WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 7 September 2016

REDUCE BODY WEIGHT BY DRINKING BUTTER MILK TWICE DAILY


రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

లావుగా ఉండటం తప్పుకాదు. కాని తగ్గటం చాలా అవసరం. అందుకని ఉపవాసం ఉండకూడదు. కానీ ఒళ్ళు పెంచే ఆహారం తినకూడదని తెలుసుకోవాలి. శరీరపు బరువు సమతుల్యమై.. శరీరాకృతి పాడవకుండా ఉండాలంటే.. ఆత్మస్థైర్యం ఉండాలి. ఇంకా శరీరపు బరువును పెంచే నెయ్యి, తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశెనగ నూనె, దుంపకూరలు, మినుముతో చేసే పదార్థాలు తినకండి. మజ్జిగ ఒళ్ళును పెరగనివ్వదు. రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.

అన్నం తినేముందు కనీసం నాలుగు గంటలు రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని కొంచెం తాగండి. రోజూ పరగడుపున అరగ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో చెమ్చాన్నర తేనె కలుపుకుని తాగండి. మధ్యాహ్నం నిద్రపోకండి. రాత్రి అన్నం తిన్నాక కనీసం వంద అడుగులు నడిచి అప్పుడు పడుకోండి.

ఇంకా అర గంట సేపు నడవటం, సూర్య నమస్కారాలు చేయడం మంచిది. ఇంకా మిరియాలు, అల్లం, పిప్పలి, ఉసిరికాయ, నిమ్మకాయ, జీలకర్ర, ధనియాలు, వాము.. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. చారు, కూర, పుదీనా చట్నీలో వీటిని చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


No comments:

Post a Comment