చర్మం పగిలినట్టుగా అనిపిస్తే
చలికాలం వచ్చిందంటే చాలు... చలికి పాదాలు, చేతులు పగిలిపోతుంటాయి. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా ఈ బాధ తప్పదు. దీంతో ముఖం వడలిపోయినట్లుగా కన్పిస్తుంది. కాబట్టి కనీసం కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే రక్షణ సాధ్యం.
పనిచేస్తున్నప్పుడు గానీ, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ గంటకోసారి గోరువెచ్చని నీటితో మొహంపై చిలకరించుకుంటుండటం మంచిది.
బట్టలు ఉతికే సమయాల్లో చేతులకు రబ్బర్ గ్లోవ్స్ ధరించడం మంచిది. కాళ్ళని, పాదాలని తరచూ నీటిలో తడుపుతుండటం మంచిది కాదు. తడిసిన భాగాలని ఎప్పటికప్పుడు పొడి టవల్‌తో తుడుచుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చేతులకూ, పాదాలకు మాయిశ్చరైజర్ పట్టించాలి.
వంటింట్లో పనిచేసి అలసిపోయిన మహిళలు వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. కనురెప్పలపైనా దోసకాయను చక్రాలులా కోసి వాటిని కాసేపు ఉంచుకోవడం మంచిది. దీనివలన కళ్ళ మంటలు తగ్గుతాయి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూట తేలిక వ్యాయామం చేయడం చాలా అవసరం. జాగింగ్, వాకింగ్, సిటప్స్, పొట్ట వ్యాయామాలు, కార్డియో ఎక్సర్‌సైజులు, గాఢంగా ఊపిరి తీసుకుంటూ, మెల్లగా వదులుతూ చేయాలి. ప్రతిరోజూ కాసేపు నిర్మలంగా కూర్చొని ధ్యానం చేయడం కూడా మంచిదని ఆరోగ్య
నిపుణులు చెబుతున్నారు.
No comments:
Post a Comment