బరువు తగ్గాలంటే...!
బరువు తగ్గేందుకు అటుఇటు పరుగులు పెట్టి... ఏవేవో చేసి... నీరసం వచ్చి ఆ ప్రయత్నాలన్నీ మానేయడమే తప్ప ఫలితం లేదని బాధపడేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే బరువు తగ్గేందుకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు. ఇంట్లోనే బరువు తగ్గే టెక్నిక్స్ ఉన్నాయంటున్నారు గ్రాండ్‌మాస్. అయితే వాటిని ప్రతిరోజూ క్రమంతప్పకుండా పాటించాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహా తీసుకున్న తరువాతే వీటిని పాటించాలి.
* నిమ్మరసం - తేనె: ఒక టీస్పూన్ తేనె, అరచెక్క నిమ్మరసాల్ని ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో కలుపుకుని రోజులో ఎక్కువసార్లు తాగాలి.
* నిమ్మరసం: ఒబెసిటీ పనిపట్టాలంటే వట్టి నిమ్మరసం తాగినా గట్టి ఫలితమే ఉంటుంది. ఈ పద్ధతిలో ఏం చేయాలంటే మొదటిరోజు కేవలం నీళ్లు మాత్రమే తాగాలి. రెండో రోజు మూడు నిమ్మకాయల రసాన్ని, నీళ్లలో కలిపి ఆ రోజంతా తాగాలి. అలా రోజుకి పన్నెండు నిమ్మకాయల రసం తాగే వరకు చేయాలి. ఆ తరువాత నిమ్మకాయల సంఖ్యను నెమ్మదిగా తగ్గిస్తూ తిరిగి మూడు నిమ్మకాయలకు చేరుకునేవరకు తాగాలి. మొదటి రెండు రోజులు కాస్త నీరసంగా అనిపిస్తుంది. కాని ఏం పర్వాలేదు తరువాత మామూలు అయిపోతుంది.
* క్యాబేజి: బరువు తగ్గేందుకు క్యాబేజీ చాలా బాగా పనిచేస్తుంది. క్యాబేజీలో ఉండే టార్టారిక్ ఆమ్లం కార్బోహైడ్రేట్, చక్కెరల్ని కొవ్వుగా మారకుండా నిరోధిస్తుంది. అందుకని భోజనానికి బదులుగా క్యాబేజీ సలాడ్‌ని తింటే ఫలితం ఉంటుంది.
* టొమాటో: ఒకటి లేదా రెండు టొమాటోలను బ్రేక్‌ఫా్‌స్టగా తినాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు నెలలు చేస్తే సురక్షితంగా బరువు తగ్గొచ్చు.
* రాగులు: త్వరగా బరువు తగ్గాలంటే రాగులు దిబెస్ట్. రాగులు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందుకని కార్బోహైడ్రేట్స్ శోషించుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రాగులతో చేసిన వంటకాలు తింటే కడుపులో దండిగా అనిపించి త్వరగా ఆకలి కాదు. దాంతో లోపలికి తీసుకునే కాలరీలు తగ్గిపోతాయి. ఈ ప్రయోజంతో పాటు వీటిలో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ బి1, విటమిన్ బి2 వంటివి కూడా ఉంటాయి.
* బొప్పాయి: రాత్రి భోజనం బదులుగా బొప్పాయి సూప్‌ను రెండు లేదా మూడు నెలలు తీసుకుంటే బరువు తగ్గుతారు.
* రేగిపండ్లు: రాత్రిపూట గుప్పెడు రేగు ఆకులను నీళ్లలో నానబెట్టి ఉదయం లేచాక పరగడుపున ఆ నీళ్లు తాగేయాలి. ఇలా ఒక నెలరోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* అల్లం: పలుచగా కోసిన తాజా అల్లం ముక్కను భోజనానికి కొన్ని నిమిషాల ముందు నోట్లోపెట్టుకుని చప్పరించాలి. లేదా చిన్న అల్లం ముక్కను తురిమి నిమ్మరసం, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని చిటికెడు తీసుకుని తరచుగా నోట్లో వేసుకుని చప్పరిస్తుండాలి.
• భారం తగ్గించే డైట్
బరువు తగ్గాలనుకునే వాళ్లు లిక్విడ్స్ లేదా జ్యూస్‌లను వారం నుంచి పది రోజులు తాగాలి. దాంతోపాటు నాలుగు లేదా ఐదు రోజులు అన్ని పండ్లు తినాలి.
ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, క్యాబేజి, సెలరీలను లిక్విడ్ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉపవాసం పూర్తయ్యాక సమతులాహారాన్ని తీసుకోవాలి. అందులో గింజధాన్యాలు, కాయగూరలు, పండ్లు, చిరుధాన్యాలు, నట్స్, తాజా జ్యూస్‌లు తప్పక ఉండాలి. ఇలా చేయడం వల్ల తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండొచ్చు.
బరువు తగ్గాలంటే పూర్తిగా మానేయాల్సిన ఆహారం బటర్, చీజ్, చాకొలెట్, కేక్స్, మీగడ, వేపుళ్లు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న బ్రెడ్, కుకీలు, బంగాళాదుంపలు, పంచదార వంటివి.
సహజ ఆహారాన్ని తీసుకోవాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువుని అదుపులో ఉంచుతాయి. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బరువు తగ్గించడంలో, తగ్గిన బరువు పెరగకుండా ఉంచడంలో సాయపడతాయి.
వీటన్నింటితో పాటు ఆందోళన, భయం, కోపం, అభద్రత వంటి భావాలను వదిలేసి జీవితాన్ని సానుకూలంగా గడపాలి.

No comments:
Post a Comment