WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 19 January 2015

INDIAN TRADITIONS AND CULTURE - COW DUNG USES


సంప్రదాయం - శాస్త్రీయం

చిన్నప్పుడు అమ్మమలు, బామ్మలు ఉదయం లేవగానే ఆవుపేడ కలిపిన నీటితో కళ్ళాపి చల్లేవారు. పండుగలు, పూజలకు ముందు ఇంటిని ఆవుపేడతో అలికేవారు. కొందరైతే గోడలను కూడా గోమయంతో అలికేవారు. అసలు అలా ఆవుపేడను ఉపయోగించడం వెనుకున్న కారణం ఏమిటి? ఆవు పేడ నీటినే చల్లడం ఎందుకు ?

కళ్ళాపి చల్లడం వలన గాలికి దుమ్ము లేచి, ఇంట్లోకి రాకుండ ఉంటుందని సాధారణంగా చెప్తారు. కానీ దానిలో #వైజ్ఞానికఅంశాలున్నాయి.

"దేశవాళీ/నాటు ఆవుపేడ" (భారతీయ గోవు పేడ ని మాత్రమే) కలిపిన నీటినే కళ్ళాపిగా చల్లుతారు. నిజానికి భారతీయ #గోవుకు (ఆవుకు) చాలా విశిష్టత ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని గోజాతులలోకి భారతీయ గోవుకున్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమిసంహారిణి. క్రిములను దరిచేరనీయదు, హాని కలిగించే కీటకాలను దూరంగా పంపేస్తుంది.

అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములున్నాయి, కేవలం వాటి ద్వారా మాత్రమే మనం భూమిని సారవంతం చేయవచ్చు. 1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని#మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.

ఈ కాలంలో మనం రెడియేషన్ లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. ఆవుపేడ రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి, ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. #ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు.

ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు. ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాలు పగుళ్ళకు కూడా ఇవే ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఒక్క పేడలోనే ఇన్ని విశిష్టతలుంటే ఇక ఆవుపాలలో ఎన్ని విశేషాలు ఉంటాయి. అందుకే భారతీయులు ఆవును అమ్మగా,#గోమాతగా పూజిస్తారు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది . ఇదండీ మనం కళ్ళాపి చల్లడం వెనుక ఉన్న కారణం. కాని మనం పాశ్చత్య మోజులో పడి మనవన్ని మూఢాచారాలంటున్నాం.

ARTICLE ON IMPORTANCE OF INDIAN TRADITIONAL CUSTOMS AND CULTURE ABOUT MUGGULU / KOLAMS / RANGOLI / RANGAVALLI


మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి?

 ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

అంతేకాదండోయ్! మనం ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో #ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

ARTICLE ON ADITHYA HRUDAYAM IN TELUGU


 ఆదిత్య హృదయం వాల్మీకిమహర్షిలోకానికి అందించిన దివ్యస్తోత్రము .

 యుధ్ధరంగంలో విజయంకోసం శ్రమిస్తున్న శ్రీరామచంద్రునకు అగస్త్యమహర్షిద్వారా ఉపదేశింపబడి రావణసంహారమునకు తోడ్పడిన మంత్రరాజమిది.

లోకంలో మనుషులు అనారోగ్యము, అశాంతి, చైతన్యరాహిత్యము, అపజయముల తో బాధపడుతున్నప్పుడు ఆదిత్యహృదయం పారాయణద్వారా శుభాలను పొందవచ్చని పెద్దలద్వారా తెలుపబడి అది నిరూపింబడుతూ ఉన్నది ఆనాటినుండి ఈనాటివరకు కూడా.


ఆదిత్య హృదయం


తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ | జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ | చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భోzదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః | ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోzస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ |
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమోzభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాzగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోzభవత్తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోzభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||


TELUGU MAHABHARATA STORIES - STORY ABOUT LORD SRI KRISHNA AND NALAKUBARA MANIGRIVA CURSE STORY IN TELUGU


శ్రీమద్భాగవతము లోని కథ
.
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.

శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీదనుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది.

తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు! పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో ఱోకటికి (ఉలూఖలమునకు) కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది. మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకుగానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!
యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా ఱోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ ఱోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాలముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకువెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యొన్ముఖులై వెళ్ళిపోయారు

RAMAYAN STORIES IN TELUGU - SUNDARAKANDA POEM AND ITS MEANING IN TELUGU



సుందర కాండ శ్లోకము - వివరణ

శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః

తా - లంకకు రాగలుగుటకు నలుగురికే సాధ్యము. వాలి పుత్రుడైన అంగదుడు, నీలుడు, బుద్ధిశాలి యగు మా ఏలిక సుగ్రీవుడు మరియు నేను (ఆంజనేయ స్వామి)

వివరణ - ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...

వ్యాఖ్యానము - జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ... రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.

ఇక్కడ మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి... సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది. అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక... వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు. అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ, అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని సద్గురువులు ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు

ARTICLE IN TELUGU ABOUT SRI SUBRAHMANYA SHASTI FESTIVAL PUJA


సుబ్రహ్మణ్య షష్ఠి 

సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. కుమార స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 

అలాంటి సుబ్రహ్మణ్యస్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి 'సుబ్రహ్మణ్య షష్ఠి' గా చెప్పబడుతోంది. ఆ రోజున సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన, ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు.

ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేసి, ఉపవాస దీక్షను చేపట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పూజా మందిరంలో గల సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.

పాయసం, కందిపప్పుతో కూడిన వివిధ రకాల పదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించాలి. దానిమ్మ, అరటిపండ్లను కూడా స్వామివారికి నివేదన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

Monday, 12 January 2015

WISH YOU A HAPPY PONGAL - KOLAMS AND RANGAVALLI


LORD VIGNESWARA AND OTHER LATEST ANDHRA KOLAMS




LATEST PONGAL 2015 MUGGULU COLLECTION






MAKARASANKRANTHI 2015 FESTIVAL MUGGULU



MEANING AND STORY OF MAKARA SANKRATHI FESTIVAL IN TELUGU


మకర సంక్రాంతి భావమేమిటో తెలుసా!?

ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతి అనేది సౌర కుటుంబంలో సూర్యుడు మనిషిని ప్రభావితం చేసే ఒక ప్రధానమైన అంశమేని, అందుకే సూర్యునికి సంబంధించిన ఈ పండుగను ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు.

ఆకాశం గాలి పటాల చుక్కలపరుచుకున్నప్పుడు.. భూమి రంగు రంగుల రంగవల్లుల అల్లికలతో వైభవోపేతమైన అందాన్ని సమకూర్చుకుంటుంది. పట్టణమైనా, పల్లెలైనా, సంక్రాంతి శోభ పరచుకుంటాయి. తెలుగు వారికి పుష్య మాసంలో (జనవరి - ఫిబ్రవరి నెలల్లో) వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగ - సంక్రాంతి.

నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తొలి రోజు భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగున ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయన పుణ్య కాలం మొదలై ఆరు నెలల వరకు ఉంటుంది. ఇది దేవ కాలము, ఎంతో శుభదాయకమైనదని పురోహితులు చెబుతున్నారు.

సూర్యుడు ప్రత్యక్ష బ్రహ్మ, కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయణంలో సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరిగే రోజునే మకర సంక్రాంతిగా జరుకుంటున్నాం..! మరి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!

MAHABHARATHA STORY IN TELUGU - ABOUT ARJUNA AND HIS PILIGRIM VISITS


అర్జునుడు... నారీ తీర్థాలు

ఒకసారి పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ దక్షిణ సమద్రతీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సౌభద్రం, పౌలోమం, కారంధమం, ప్రసన్నం, భారద్వాజం అనే పంచతీర్థాలు ఉన్నట్టు తెలుసుకున్న అర్జునుడు అక్కడికి బయలుదేరుతూంటే ఒక సాధువు వారించి, ‘వాటిలో పెద్దపెద్ద మొసళ్ళున్నాయి. అవి స్నానం చెయ్యడానికి దిగిన వారిని పట్టి మ్రింగుతున్నాయి. ఇలా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నది కనుక వాటి దరికి వెళ్ళవద్దు’అని హెచ్చరించాడు. అయినా లక్ష్యపెట్టకుండా అర్జునుడు ఆ తీర్థాలున్న ప్రదేశానికి చేరుకున్నాడు.

