కాశీ (వారణాసి) గురించి అగస్త్యుడు వివరించుట
ఈ కాశీ పట్టణము అవిముక్త క్షేత్రము. మోక్షేచ్చ కలవారు దీనిని వదిలిపెట్టకూడదు. కాశీయందు నివశించు సత్పురుషులకు అనేక విఘ్నములు కలుగుచున్నవి. కాశీ నివాసము లభించినవారు కాశీ పట్టణమును వదిలిపెట్టుట, చేతిలో ఉన్న రుచికరమగు ఆహారమును వదిలి ముష్టికి బయలుదేరుటవంటిది. అనేక పుణ్యసంస్కారములచేత లభించిన కాశీ నివాసమును వదిలిపెట్టువారు మూర్ఖులు.
దేవతలు కూడా తొలగింపజాలని పాపములను తొలగించు గంగానదిని వదిలిపెట్టుట ముత్యమును పారవేసి ముత్యపుచిప్పను ఉంచుకొనుట వంటిది. ధర్మార్థకామములకంటే ఉత్తమ పురుషార్ధమగు మోక్షము ఇక్కడనే లభించును. ఈ క్షేత్రము అతి పవిత్రమైనదని శ్రుతులు చెప్పుచున్నవి. ధర్మశాస్త్రములు, పురాణములు వానిని అనుసరించుచున్నవి. అందుచే కాశీ నగరమే శరణ్యము. జాబాలి అరుణి వరణా పింగళానాడుల మధ్యనున్నది అవిముక్త క్షేత్రము. వాని మధ్య నాడి సుషుమ్న. అదియే "వారణాసి". ఇచట మరణించిన వారకి విశ్వేశ్వరుడు 'తారక మంత్రము' ఉపదేశించును, మోక్షమొసగును. అవిముక్త క్షేత్రమగు కాశీతో సమానమగు క్షేత్రములేదు. విశ్వేశ్వరునితో సమానమగు దైవము లేడు. ఇచట లభింపని మోక్షము ఎక్కడనూ లభింపదు" అని అగస్త్యమహర్షి వివరించెను. (శ్రీ కాశీఖండము 5వ అధ్యాయం నుండి).
"ఓం నమశ్శివాయ"
"ఓం నమశ్శివాయ"
"ఓం నమశ్శివాయ"
No comments:
Post a Comment