WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 15 September 2016

CANCER PROBLEM CAN BE REDUCED WITH EATING SITHAPHAL - CUSTARD APPLE - HEALTH BENEFITS WITH CUSTARD APPLE


క్యాన్సర్ ఎంత పెద్ద ప్రాణాంతకమైన వ్యాదో మనందరికీ తెలుసు. ఈ వ్యాది భారినపడి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువగా పేదవారే ఉన్నారు. క్యాన్సర్ సోకిందంటే ఖరీదైన చికిత్స తప్పనిసరి. దీంతో అంత ఖర్చు పెట్టలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ ఎంతో మంది ఈ వ్యాదితో భాదపడుతున్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు ఉన్న మార్గం ఒక్కటే అది రేడియేషన్ థెరపీ. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. రేడియేషన్ థెరపీ చేసుకోవడం అన్నది డబ్బున్న వారికి సాధ్యమవుతుంది. మరి డబ్బులేని వారి పరిస్థితి ఏంటి. అయితే తాజాగా ఓ మధుర ఫలం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు.

ఎంతో ప్రాణాంతకమైన ఈ వ్యాధిని ఒక మధురమైన ఫలం సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు. సీతాఫల జాతికి చెందిన అన్నోనా మ్యూరికేటాపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో తామీ విషయాన్ని కనుగొన్నామని వారు చెబుతున్నారు. అన్నోనా మ్యూరికేటా(annona muricata) అసలు పేరు లక్ష్మణ ఫలం. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం అని శాస్త్రవేత్తల విశ్వాసం.

ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్ కు క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం ఉందని అదేవిధంగా ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా ఈ ఫలంలో సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు. అన్నోనా మ్యూరికేటా క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటిదని చెప్తున్నారు. ఈ ఫలంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

No comments:

Post a Comment