ముందుగా సౌభద్ర తీర్థంలో స్నానానికి దిగాడు. సాధువు చెప్పినట్టుగానే కొన్ని క్షణాల్లో ఒక బలిష్టమైన మొసలి అర్జునుని కాలు పట్టుకొని లోపలకు లాగసాగింది. అతి ప్రయాసతో అర్జునుడు దాన్ని ఒడ్డుకు ఈడ్చుకొచ్చాడు. ఒడ్డుకు రాగానే ఆ మొసలి ఆశ్చర్యంగా ఓ త్రిలోక సుందరిగా మారిపోయింది. నిశే్చష్టుడైన అర్జునుడు కాస్సేపటికి తేరుకొని, మొసలి రూపంలో ఎందుకున్నావని ఆమెను అడిగాడు.

అప్పుడా సుందరి, ‘‘మహాశక్తిమంతా! నేను అప్సరసను. నా పేరు వర్గ. నేనంటే కుబేరుడికెంతో ఇష్టం. నాకు నలుగురు చెలికత్తెలున్నారు. వారికీ నాలాగే కామగమనం తెలుసు. మేము అప్పుడప్పుడూ భూలోకం వచ్చి ప్రకృతి అందాలను చూడ్డానికి అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటాం. ఒకరోజు మేమైదుగురం ఇక్కడికి సమీపంలో ఉన్న అరణ్యానికి వచ్చాం. పచ్చని చెట్లతో, పుష్పాలతో ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక యువకుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అతని తేజస్సుతో ఆ ప్రదేశమంతా సూర్యభగవానుని కన్నా మిన్నగా వెలిగిపోతోంది. అతని అద్భుతరూపం చూసి ఇంత అందగాడికి తపస్సేమిటి అనుకున్నాం.
‘‘వయస్సు పొంగులో ఒడలు తెలియలేదు. ఆ సుందరుడి తపస్సు భగ్నం చేసి మా వశం చేసుకోవాలని నేనూ, సౌరభేయి, సమీచి, బుద్భుద, లత అతని చెంత చేరాం. ఆటలతో పాటలతో అలరించాం. వెటకారం చేస్తూ పగలబడి నవ్వాం. అహంకారంతో ఎన్నోవిధాలుగా అవమానించాం. నెమ్మదిగా కనులు విప్పిన ఆ తాపసి మా ఆట పాటలకు అంద చందాలకు ఏమాత్రం చలించలేదు. అతడి మనోనిగ్రహం ముందు మా చేష్టలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. మా దురుద్దేశాన్ని గ్రహించిన ఆ మునీశ్వరుడు, ఇక ఎవ్వరికీ మేమలా తపోభంగం చేయకూడదనుకున్నాడు కాబోలు- ‘మీరు మొసళ్ళుగామారి పంచతీర్థాల్లో పడి ఉండండి’అని శపించాడు.

‘‘మేము గడగడ వణకిపోయాం. ఏంచేయాలో తోచలేదు. కొన్ని క్షణాల అనంతరం తేరుకొని చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ ‘తాపసోత్తమా! వయస్సు, అందం, కోరిక, మాలో విచక్షణా జ్ఞానాన్ని నశింపజేసాయి. మీవంటి తపోధనుల పట్ల వెకిలిగా ప్రవర్తించడం, వెర్రిమొర్రి వేషాలు వేయడం తప్పని ఒప్పకుంటున్నాం. మీ శాప ప్రభావంతో మేము మొసళ్ళు కావడం అన్నమాట తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. దయచేసి మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించుకోండి’ అంటూ అతని కాళ్ళమీద పడ్డాం.

‘‘ఆ తాపసి సానుభూతితో మమ్మల్ని చూస్తూ ‘నేనింతవరకూ ఎగతాళికి కూడా అసత్యం పలుకలేదు. కాబట్టి నా శాపప్రభావంతో పంచతీర్థాల్లో మొసళ్ళుగా పడి ఉండడం తప్పదు. మీరు ఆ తీర్థాల్లో స్నాన మాచరించడానికి వచ్చిన వారిని పట్టి మ్రింగుతుంటారు. మీకు ఆహారం కాకుండా మిమ్మల్ని ఒడ్డుకు లాగ గలిగిన పురుషునివల్ల శాపవిమోచనం కలిగి స్వస్వరూపాలు ధరిస్తారు. కనుక మీరు త్వరగా పంచతీర్థాల వద్దకుపోయి అయిదుగురూ అయిదింటిలో ప్రవేశించండి’అని దయతో పలికాడు. ‘‘అప్పట్నుంచీ మొసళ్ళరూపంలో మేమీ జలాశయాల్లోపడి ఉన్నాం. మహాబలులు నా చెలులు కూడా నాలాగే నాలుగు జలాశయాల్లో ఉన్నారు. దయార్ద్ర హృదయంతో వారికీ యథారూపాన్ని ప్రసాదించు’’ అని వేడుకుందా త్రిలోక సుందరి.

