WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 6 November 2015

ARTICLE REGARDING KITCHEN ITEMS USING IN CHINESE RECIPES REGULARLY IN TELUGU


చైనీస్ వంటకాల్లో ఈ పదార్థాలే ఎక్కువ!

చైనీస్ వంటకాలు అనగానే మంచూరియా, ఫ్రైడ్‌రైస్, నూడుల్స్ లాంటివి గుర్తొస్తాయి. కానీ ఆ పదార్థాలకు కమ్మటి రుచితోపాటూ, ఘుమఘుమలాడే సువాసనను తెచ్చే పదార్థాలేంటో తెలుసా..!

• వెల్లుల్లి, అల్లం: వెల్లుల్లిని చైనీయులు ఐదువేల ఏళ్లకు పైగా వాడుతున్నారు. కేవలం పదార్థాల తయారీలోనే కాదు.. దీన్ని చైనీయుల సంప్రదాయ వైద్యంలోనూ వాడతారు. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలే అందుకు కారణం. దాదాపు ప్రతి చైనీస్ వంటకంలో ఇది ఉంటుంది. అలాగే అల్లాన్ని కూడా అంతే ఎక్కువగా వాడుతుంటారు. సిజువాన్ పదార్థాల్లో అల్లం వినియోగం ఎక్కువగా ఉంటుంది.

• సోయాసాస్: ఇది తక్కువ, ఎక్కువ గాఢతల్లో దొరుకుతుంది. తయారుచేసే పదార్థాన్ని బట్టి దేన్ని ఎంచుకోవాలనేది ఆలోచిస్తారు. మాంసాహారానికి సీజనింగ్ చేయడానికీ, వంటకాల తయారీలో ఎక్కువ గాఢత కలిగిన సాస్‌ని వాడతారు. తక్కువ గాఢత ఉన్నదాన్ని భోజనాల బల్లపై ఉంచుతారు. స్ప్రింగ్‌రోల్స్, లేదా డిమ్‌సమ్ లాంటి వాటిని ఈ సాస్‌లో ముంచి తింటారు. దీంతో పాటూ ఆయిస్టర్ సాస్‌ని కూడా ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని మాంసాహారం, కొన్నిరకాల కాయగూరల తయారీలో ఉపయోగిస్తారు.

• ఫైవ్ స్పైస్ పౌడర్: మిరియాలూ, అనాస పువ్వూ, లవంగాలూ, సోంపూ, దాల్చినచెక్క, కొన్నిసార్లు దనియాలను కూడా వాడుతుంటారు. మటన్, చేపలూ, చికెన్, కూరగాయల తయారీలో దీన్ని వాడతారు.

• నువ్వులనూనె: చైనీస్ వంటకాల్లో ముదురు రంగులో, ఘాటు ఎక్కువగా ఉన్న నువ్వుల నూనెని వాడతారు. ఈ నూనెని మాంసానికి పట్టించడం, వంటంతా పూర్తయ్యాక కొద్దిగా చిలకరించడం చేస్తారు.

• చిల్లీసాస్: ఘాటు ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చితో ఈ సాస్‌ని తయారుచేస్తారు. దీన్ని డిప్పింగ్ సాస్ తయారీలో, వేయించడానికీ ఎంచుకుంటారు. ఇది సిజువాన్, హునాన్ వంటి స్పైసీ పదార్థాల తయారీల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

• ఉల్లికాడలు: వీటిని వండి మాత్రమే కాదు, పచ్చిగానూ పదార్థాలపై అలంకరణ కోసం ఎంచుకుంటారు.


No comments:

Post a Comment