WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 16 May 2016

SEASONAL FRUIT PINEAPPLE HEALTH AND BEAUTY TIPS IN TELUGU


అందం - ఆరోగ్యం

• ఆరోగ్యానికి అనాస

ఈ కాలంలో దొరికే పండ్ల లో అనాస కూడా ఒకటి. అది ఆరోగ్యానికీ ముఖ్యంగా మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది. 

* అసలు అనాసలో ఉండే పోషకాలు ఎలా మేలుచేస్తాయంటే..

బరువు తగ్గాలనుకునే వారు అనాసను తీసుకుంటే మంచిది. కొన్ని ముక్కలు తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనిలోని పోషకాలు శరీరంలో హాని చేసే కొవ్వుతో పోరాడతాయి. అలానే తరచూ అనాసను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటకు పోతాయి.

* ఈ ఫలంలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ దూరమవుతాయి. కొందరికి శరీరంలో నీరు చేరుతుంటుంది. అలాంటి వాళ్లు తప్పనిసరిగా అనాసను తింటే ఎంతో మంచిది.

* అనాసలో పీచు పదార్థం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి దాని పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణాశయంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ దీనిలోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ రాత్రిపూట నాలుగు అనాస ముక్కలు తింటే ఆ సమస్య దూరమవుతుంది.

* రక్తలేమి ఉన్నవారికి అనాస మంచి ఆహారం. దీనిలోని పోషకాలు ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడతాయి. రక్తప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. అన్ని అవయవాలకూ ప్రాణవాయువు సరిగ్గా సరఫరా అవుతుంది.

* జీవనశైలిలో మార్పులూ, ఆహారపుటలవాట్ల వల్ల కొందరికి జీవక్రియ రేటులో అసమానతలు ఏర్పడతాయి. అలాంటి వారు అనాసను తినడం వల్ల జీవక్రియ రేటు వృద్ధి అవుతుంది. అనారోగ్య సమస్యలూ తొలగిపోతాయి.

* ఈ పండులో మంటా నొప్పులను తగ్గించే గుణాలుంటాయి. మోకాళ్లూ, కండరాల సమస్యలున్నవారు ఇవి తినడం చాలా మంచిది.

No comments:

Post a Comment