WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 10 November 2015

ARTICLE ABOUT THE IMPORTANCE OF COW IN HINDUISM


భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రము మరియు పేడ సైతం ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయి...గోమాత ఆరోగ్యప్రదాతగా యావత్‌ ప్రపంచం నేడు గుర్తించింది

ఆవు పాలలోని వివిధ గుణాల కారణంగా ఆవు పాలను అమృతం అని చెప్పబడింది. ఆవుపాలు ఔషదాలలో ఘటకాంశంగా నిలచింది. ప్రతిరోజు మన ఆహారంలో పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి మొదలగునవి వాడబడతాయి. ఇతర ప్రాణుల మలాన్ని అశుద్ధంగా చెప్పబడినా, ఆవు పేడ మాత్రం ఎంతో శుభకరమైనదిగా చెప్పబడింది. సైన్స్‌ ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని అని చెప్పడం జరిగింది. మొక్కలకు మరియు చెట్లకు ఆవుపేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఔషదాలలో ఆవు మూత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. పూజల్లో సైతం ఆవు మూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. గొప్ప ఔషదగుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదుటి భాగంలో ఓ సంచిలాంటి దానిలో ఉంటుంది. గోరోజనము ఆయుర్వేదం సూచించే ఓ గొప్పదైన ఔషదం. ఇన్నీ ప్రయోజనాలతో కూడిన, ఎంతో ఉపయోగాత్మకమైన ఆవుకు గోమాత అనే పేరు సార్ధకమైనదే.

పవిత్రతకు చిహ్నం: 
భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించదం ఎంతో శుభశకునంగా భావించబడింది. శ్రీ కృష్ణ్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇన్నీ ప్రయోజనాలతో కూడిన, ఎంతో ఉపయోగాత్మకమైన ఆవుకు గోమాత అనే పేరు సార్ధకమైనదే.

అందరికీ ఆప్తమిత్రుడు: 
మానవ జాతికి ఆప్తమిత్రుడు ఆవు. హజరత్‌ మహ్మద్‌ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతముందని, దాని మాంసం తింటే రోగిస్టులవుతారని హెచ్చరించాడు. ఏసుక్రీస్తు ఒక ఎద్దును వధిస్తే ఒక మనిషిని చంపినట్లుగా భావించాలన్నాడు. గాంధీజీ గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. గోసంతతిని కాపాడితే ఈశ్వరుడు సృష్టించిన ప్రాణకోటిని రక్షించినట్టే.. స్వామి దయానంద సరస్వతి గోకరుణా నిధిలో ఒక ఆవు తన జీవన కాలంలో లక్షల మందికి పైగా ఒక పూట భోజనాన్ని సమకూర్చగలదు అని వాఖ్యానించారు. రుగ్వేదం ఆవును అషున్యా అని.. గోవు ఎవరికీ సాటి లేనిదని యజుర్వేదం.. ఆవు సంపదలకు పుట్టినిల్లని అధర్వణ వేదం వర్ణించాయి. అమృతం సేవిస్తున్నప్పుడు బ్రహ్మ నోటి నుంచి కారుతున్న నురుగ ద్వారా ఆవులు జన్మించాయని, ఆవుల పాలతో సముద్రం ఉద్భవించింది. సముద్ర మధనం జరిగినప్పుడు కామధేనువు అవతరించింది.

అణువణువూ పూజితమే: 
బ్రహ్మపురాణంలో వ్యాస భగవానుడు సమస్త గోవులు విష్ణు స్వరూపం, అన్ని అవయాలలో భగవానుడైన కేశవుడు విరాజమానుడై ఉన్నాడు. ఆవు ముఖంలో నాలుగు వేదాలు నిక్షిప్తమై ఉన్నాయని పద్మ పురాణం చెప్పింది. సమస్త వేదాలు ఆనందంతో గోవులను స్తుతిస్తాయి. ఆవు పాలను తాగిన శ్రీకృష్ణ్ణుడు జ్ఞానాన్ని పెంచుకుని లోకాలను ఉద్ధరించడానికి గీతా జ్ఞానాన్ని ప్రబోధించాడు. శ్రీకృష్ణ్ణుడు ప్రత్యక్షం కావాలంటే ఆయనకు ఇష్టమైన గోవులను పూజిస్తే చాలు. కృష్ణ భగవానునికి మరోపేరు గోపాలుడు అంటారు.గోప బాలురతో కూడిన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుని ప్రకోపం నుంచి గోవులను, సమాజాన్ని రక్షించాడు. బోళా శంకరుని వాహనం నంది. రుషభ దేవుని చిహ్నం ఎద్దు. శివ మందిరాలలో నంది ప్రతిష్ఠితమై ఉంటుంది. గోస్వామి తులసీదాసు ధర్మార్థ కామ మోక్షాల ఫలాలు ఆవుయొక్క నాలుగు పొదుగు స్థానాలలో నిక్షిప్తమై ఉన్నాయని అభివర్ణించారు. సంత్‌నామ దేవుడు ఢిల్లీ పాదుషా కోరిక మేరకు మృతిచెందిన గోవును బతికించి అందరిని అబ్బురపరిచారు. సిక్కుల పదవ గురువు గోవిందసింహుడు చండీదివార్‌లో గోరక్షణ కోసం దుర్గాభవాని నుంచి దీవెనలు పొందారు. హిందువులు గోపూజ జరిపితే పారశీకులు ఆంబోతును ఆరాధిస్తారు. అక్కడి ప్రాచీన నాణేలపై, పిరమిడ్లపై ఎద్దుల చిత్రాలను చిత్రించేవారు. జైనుల ఆగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంహరించతగదని జైనులు పేర్కొన్నారు. భగవాన్‌ మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించడంలో అర్థం లేదన్నారు.

