యోగికి కామ వికారం అధమ శత్రువు. ఒక బలమైన శత్రువు మనిషిని క్రిందకు లాగినట్లుగా ఈ కామ వికారము మనిషిని ఆధ్యాత్మిక ఉన్నత శిఖరముల నుండి దిగజార్చి దేహాభిమానము అనే అగాధంలోకి పడేస్తుంది. అతని నుండి దివ్య ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతోషాన్ని ఈ కామ వికారము దొంగలించి అతడిని స్వర్గ దైవీ స్వరాజ్యము నుండి వంచితం చేస్తుంది. భగవంతునికి సమీపంగా చేరుకోవాలని ప్రయత్నించే వ్యక్తి ఒకవేళ ఇంద్రియ సుఖాలకు లోనైతే అతడు నీచుడిగా అవుతాడు అన్నది లోకోత్తర సత్యము, మర్చిపోకూడని విషయము. అటువంటి వ్యక్తి తిరిగి భగవంతునితో ఆధ్యాత్మిక కలయికను అనగా తన పూర్వ స్థితిని చేరుకోవాలంటే ఎంతో కృషిని చెయ్యవలసి ఉంటుంది. ఎంతో సమయం పడుతుంది. అందుకే మనం దేని గురించైనా ఆలోచించే ముందు మన దృష్టికోణాన్ని, అలవాట్లను శుద్ధి పరుచుకోవడం ఎం తో అవసరం. ఆధ్యాత్మిక యోగాన్ని అభ్యసిస్తున్న వ్యక్తి జ్ఞానానికి నమ్మకానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ తన క ళ్ళు తనను మోసం చెయ్యకుండా దైహిక రంగు రూపులకు ఆకర్షితమవ్వకుండా చూసుకోవాలి. దృష్టి ఇప్పటికీ వికారభరితంగాఉంది. అంటే దివ్య జ్ఞానము మరియు బ్రహ్మచర్యపు పునాదులు ఇంకా బలపడాలి అని అర్థం చేసుకోవాలి.
No comments:
Post a Comment