మెరిపించే తులసి
ఆరోగ్యానికి తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. సౌందర్యపోషణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. నిత్యం అందుబాటులో ఉండే తులసి వల్ల అందాన్ని ఎలా ద్విగుణీకృతం చేసుకోవచ్చంటే...!
* మెత్తగా చేసిన తులసి ఆకుల గుజ్జులో పావు చెంచా పాలపొడీ, కాసిని నీళ్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ పూతలా రాసుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. అప్పటికప్పుడు కాస్త ముఖం మెరుపుతో కనిపించాలనుకునేవారు దీన్ని ప్రయత్నించొచ్చు. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచిది.
* యుక్తవయసులో మొటిమలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా తులసి ఉపయోగపడుతుంది. దీనికోసం పది నుంచి పన్నెండు తులసి ఆకులు, మూడు నాలుగు వేపాకులు, చెంచా గంధం పొడి, నాలుగైదు చెంచాల గులాబీ నీరు కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరాక నీళ్లతో తడిపి మర్దన చేసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మగ్రంథుల లోపలికి చొచ్చుకుని పోయి శుభ్రం చేస్తుంది. ఫలితంగా మొటిమలూ, వాటి తాలుకూ మచ్చలు తగ్గుముఖం పడతాయి.
* గుప్పెడు తులసి ఆకుల్ని మెత్తగా చేసుకోవాలి. దానికి కాస్త టొమాటో గుజ్జు, చెంచా తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఈ మిశ్రమం రాసుకోవడం వల్ల ముఖంపై పేరుకునే జిడ్డు నియంత్రణలో ఉంటుంది. చర్మం తేజోమంతంగా కనిపిస్తుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు అరటిపండుని కలిపి ఫేస్‌ప్యాక్ తయారు చేసుకుంటే ఫలితం ఉంటుంది.

No comments:
Post a Comment