WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 7 November 2015

DIWALI SPECIAL PATAKA PALAV RECIPE IN TELUGU


పటాకా పులావ్ 

కావలసినవి 

బాస్మతి బియ్యం: అరకిలో, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: ఎనిమిది, పుదీనా కట్ట: ఒకటి, కొత్తిమీర కట్ట: ఒకటి, టొమాటోలు: రెండు, క్యారెట్: ఒకటి, పెరుగు: అరకప్పు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, కారం: 2 టీస్పూన్లు. గరంమసాలాపొడి: అరటీస్పూను, నూనె: తగినంత, సెనగపిండి: 100గ్రా., ఉప్పు: సరిపడా

తయారుచేసే విధానం

* ఓ గిన్నెలో సెనగపిండి, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర తురుము, కాస్త పచ్చిమిర్చి తురుము, కాస్త నూనె కలపాలి. తగినన్ని నీళ్లు చల్లి, చిన్న ఉండలుగా చేసి రెండు చేతులతో పాముతూ బుల్లెట్లు మాదిరిగా చేసి కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.

* ఓ మందపాటి గిన్నెలో 100 గ్రా. నూనె పోసి ఉల్లిముక్కలు ఎర్రగా వేయించాలి. అందులోనే అల్లంవెల్లుల్లి, మిగిలిన పచ్చిమిర్చిముక్కలు, పుదీనా తురుము, మిగిలిన కొత్తిమీర తురుము, కారం, పసుపు, గరంమసాలా, టొమాటోముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించాలి. తరవాత పెరుగు వేసి ముప్పావులీటరు నీళ్లు పోసి ఉప్పు వేసి కలపాలి. ఎసరు మరిగాక కడిగిన బియ్యం వేసి మూతపెట్టి ఉడికించాలి. నీరు దాదాపుగా ఇంకిపోయాక వేయించిన బుల్లెట్లు వేసి కలిపి సన్నని మంటమీద అన్నం పూర్తిగా ఉడికేవరకూ ఉంచి దించాలి.

No comments:

Post a Comment