తియ్యటి రుచి, ఆకట్టుకునే రంగు, మంచి పరిమళంతోకూడిన స్ట్రాబెర్రి నిజానికి బెర్రి జాతికి చెందినది కాదు. అది గులాబి జాతికి చెందిన పండు. ఈ పళ్లంటే కొందరికి తెగ ఇష్టం. వింబుల్డన్‌లో టెన్నిస్ మ్యాచ్‌ల సీజన్‌లో అక్కడివారు 27వేల కిలోల పళ్లు తినేస్తారుట. పండు బయట విత్తనాలుండటం దీని ప్రత్యేకత. ప్రతి పండుకు 200 విత్తనాలుంటాయి. అన్నట్లు బయట కన్పించే ప్రతి విత్తనం అసలుది కాదు. అందులో మళ్లీ అసలు విత్తనాలుంటాయి తెలుసా. అమెరికాలో వీటి ఉత్పత్తి చాలా ఎక్కువ. బెల్జియంలో వీటికోసం ఏకంగా ఓ మ్యూజియం (స్ట్రాబెర్రి మ్యూజియం) ఉంది. అక్కడ స్ట్రాబెర్రి చరిత్ర, ఆధారాలు వివరిస్తారు. ఐదు గదుల ఈ మ్యూజియంలో ఆ పళ్లతో చేసే పదార్థాలు విక్రయిస్తారు. చివరకు స్ట్రాబెర్రి బీర్‌కూడా. ఎర్రగా నవనవలాడుతూ కన్పించే ఈ పళ్లు నిజానికి పసుపు, తెలుపురంగులోనూ లభిస్తాయి.
No comments:
Post a Comment