WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 7 December 2015

HANUMAN SANKALPAM IN TELUGU


హనుమంతుని సంకల్పం

రామాయణంలో ఆంజనేయుడు సీతానే్వషణకు ఉపక్రమిస్తాడు. మొదట ఆయన అనుకున్నది తడవగా ఆమె జాడకై వెతకలేదు. ముందుగా ఆ స్వామి మనసులో బలంగా సంకల్పం చేసుకున్నాడు. మనసులో ఆ రాముడిని స్మరించుకుని ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనాసరే నేను సీతమ్మ జాడను కనిపెడతాను. ఆ రామయ్య వద్దకు సీతమ్మని చేరుస్తాను అని మనసులోనే బలంగా సంకల్పించుకున్నాడు. అతను అంత బలంగా సంకల్పించుకోవడం చేతనే ఆయన అంత పెద్ద సముద్రాన్ని సైతం అవలీలగా దాటిసాగాడు. రాక్షసులు ఎంత ప్రయత్నించినా చిక్కకుండా వారిని ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి సీతమ్మను చూశాడు. ఆ విషయాన్ని శ్రీరాముడికి తెలియజేశాడు. అలా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు.

ఈ సంకల్పం అనేది ఎంత బలంగా వుంటే అంతే వేగంగా కోరికలు కార్యరూపం దాల్చుతాయి. సంకల్పం బలహీనమైతే కోరికలు ఎట్టి పరిస్థితులలో నెరవేరవు. అసలు ఈ సంకల్పం అంటే ఏమిటి. అది ఎలా బలపడుతుంది. మనసులో మనం ఏదైతే కావాలని పదే పదే మనసా వాచా బలంగా కోరుకుంటామో అదే సంకల్పంగా మారుతుంది. సంకల్పం బలపడాలంటే దానికి మనస్సు, వాక్కు, ఆత్మశుద్ధి వుండాలి. వీటికితోడు దైవబలం వుండాలి.

ఎవరైతే పవిత్రమైన మనసుతో ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుంటారో, అట్టివారు తక్షణమే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. సంకల్పం నిస్వార్థమైనది అయితే అంతా శుభకరమే జరుగుతుంది. స్వార్థంతోకూడిన సంకల్పాలు ఎన్నటికీ నెరవేరవు. వ్యక్తి జీవితం అంతా సంకల్ప వికల్పాల చుట్టే తిరుగుతుంది. మానవ సంకల్పానికి దైవ సంకల్పం తోడైతే అది ఎంతటి కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది.

No comments:

Post a Comment