే దంత నిపుణులతో ఏడాదికి కనీసం రెండుసార్లు పళ్లను శుభ్రం చేయించుకోవటమూ మంచిదే. దీంతో పళ్లకు గార పట్టకుండా చూసుకోవచ్చు.

* పొగ తాగేవారికి చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం ఏడు రెట్లు ఎక్కువ. పైగా వీరికి చిగుళ్ల వ్యాధి వస్తే మందులు కూడా అంతగా పనిచేయదు. కాబట్టి సిగరెట్లు, బీడీల వంటివి కాల్చేవాళ్లు వాటిని మానెయ్యటం ఉత్తమం.

* ఒత్తిడిని తగ్గించుకోవటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

* సమతులాహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అందువల్ల యాంటీఆక్సిడెంట్‌ గుణాలతో కూడిన విటమిన్‌ ఇ, విటమిన్‌ సి లభించే పదార్థాలు తీసుకోవాలి.

* పళ్లు నూరటం వల్ల పంటికి దన్నుగా ఉండే కణజాలం మీద ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ కణజాలం త్వరగా దెబ్బతింటుంది. కాబట్టి పళ్లు నూరే అలవాటు గలవారు దాన్ని మానుకోవాలి.

No comments:

Post a Comment