WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 30 January 2016

HEALTH WITH LIME WATER


 నిమ్మ రసంతో నిండైన ఆరోగ్యం

వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్ మటన్ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది. ఆ నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. 

నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్ యాసిడ్ వుంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేడ్స్ నిమ్మకాయలో పుష్కలంగా ఉంచేందుకు దోహదపడుతాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి.

అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం, నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది. వయసు మీద వడుతుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది. బ్లాక్ హెడ్స్ వంటివాటిని నివారిస్తుంది నిమ్మరసం.

ఎవరైనాసరే, పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది. అంతేకాదు గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం, నీరు కలిపి పుక్కిళీస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా వుండే పొటాషియం రక్తపోటు అంటే, బీపిని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా వుండడం, ఒత్తిడికి పనిచేస్తుంది నింబు పానీ. శ్వాశ కోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. ఆ విషయాన్నీ డాక్టర్లూ అంగీకరిస్తారు.

No comments:

Post a Comment