WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 28 May 2014

HOW TO SLEEP PERFECTLY AND NICELY - BED TIME SLEEPING TIPS FOR ALL AGES



కంటినిండా నిద్ర కోసం....!

నిద్రపోవడానికి కూడా టైమ్ మేనేజ్‌మెంట్ అవసరమంటున్నారు నిపుణులు. టైము ప్రకారం నిద్రపోతే మర్నాడు తొందరగా లేచి రోజు వారీ కార్యక్రమాలను చురుగ్గా, చేసుకోగలరని సలహా ఇస్తున్నారు. మరి మంచి నిద్ర పట్టాలంటే ఎలా అంటారా? దీన
ికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటింటి చూడండి...

* బెడ్ టైమ్ షెడ్యూల్ పాటించాలి. రోజూ రాత్రి నిర్దిష్ట టైముకు పడుకోవాలి. అలాగే ఉదయం కూడా నిర్దిష్ట టైముకు నిద్ర లేవాలి .


* పిల్లలు రోజుకు ఆరు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి


* పడుకునేబోయేముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి.


* మర్నాడు చేయాల్సిన పనుల లిస్టును రాత్రే రాసుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోతారు.


* యోగా, స్ట్రెచెస్ లాంటి రిలాక్సేషన్ ఎక్స్‌ర్‌సైజులు చేస్తే శరీరం తేలికపడి మంచి నిద్ర పడుతుంది.


* రేడియోలో పాటలు లేదా సంగీతం వినడం, మంచి పుస్తకం చదువుకోవడం చేస్తే మెదడుకు ప్రశాంతత చేకూరి తొందరగా నిద్రలోకి జారుకుంటాం.


* మానసిక ప్రశాంతతను ఇచ్చేలా బెడ్‌రూమ్ పరిసరాలను తీర్చిదిద్దుకోవాలి.


* పరుపు శుభ్రంగా లేకపోయినా, పక్క బాగుండకపోయినా కూడా నిద్ర రాదు. అందుకే తరచూ బెడ్ దులపడం, బెడ్‌షీట్స్ మారుస్తుండడం చేయాలి.


* స్లీప్ డైరీని (ఏ టైములో రోజూ నిద్రపోతున్నారు, రోజులో ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎన్నిసార్లు నిద్రలో మెళకువ వస్తోంది వంటి వివరాలతో ) రాయడం కూడా మంచిది. ఒకవేళ నిద్రలేమి అనారోగ్య సమస్యగా మారితే రోగ నిర్థారణకు స్లీప్ డైరీలో రాసుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి.


* పగటి సమయంలో మధ్యమధ్యలో చిన్నపాటి కునుకు తీయడం కూడా మంచిదే
.

HOW TO ATTAIN NATURAL BEAUTINESS - TIPS TO WOMEN TO REFRESH NATURAL BEAUTINESS



సహజమైన అందం కోసం....!

మేకప్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే కింద చెప్పిన టిప్స్ పాటించండి. సహజ అందంతో అందరినీ ఆకట్టుకోండి.

* మంచినీళ్లు బాగా తాగండి. నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చర్మం నునుపు దేలి కాంతివంతంగా ఉంటుంది.

* ప్రమాదకరమైన రసాయనాలు లేని మాయిశ్చరైజర్స్‌ను వాడాలి. ఇవి చర్మాన్ని రక్షించడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా మాయిశ్చరైజర్‌ను ముఖానికి, చేతులకు, పాదాలకు, మెడకు తప్పకుండా రాసుకోవాలి. ఎందుకంటే చర్మం తొందరగా వదులు అయ్యే భాగాలు ఇవే. ఇలా చేస్తే చర్మంపై ముడతలు ఏర్పడవు. వయసు కనపడదు.

* చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ఫేస్ వాష్ బాగా ఉపయోగపడుతుంది. దుమ్ము, ధూళి చర్మంలో ఇట్టే చేరిపోతుంటాయి కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేస్తే ముఖం మీద చర్మం నిగ నిగలాడుతుంటుంది.

* చర్మం ఆరోగ్యంగా ఉండడానికి టోనర్ చాలా అవసరం. ఇది చర్మం రంగు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం బిగుతుగా ఉండేట్టు చేస్తుంది. ముడతలు పడనీయదు.

* వారానికి కనీసం మూడుసార్లు షాంపుతో తలస్నానం చేయాలి. అలా చేస్తే జుట్టు నిగ నిగలాడుతూ శుభ్రంగా ఉంటుంది. తలకు నూనె బాగా పట్టించవద్దు. అలా చేస్తే ముఖం జిడ్డోడుతూ కనిపిస్తుంది.

* బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలి. లేకపోతే ఎండవేడిమికి చర్మం దెబ్బతింటుంది.

* ఉదయం లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లను తాగడం మరవొద్దు. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయరసం పిండి ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.

yoga tips to house wives



ఇంటి పట్టున యోగా చేసేవారు కొన్ని అంశాలను క్రమం తప్పకుండా పాటించాలని యోగానిపుణులు అంటున్నారు.

* నిత్యం ఒకే రకమైన యోగసనాలను చేయాలి. ఉదాహరణకు అష్టాంగయోగ చక్కటి ఉదాహరణ. ఇందులో ఊపిరి తీసుకోవడం, దృష్టిని ఒకచోట కేంద్రీకరించడం వంటివి ఉంటాయి. ఇవన్నీ ఒక చోట కూర్చుని కదలకుండా సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాలు మెడిటేషన్‌కు కూడా బాగా సహకరిస్తాయి.

* యోగాసనాల్లో ఎప్పుడూ ఒకే క్రమం (సీక్వెన్స్) అనుసరించాలి.
ఊ నిర్దిష్ట సమయాన్ని యోగాకు కేటాయించాలి. ఆ సమయంలోనే యోగా చేయాలి. టైమింగ్స్ మార్చకూడదు.


* ఇంట్లో ఒక ప్రదేశం అనుకుని అక్కడే యోగా చేయాలి. ఆ ప్రదేశంలో ఒక దేవుడి పటమో, క్యాండిల్ ఇంకేదైనా పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏకాగ్రతతో యోగా చేయగలరు.

* ప్రాణాయామ , జపం, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. వీటి వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ఉదాహరణకు మూడు నిమిషాల పాటు మీరు చేసే ప్రాణయామ మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.

* అపుడపుడు యోగ వర్కుషాపులకు వెడుతుండాలి, యోగా టీచర్‌ని సంప్రదిస్తుండాలి. ఇవి ఇంట్లో యోగా చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడతాయి.