కీ.శే. ముత్తేవి అనంత పద్మనాభా చార్యులు గారు
ఆయుర్వేద విద్యాపారంగత ,మంత్రశాస్త్ర విశారద ఇత్యాది బిరుదులంది,ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మహామండలి ప్రధాన కార్యదర్శి గా పనిచేసి, మూలికా చిత్రగుణ ప్రకాశిక, మూలికా యోగ మాలిక, వంటి ఆయుర్వేద గ్రంథాలను, భారతసావిత్రి, విభూతి యోగ విశేషములు ,పంచసంస్కారభాస్కరమ్, విష్ణువంటే?, రాముడేడి? ,చెన్నకేశవ శతకం, వేంకటేశ్వర శతకం, స్ర్తీలకు స్వాతంత్ర్యము లేదా? వంటి పుస్తకాలను వ్రాసిన వారు శ్రీ ముత్తేవి అనంత పద్మనాభాచార్యులు గారు. ఈయన స్వతహాగా రామ భక్తులు. విజయవాడ,దేవరపల్లి , రొయ్యూరు ,కురుమద్దాలి గ్రామాల్లో జీవనయాత్ర సాగించారు.
కలలో కన్పించిన వేంకటరమణుని మీద ప్రార్థనా శ్లోకాన్ని రచించి ఆ చిత్రంతో ముద్రించారు.
శంఖం చక్రం చ చాపం వరద కటి కరౌ బాణ వేణూ కరాబ్జై:
బిభ్రాణం శేషశైలే రఘుకుల యదురాడ్రూప శ్రీ వేంకటేశం
శ్రీ సాలగ్రామమాలా లసిత దురుగళం దివ్య నవ్యాంగ రాగం
వందే లక్ష్మీ విశిష్టం కలితరణ శ్రుతేశ్శీర్ష మత్యక్త మూర్తిం .!!
No comments:
Post a Comment