జాలిపడిన అర్జునుడు ఆమె మాట మన్నించి మిగతా నలుగురికీ కూడా శాపవిముక్తి కలిగించాడు. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ, ‘‘మహాభాగా! మీరే గనుక ఇక్కడకు రాకపోతే ఎంత కాలమైనా మేము మొసళ్ళుగానే ఉండిపోయే వాళ్ళం. ఎంతో ధైర్యంగా మాకు శాపవిముక్తి కలిగించిన మీకు సర్వదా కృతజ్ఞులం!’’ అన్నారు ఏక కంఠంతో.
అప్పుడు అర్జునుడు ‘‘దేవకాంతలారా! తపోధనుల సాధుత్వాన్ని బలహీనతగా భావించి, అహంకారంతో వారిపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ఇప్పటికైనా గ్రహించండి!’’అని మందలించాడు.వారు బుద్ధిగా తలలూపి అర్జునుడికి నమస్కరించి తమ లోకానికి పోయారు. ఆనాటినుండీ పంచతీర్థాలు నారీ తీర్థాలుగా పేరు పొందాయి. (చిత్రం) సౌభద్ర తీర్థం

Friday, 9 January 2015

TELUGU MAKARASANKRATHI FESTIVAL MUGGULU 2015 LATEST COLLECTION



MARRIAGE TRADITION - JEELAKARRA BELLAM


రేయ్ ఎవర్రా జీలకర్రా బెల్లం తో 

బబూల్గుం పెట్టింది 

చేతులు వుడీ రావటం లేదు 

ARTICLE IN TELUGU ON SRI VEPANJARI SRI LAKSHMI NARAYANA SWAMY TEMPLE AT 85 KM TO CHITTOOR DISTRICT - ANDHRA PRADESH - INDIA


వేపంజరి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ఆలయం

ఈ ప్రాంతం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. మానవుని పంచ మహాపాతకాలను హరించి, కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ క్షేత్రం ‘వేం పంచ హరి’గా పిలవబడింది. ‘వేం’ అనగా పాపమని, ‘పంచ’ అనగా ఐదు, ‘హరి’ అంటే హరించమని అర్థముంది. అంటే, తాము చేసే పంచమహాపాపాలను హరించమని భక్తులు భగవంతుని ప్రార్థిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు వచ్చిందని ఒక కథనం. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణానికి సంబంధించి, క్రీ.శ. 12వ శతాబ్దంలో చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో, ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. ఆ భక్తుడు తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించగా, రాజు సకల జనుల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెదకడం జరిగింది. చివరకు ఓ చిట్టడవిలో కనిపించిన పుట్టను తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ కాంతులీనుతూ దర్శనమిచ్చింది. ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు, వెను వెంటనే అక్కడ ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపజేసాడు. అలా మూడవ కుళోత్తుంగ చోళుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము, ఆయన కాలములో నిత్య పూజలతో, ఉత్సవాలతో కళకళలాడింది. అనంతరం పట్టించుకునే వారే కరువై ప్రకృతి బీభత్సాలకు, శత్రువుల దండయాత్రలకు ఆలయం ధ్వంసమయ్యే స్థితికి చేరుకుంది. దాని ఫలితం ఉంటుందిగా మరి. అనంతరం ఆ ప్రాంతమంతా అనావృష్టి తాండవించింది. వర్షాలు లేకపోవడంతో పంటలు లేవు. పంటలు లేకపోవడంతో కరువు కరాళ నృత్యం చేయసాగింది. ఆ స్థితిలో గ్రామస్తులంతా గుమిగూడి, తమ ప్రాంతానికే ఎందుకీ దురవస్థ అని ఆలోచించి, శ్రీలక్ష్మీనారాయణ స్వామికి నిత్య పూజలు జరుగక పోవడమే క్షామానికి కారణమని గ్రహించారు. అనుకున్నదే తడవుగా, ఆరోజు నుంచి ఆలయంలో నిత్య పూజలు మొదలయ్యాయి. ఫలితంగా మరలా ఆ ప్రాంతమంతా పచ్చ పచ్చని పైరులతో కళకళలాడటం ప్రారంభించింది.

ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండ పెట్టుకుని దర్శనమిస్తారు. ఈ మనోహర రూపాన్ని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం భక్తుల పాలిట కోరికలు తీర్చే కల్పవృక్షంగా మారింది. విశిష్టమైన వేపంజరి గ్రామంలో శ్రీమన్నారాయణుని ఆలయమే కాక, ఇంకా పలు ఉపాలయాలు, చూడదగిన విశేషాలెన్నో వున్నాయి. అందులో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం. మన రాష్ట్రంలోనే ప్రముఖ స్థానాన్ని ఆ సంపాందించుక్ను ఈ ఆలయంలో శ్రీవారు కుబేరలక్ష్మీతో మధ్యస్థంగా వుండగా చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉన్నట్టుగా విగ్రహాలు వున్నాయి.

* దశవతార పుష్కరిణి

ఆలయానికి ఈశాన్యదిశలో స్వామివారి దశావతార పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలో స్వామివారు కృష్ణ లీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో వుండగా, దశవతార విగ్రహం పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కో యుగంలో శ్రీమహావిష్ణువు పాపాత్ములను సంహరించటానికి దశావతారా లు ఎత్తాడని లోకవిదితమే. అయితే ఏ విష్ణు ఆలయంలో చూసినా, దశావతారాలు విడివిడిగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం స్వామి వారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి 21 అడుగుల దశావతార విగ్రహం రూపంలో అద్భుతమయిన రూపంలో కనిపిస్తుంది.

అంతేకాక స్వామి వారి నాభిభాగంలో బ్రహ్మదేవుడు. వక్షస్థల భాగంలో శివుని రూపం కలిగి వుంటారు. ఫలితంగా త్రిమూర్తులందరిని ఒకేచోట దర్శించుకునే అవకాశం భక్తజనులకు కలుగుతుంది. ఈ ఆలయానికి దగ్గరలోనే దేవతల వైద్యుడైన ధన్వంతరీ ఆలయం వుంది. ఇక్క డకు వచ్చిన భక్తులు వారి అనారోగ్యాన్ని గురించి ధన్వంతరీ దేవుని ముందు చెప్పుకుని, మంత్రాన్ని జపించి అందుకు తగిన ఫలితాన్ని పొందుతుంటారు.

* పూజలు-సేవలు

ప్రాతః కాలంలో ఐదు గంటలకు తెరవబడే ఈ ఆలయాన్ని రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శించుకోవచ్చు. ఈ దేవాలయంలో మూలవరులకు అభిషేకం, స్వర్ణపుష్పార్చన, కల్యాణోత్సవం (నిత్యం), దీపకైంకర్యం, పుష్ప కైంకర్యం (నెలకోసారి), నిత్యార్చన, గోసంరక్షణ, అన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు, కైంక ర్యాలు, ఉభయం, నిర్వహించబడతాయి. ఈ దేవాలయం, ప్రాంగణం, పరిసరాలు సువిశాలంగా కనిపిస్తూ ఆహ్లాదకర వాతా వరణంతో కనిపిస్తూ భక్తుల మనసులను అలౌకిక ఆనందాన్ని అందజేస్తుంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామివారికి వైభవో పేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి.

* ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?

చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే మన రాష్ట్రం లోని విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి వంటి పలు ప్రాంతాల నుండి బస్సు, రైలు సౌకర్యాల ద్వారా చేరు కోవచ్చు. అలా తిరుపతి వరకు వెళ్లి అక్కడ నుండి బస్సు ప్రయా ణం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. అలాగే చెనై్న, బెంగళూరుల నుండి కూడా వేపంజరికి బస్సు సౌకర్యం వుంది. తిరుపతికి వెళ్లే యాత్రీకులు ముందస్తు ప్రణాళికతో ఈ ఆలయాన్ని కూడా దరించుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు.

