WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 7 December 2015

GOMATHA PUJA PRAYER


గోమాత దర్శనము చేయునప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి నమస్కరించాలి.
నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవచ |
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ||
గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్టతః |
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యహం ||
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలంకృతే | 
మాతర్మమ్మభిలషితం సఫలం కురు నందిని ||
అని గోమాతను నమస్కరించాలి 
... .... ....

నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయీభ్య ఏవచ |
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః || 
భావం:-
శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము
గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పృష్టతః |
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యహం ||
భావం:--
గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను..... 
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలంకృతే | 
మాతర్మమ్మభిలషితం సఫలం కురు నందిని || 
భావం:--
ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా !అమ్మా! నా కోర్కెలను సఫలం చేయుము.

No comments:

Post a Comment