అన్యైర్ధర్మాది భిః కృత్వా గోపితం మార్గశీర్షకమ్ | మాత్ప్రాప్తేః కారణం మత్వా దేవై స్స్వర్గనివాసిభిః || యేకే చిత్పుణ్యకర్మాణః మమ భక్తిపరాయణాః | తేషా మవశ్యం కర్తవ్యం మార్గశీర్షో మదాపనః || మార్గశీర్షం న కుర్వంతి యే నరా భారతా జిరే | పాపరూపాశ్చ తేజ్ఞేయాః కలికాల విమోహితాః అష్టస్వపి చ మాసేషు యత్ఫలం లభతే నరః తత్ఫలం లభతే వత్స మాఘే మకరగేరవౌ || మాఘాచ్ఛత గుణం పుణ్యం వైశాఖేమాసి లభ్యతే | తస్మాత్సహస్ర గుణితం తులాసంస్థే దివాకరే || తస్మాత్కోటి గుణం పుణ్యం వృశ్చికస్థే దివాకరే | మర్గ శీర్షోధికస్తస్మాత్ సర్వదా చ మమ ప్రియః || ఇతర ధర్మాదుల నాచరించి మార్గశీర్ష వ్రతము రక్షించబడినది. మార్గశీర్షము నన్ను చేరుటకు కారణమని తలచి దాచి ఉంచా. ఇక ఇతరులు నా భక్తిపరాయణులు పుణ్యకర్మల నాచరించు వారు తప్పకుండా నన్ను పొం దుటకు మార్గశీర్ష వ్రతమును ఆచరించవలయును. మార్గశీర్ష వ్రతమును చేయనివారు పాపులుగా కలికాల విమోహితులుగా తెలియవలయును. 8 నెలలలో పొందు ఫలము రవి మకరరాశిలో నున్నపుడు మాఘమాసములో లభంచును. మాఘము కంటే నూరు రెట్లు ఫలము వైశాఖమాసములో లభించును. దానికంటే వేయిరెట్లు తులారాశిలో సూర్యుడు ఉన్నపుడు లభించును. దానికంటే కోటిరెట్లు ఫలము వృశ్చిక దివాకరునిలో లభించును. దానికంటే మార్గశీర్షము అధికము. నాకు అన్ని వేళలా ప్రియతమము. -
No comments:
Post a Comment