అంతులేని ఆరోగ్యానికి అరటి చెట్టు -
అరటి చెట్టు రూపం - గుణ ప్రభావం
అరటి చెట్టులో అనేక రకాల జాతులు ఉన్నాయి . అరటి చెట్టు రసం తీపి, వగరు రుచులు కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. వాతాన్ని పెంచి వీర్య పుష్టి చేస్తుంది. మూత్ర పిండాలలో రాళ్ళను, ఉదరంలోని క్రిములను, సెగరోగములును , రక్తపైత్యాన్ని పోగొడుతుంది.
ఇంట్లో అరటి చెట్టు పెంచవచ్చా ? -
ఇంట్లో ఒక చెట్టు పెంచడం ఉత్తమం, రెండు చెట్లు పెంచడం మాధ్యమం, మూడు చెట్లు పెంచడం వ్యాధి కారకం, నాలుగు చెట్లు పెంచడం నాశన కారకం అని పెద్దలమాట . కాబట్టి ఒక చెట్టు పెంచుకోండి.
అరటి పువ్వు వడియాలు -
ఇవి రుచికరంగా ఉండి దగ్గు , ఆయాసం మొదలైన శ్వాస రోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి.
అరటిఆకు భోజనం -
మనసుకు ఇంపుగా ఉంటుంది. జ్వరం , క్షయ, కఫవాతం, దగ్గు , ఉబ్బసం మొదలయిన వ్యాధులు ని అణిచి వేసి జటరాగ్ని , వీర్యబలాన్ని, ఆయువుని పెంచుతుంది. విషప్రభావాన్ని హరిన్చివేస్తుంది.
స్త్రీల అతి రుతు రక్తశ్రావానికి -
బాగా మగ్గిన అరటి పండు ఒకటి నాటు ఆవునెయ్యి లేదా నాటు గేద నెయ్యి 50 గ్రా కలిపి తినాలి. ఇలా రోజుకి మూడు సార్లు తింటూ ఉంటే బహిష్టులో ఆగకుండా ప్రవాహంలా స్రవించే అతిరుతువు ఆగిపోతుంది.
స్త్రీ ప్రాణాలు హరించే సోమరోగానికి -
స్త్రీలలో గర్భాశయ రోగాలు ముదిరిపోయి చివరికి సోమరోగంగా మారి యోని గుండా తెల్లని నీరు నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. దీనిని వెంటనే ఆపకపోతే ధాతువులు శోషించి ప్రాణాలకే ప్రమాదం
పచ్చి ఉశిరికాయల రసంలో గాని , ఉశిరికాయల తో కాచిన కషాయంలో గాని అరటిపండ్లను కలిపి కొంచం తేనే , పటికబెల్లం కూడా చేర్చి రెండుపూటలా సేవిస్తూ ఉంటే స్త్రీల సోమరోగం హరించి పోతుంది .
కాలిన గాయాలకు కమ్మని లేపనం -
బాగా పండిన అరటిపండుని మెత్తగా పిసికి కాలిన గాయాలపై వెంటనే లేపనం చేస్తే ఉంటే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానిపొతాయి.
మూత్రంలో మంట తగ్గుటకు -
బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటి పండు తింటూ ఉంటే మూత్రం లొ మంట తగ్గడమే కాక ఆమాశయం కుడా పరిశుభ్రం అవుతుంది.
తెల్ల బొల్లి మచ్చలు తగ్గుటకు -
అరటి చెట్టు దూట రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనం చేస్తూ ఉంటే తెల్ల బొల్లి త్వరగా నివారించ బడుతుంది.
అతి వేడి , అతి పైత్యం -
అరటి చెట్టు వేరుని మెత్తగా నూరి రసం తీసి రెండు మూడు చెంచాల రసం ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ వుంటే అతివేడి , అతి పైత్యం రెండు మూడు రొజుల్లొ తగ్గిపొతుంది.