* శాపవిమోచన వృక్షం

దశావతార పుష్కరిణి ప్రవేశించే దారిలో రెండు దశాబ్దాల చరిత్రగల మర్రిచెట్టు వుంది. దీనికి శాప విమోచన వృక్షమని పేరు. ఈ చెట్టు కింద బ్రహ్మదేవునికి పూజలు జరుగుతూ వుంటాయని, చనిపోయి ఆత్మలుగా మారిన వారు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ మోక్షాన్ని పొందుతారని ఒక కథనం ప్రచారంలో వుంది. అందుకే ఈ చెట్టుకు శాపవిమోచన వృక్షమని పేరు వచ్చింది. ఈ చెట్టు నుంచే వేపంజరి దిద్యక్షేత్రానికి శాప విమోచన క్షేత్రమన్న పేరు ఉంది.

* సుదర్శన, యోగ మందిరం

ఈ పుణ్య క్షేత్రంలో మరొక విశేషం యోగమందిరం. ఈ మందిరంలోని ఓ విగ్రహం పైభాగంలో సుదర్శన చక్రం, కింద భాగంలో యోగనరసింహస్వామి కలిసిన విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తూ సుదర్శన మంత్రాన్ని జపిస్తూంటే సమస్త పాపాలన్నీ పటాపంచలై ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

* కల్పవల్లి వృక్షం

రాగి, వేప, మద్ది, చింత, మర్రి, బిల్వ, పనస మొదలగు ఏడు వృక్షాలు కలిగిన ఈ స్థలంలో కల్పవల్లి మరియు మునీశ్వర దేవతలు పూజలందుకుంటారని అందుకే దీనిని కల్పవృక్షమంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ తల్లి భక్తుల పాలిట కొంగుబంగారంగా మారింది.

* నక్షత్ర వనం

ఈ వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. వారి చుట్టూ నవగ్రహాలు ప్రతిష్టించబడి వుంటాయి. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది.ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనితో పాటు, గంగమ్మ మరియు భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. ఇలా ఆలయ ప్రాంగణమంతా శిల్పకళా శోభితంగా అలరారుతుంది.

ARTICLE IN CONNECTION WITH HOW TO PERFORM LORD SHIVLINGH PUJA - WHOM TO PERFORM LORD SIVA PUJA - SELECTION OF SHIVLINGH FOR PERFORMING LORD MAHADEV'S PUJA


ఎవరు ఏ లింగాలని పూజించాలి? వాటి ఫలితం ? 

ఏ మాసంలో ఏ లింగాన్ని ?

లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రి విషయానికి వస్తే, భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాన్ని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాన్ని కాని అర్చిస్తే మంచిదని లింగపురాణం చెబుతోంది. స్త్రి లలో అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.

* ఏలింగాన్ని పూజచేస్తే ఏం ఫలితం?

ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహ లింగం .
అతి పవిత్ర బాణలింగం

అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.

రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

* స్థాపర, జంగమ లింగాలు :

జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరూపమైనప్పుడు, సృష్టి స్థితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు, చెట్లు ( మొదలైనవి) జంగమాలు(కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి)కూడా లింగరూపాలే అవుతాయి. వీటికి స్తావరలింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

లింగ పూజ చేసేవారు ఉత్తరముఖంగా కూర్చోవాలని, రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.

ARTICLE IN TELUGU ABOUT THE RICHEST VALUES OF INDIAN TRADITIONS AND CULTURE ABOUT WEARING WOMEN SINDHOOR / KUMKUM / BOTTU


భారతీయతకు ప్రతీక… కుంకుమ

మోమున మెరిసే కుంకుమ తిలకం నింగిని వెలిగే జాబిలి కిరణం.. ఒక సినిమా కవి వ్యక్తం చేసిన ఈ ఎక్స్‌ప్రెషన్ ఎంత బాగుంటుందో కదా. మనం ధరించే కుంకుమకు ఇంతకంటే గొప్ప ఉండదేమో అనిపిస్తూ వుంటుంది. నిజంగా కుంకుమ ధరించడం అనేది చాలా గొప్ప విషయంగా అనాది నుంచి భావిస్తూ వస్తున్నారు. ఈరోజుల్లో అయితే కొంతమంది తెలిసీ తెలియక నొసట కుంకుమ ధరించటం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటున్నారు. నిజానికి నుదుట కుంకుమ ధరించడం అనేది స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించిన అంశం.

