WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 16 December 2014

PUT CHECK TO CANCER WITH RED WINE - CANCER CARE HEALTH TIPS WITH RED WINE IN TELUGU


రెడ్‌ వైన్‌తో కేన్సర్‌కు చెక్‌

హెడ్‌, నెక్‌ కేన్సర్ల బారిన పడకుండా రెడ్‌ వైన్‌ మనల్ని రక్షిస్తుందట. ఇందులో ఉండే రెస్‌వెరాట్రోల్‌, గ్రేప్‌ స్కిన్‌ పదార్థాలు కేన్సర్‌ బారిన పడకుండా మనల్ని కాపాడతాయిట. ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలోని జన్యు కణాలు దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్న కణాలను రెస్‌వెరాట్రోల్‌ చంపేస్తుంది. ఆల్కహాల్‌ ఎక్కువ తాగడం, ఎఎల్‌ డిహెచ్‌ జన్యువు లోపించడం , డిఎన్‌ఎ దెబ్బతినడం వంటి కారణాల వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్కహాల్‌ తాగడం వల్ల వచ్చే కేన్సర్‌ ప్రమాదాన్ని రెస్‌వెరాట్రోల్‌ శక్తివంతంగా అడ్డుకుంటుంది. కాన్సర్‌ కారకాలైన కణాలను రెస్‌వెరాట్రోల్‌ నిర్మూలిస్తుంది. ఆల్కహాల్‌ వల్ల వచ్చే కేన్సర్‌ నివారణకు రెస్‌వెరాట్రోల్‌ సంజీవనిలా పనిచేస్తుందని చెప్పలేం కానీ ఆల్కహాల్‌ తాగడం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలను నాశనం చేయడం ద్వారా కొంతవరకూ కేన్సర్‌ పాలబడకుండా ఇది మనల్ని కాపాడుతుందని అధ్యయనకారులు అంటున్నారు

No comments:

Post a Comment