అన్ని రకాల కడుపు నొప్పులకు -
అరటి చెట్టు ఎండబెట్టి కాలచి బూడిద చేసి జల్లించి పట్టుకోవాలి. ఈ బూడిదని 1 లేక 2 గ్రాముల మొతాదుగా ఒక కప్పు నీటిలో కలిపి రొజూ మూడు పూటలా తాగుతుంటే ఉదర రోగాలు తగ్గిపోతాయి .
మూత్రం ఆగితే రప్పించడానికి -
అరటి దుమ్పని మెత్తగా తొక్కి పొత్తి కడుపు పైన వేసి కట్టు కడితే మూత్రం అతి త్వరగా సహజముగా బయటకి వస్తుంది.
ఉబ్బస రోగం తగ్గుటకు -
రోజు పరగడుపున ఒక చక్కరకేళి అరటిపండుని తగినంత గోముత్రంలో కలిపి మెత్తగా పిసికి ఈ మిశ్రమాన్ని సెవిస్తూ ఉంటే అతి దారుణమైన ఉబ్బస రోగం అతి త్వరగా తగ్గిపొతుంది.
యొని జారే యొని కంద రోగానికి -
పచ్చి అరటి కాయలను ముక్కలు గా తరిగి ఎండబెట్టి దంచి జల్లించి నిలువ ఉంచుకొవాలి. వివిధ కారణాల వలన కొందరు స్త్రీలకు యొని బయటకు జారిపోతుంది. అలాంటి వారు ఈ చూర్ణాన్ని పూటకు మూడు నుండి 5 గ్రాముల మొతాదుగా మంచి నీటితో రెండు పూటలా సేవిస్తూ ఉంటే యోనికంద రోగం హరించి పొతుంది.
పాత దగ్గులు పారిపోవుటకు -
అరటిపండు తొక్క తీసి ఆ పండు మధ్యలో చిటికెన వేలు పోనిచ్చి గుంటలాగా చేసి ఆ గుంటలో గ్రాము మిరియాల పొడి వేసి ఆ పండుని ఒక మొతాదుగా రోజు రెండు పూటలా తింటూ ఉంటే చాలా కాలం నుంచి వేధిస్తున్న దగ్గు తగ్గిపొతుంది.
పెద్ద పెద్ద పండ్లు తగ్గిపోవుటకు -
మెత్తటి అరటిపండ్లను వేడి అన్నం, గేద పెడ సమంగా కలిపి మెత్తగా పిసికి పైన కట్టు కడుతూ ఉంటే క్రమంగా ఆ పుండ్లు మానిపొతాయి.
పులి తేన్పులు తగ్గుటకు -
అరటి ఆకులను బాగా ఎండబెట్టి కాల్చి జల్లించి నిలువ ఉంచుకొవాలి . ఆ బుడిదని ఒకటి లేక రెండు చిటికలు మొతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటూ ఉంటే తేన్పులు తగ్గిపోతాయి .
స్త్రీలు సుఖంగా ప్రసవించుటకు -
అరటి చెట్టు వేరుని స్త్రీ నడుముకు కట్టి ఉంచితే అతి సులువుగా కష్టం లేకుండా ఆ స్త్రీ వెంటనే ప్రసవిన్చును.
ఆగిన బహిష్టు మరలా వచ్చుటకు -
అరటి వుచ రసం పరగడుపున అరకప్పు మొతాదు గా సేవిస్తూ ఉంటే ఆగిపోయిన బహిశ్టు మరలా వస్తుంది.
సెగ రోగములు హరిన్చుటకు -
అరటి దుంప రసం 20 గ్రా , పటికబెల్లం పొడి 20 గ్రా కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే తెల్ల సెగ , ఎర్ర సెగ , పచ్చ సెగ తగ్గిపోతాయి .
************* కాళహస్తి వెంకటేశ్వరరావు *************

No comments:
Post a Comment