ఆవు పాలలో ఎన్నో గుణాలు 
ఆవు వెన్నెముకలో సూర్యకేతు నాడి ఉంటుంది. ఈ నాడి సూర్యుని ప్రకాశంతో మరింత ఇనుమడిస్తుంది. ఈ నాడి చేతన పొందిన క్షణంలో పచ్చని ద్రవాన్ని వదిలిస్తుంది. అందుకే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. విషాన్ని హరించే శక్తి ఆ పాలకు ఉంటుంది. ఆవు నెయ్యి, బియ్యం రెండు కలిపి వేడి చేస్తే శక్తివంతమైన గ్యాస్‌లు, ఇథలిన్‌ ఆక్సైడ్‌, ప్రోపలీన్‌ ఆక్సైడ్‌ ఉత్పన్న మవుతాయి. ఈ ఆక్సైడ్‌లు జీవన రక్షణగా ఉపయోగపడతాయి. కృతిమ వర్షాన్ని కురిపించడం కోసం ప్రోపలీన్‌ ఆక్సైడ్‌ ఆధారం అని విజ్ఞానవేత్తలు సూచించారు.

గోవు, గోమూత్రం, పేడలతో సర్వరోగ నివారణ 
* మన గో సంతతి ఉత్పాదనలో పేడ, మూత్రం చాలా ముఖ్యమైనది. భారతీయ వ్యవసాయంలో ఈ రెండింటితో ఎరువులు, క్రిమిసంహారక మందులు అవసరం లేకుండా భూసారాన్ని కాపాడి ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
* ఆవు పేడను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి గోబర్‌గ్యాస్‌ యంత్రాలను ఏర్పర్చుకుని పొయ్యి వెలిగించుకోవచ్చు. యంత్రాలను నడిపించగల శక్తి ఉంటుంది. విద్యుత్‌ ఉత్పత్తి , దేశీయ ఎరువులు తయారవుతాయి.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమమైన కీటకనాశిని, ఎరువుగా పేరుంది. గోమూత్రంలో అధికంగా నీరు కలిపి పంటలపై చల్లితే పంట దిగుబడితో పాటు ఖర్చు తగ్గుతుంది.
* గోవు పేడ, గోమూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులు నయమవుతాయి. దేశీ ఆవుల మూత్రం గంగాజలంతో సమానం.
* గోమూత్రంలో నైట్రోజన్‌, కార్పోలిక్‌, ఆసిడ్‌ రసాయనాలున్నాయి. ఆవు మూత్రంలో లాక్టోజ్‌, సల్ఫర్‌, అమ్మోనియా గ్యాస్‌, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, యూరియా, ఉప్పు, పలు రకాల క్షారములు, ఆమ్లం ఉంటాయి.
* పేడలో 16 రకాలైన ఉపయోగకరమైన ఖనిజాలు ఉన్నాయి. గోమూత్రంలో జిల్లేడు, వేప, తులసి ఆకులను నానబెట్టి నీటితో కలిపి క్రిమి సంహారక మందులను చేసుకొవచ్చు.
ఆవులోని ఔషధ గుణగణాలు
* అటామిక్‌ రేడియేషన్‌ నుంచి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలలో వుందని రష్యా శాస్తవ్రెత్త శిరోవిచ్‌ ఆనాడే గుర్తించాడు.
* పారవేసిన పదార్థాలు ఆవులు తిన్నప్పటికీ వాటి పాలు స్వచ్ఛమైనవిగా ఉంటాయి.
* ఇండ్లల్లో వాకిళ్లను ఆవుపేడతో అలికితే వారు రేడియో ధార్మిక కిరణాల నుంచి సురక్షితంగా ఉంటారు.
* పాలు తాగితే హృదయ సంబంధరోగాలు దూరమవుతాయి. అదేవిధంగా శరీరంలోని చురుకుదనాన్ని కలిగిస్తాయి.
* జ్ఞాపకశక్తికి ఆవు శ్రేష్ఠమైనది. ఆవు నెయ్యిని వేడి చేస్తే దానివల్ల వచ్చే పొగ వాతావరణ కాలుష్య రహితం చేస్తుంది.
* నెయ్యితో యజ్ఞయాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుంచి రక్షణ అభిస్తుంది.
* ఆవు దాని సంతతి వినిపించే శబ్దాలతో మానవుల్లోని మానసిక వికారాలు నిర్మూలమవుతాయి.
* ఆవు పేడలో కలరా వ్యాధిలోని క్రిములను నాశనం చేయగల లక్షణాలు ఉన్నాయని ప్రముఖ వైద్యులు పరిశోధనలో తెలిపారు.
* క్షయ రోగులను కొద్ది రోజులు గోశాలలో ఉంచితే ఆవు పేడ, ఆవు మూత్రం యొక్క వాసనలకు క్షయ రోగం నాశనమవుతుంది.
* ఒక తులం నెయ్యితో యజ్ఞం నిర్వహిస్తే ఒక టన్ను ఆక్సిజన్‌ పెరుగుతుంది.
* పశువధశాలల వల్ల భూకంపాలు సంభవిస్తాయని పూర్వీకులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment