WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 7 December 2015

BRIEF INFORMATION ABOUT LORD SRI ANJANEYA SWAMY TEMPLE - KONDAGATTU - KARIMNAGAR DISTRICT - INDIA


కొండ గట్టు 

.పేరెన్నిక గన్న పుణ్యక్షేవూతాలలో కొండగటు ఒకట్టి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామ సమీపంలో ఉంది. నుండి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో కలదు. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము.
చరిత్ర.....
పూర్వము రామ రావణ యుద్దము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొందగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.
విగ్రహంలోని విశేషం.......
ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రాస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగా దులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతా ళాన్ని ప్రతిష్టించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు 'శ్రీ ఆంజనేయుడు' స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకో సాగారు


No comments:

Post a Comment