పాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము.
మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.
పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మ ైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీమ ుడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.
ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా? పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు.
మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని. మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము. కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు.
పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మ