గుడ్డు మంచిదే కానీ
కోడి గుడ్లలో మానవ శరీరానికి కావల్సిన పోషకపదార్థాలు పుష్కలంగా వున్నాయి. ప్రతిరోజూ గుడ్లు తీసుకుంటే శక్తి ఎక్కువగా లభిస్తుందని వైద్యులు చెబుతుంటారు. అయితే ఇది ఏ విధంగా శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుతుందో... అదే విధంగా కొన్ని నష్టాలను కూడా కలిగిస్తుంది. అయితే మితిమీరితే అమృతమైన విషమనే చందాన గుడ్లను అతిగా ఆరగిస్తే ప్రమాదమేనని శాస్త్రజ్ఞులు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇందులో పోషకాలు ఏ స్థాయిలో అయితే వుంటాయే కొలేస్టిరాల్ కూడా అంతే వుంటుందని అంటున్నారు. అలా అని తినడం పూర్తిగా మానేయాలని కాదు. వాటిని ఏ మోతాదులో తీసుకోవాలో తెలుసుకుని తీసుకుంటే మంచిది. గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆయోడిన్, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ డి సమృద్ధిగా వుంటాయి. అంతేకాక దీనిలో జంతు ప్రోటీన్ చౌకగా లభిస్తుంది. ముఖ్యంగా గుడ్లలో విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయం మెదడు కోసం ఒక ముఖ్యమైన పోషకం. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్టిరాల్ అధికశాతంగా వుంటుంది. కొన్ని పరిశోధనల్లో తేలిన లెక్క ప్రకారం, ఒక గడ్డులో వుండే కొలెస్టిరాల్ రోజువారీ తీసుకునే ఆహారంలో కంటే ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత(హార్ట్ ఎటాక్) వ్యాధులు కచ్చితంగా వస్తాయి. గత అధ్యయనాల ప్రకారం... ఒక వారంలో ఆరు గుడ్లు కన్నా ఎక్కువగా తీసుకోకూడదన్నది సమాచారం. అయితే ఇటీవలే జరిపిన పరిశోధనల ప్రకారం... కొలెస్టిరాల్ స్థాయి తక్కువగా వున్నవారు అనేక గుడ్లు తీసుకోవచ్చని తేలింది. కానీ మధుమేహం వున్నవారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా తీసుకుంటే... వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని శోధకులు హెచ్చరిస్తున్నారు.
No comments:
Post a Comment