* ఆస్తికుల ఆస్తి కుంకుమ

నుదుట ఎర్రటి కుంకుమ పెట్టుకోవడం అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగం. గతంలో హిందువుల్లో ఏ కులం వారైనాసరే తప్పకుండా నుదుటన కుంకుమ ధరించేవారు. ముఖ్యంగా శైవులు, వైష్ణవులైతే కుంకుమ ధరించడం తప్పనిసరి.. అలా కుంకుమ ధరించడం గొప్పదనంగా భావించేవారు. ఆస్తికుల ముఖం మీద చెరగని ఆస్తిగా కుంకుమ భాసించేది. ఈ ఆధునిక యుగంలో తప్ప శతాబ్దాలుగా ప్రతి ఒక్క హిందువు ముఖం మీద కుంకుమ తప్పకుండా వుండేది. అది కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా వర్ధిల్లింది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని, ఎర్రటి కుంకుమను నుదుటన ధరించడం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వచ్చింది. సృష్టిలో మొదటిరంగు ఎరుపు కాబట్టి కుంకుమ ఎర్రటి రంగులో ఉంటుందట. ఎరుపురంగు లక్ష్మీప్రదమని కూడా అంటారు.

* నాడులు కలిసే కీలక ప్రదేశంలో…

మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నాడులు సక్రమంగా పనిచేయాలి. శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు వుంటాయి. వాటిలో ఒకటి ‘ఇడ’ రెండోది ‘పింగళ’. ఈ రెండు నాడులూ నుదుటి వద్ద కలుస్తాయి. అంటే శరీరంలోని నాడులన్నింటికీ అనుసంధానం నుదుటన వుందన్నమాట. ఈ ప్రదేశాన్ని ‘సుషుమ్న’ నాడిగా పిలుస్తారు. ఇక్కడ కుంకుమగానీ, గంధం గానీ, విభూదిగానీ ధరించడం వల్ల నాడుల పనితీరు సక్రమంగా వుంటుందన్న అభిప్రాయాలు వున్నాయి. అలాగే కుంకుమ ధరించడం వల్ల దృష్టిదోషం తగలదట. కుంకుమ ధరించిన వ్యక్తులకు ఎదుటి వ్యక్తులు మానసికంగా లొంగిపోతారట. అలాగే కుంకుమకున్న ఎర్రటి రంగు మనలో మనోశక్తి, త్యాగనిరతి, నిర్భయత్వం, పరోపకార గుణాన్ని పెంపొందిస్తాయన్న అభిప్రాయాలు వున్నాయి.

* పవిత్రతకు చిహ్నం

పురుషులు కుంకుమ ధరించడం పవిత్రతకు, ఆస్తికత్వానికి, ధార్మికత్వానికి సంకేతంగా భావిస్తారు. అదే స్త్రీలకయితే పై అంశాలకు తోడు సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా కూడా భావిస్తారు. అనాది నుంచి హిందువులకు ప్రధాన అలంకార ప్రక్రియ కుంకుమ పెట్టుకోవడం అనే అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ విషయాన్ని కొన్ని గ్రంథాల్లో కూడా పేర్కొన్నారు. కుంకుమను భారతీయతకు చిహ్నంగా భావిస్తారు. దూరదర్శన్‌లో చూసే బధిరుల వార్తల్లో ‘ఇండియా’ అనే సందర్భం వచ్చినప్పుడు ఆ న్యూస్‌రీడర్ నుదుటన కుంకుమ పెట్టుకునే ప్రదేశంలో మధ్యవేలుని చూపిస్తుంది. అది కుంకుమకి, భారతదేశానికి ఉన్న బలీయమైన బంధాన్ని సూచిస్తుంది. ఈమధ్యకాలంలో పురుషులు కుంకుమ పెట్టుకోవడం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేశారు. ఈ ధోరణి ఎక్కడకి దారితీస్తుందోనన్న ఆందోళనను సంప్రదాయ వాదులు వ్యక్తం చేస్తూ వుంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద వుంటుంది. హిందువులు తమ సంప్రదాయానికి దూరంగా వెళ్ళిపోవడం, కుంకుమను విస్మరించడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

USE KUMKUM ONLY FOR SINDHOOR


 కుంకుమతోనే నొసట బొట్టు పెట్టుకోండి.

నొసట కుంకుమ బొట్టు పెట్టుకునేవారిలో ఒక మంగళకరమైన కళ తాండవిస్తూంటుంది. వీరు ఎదురుపడితే శుభశకునంగా భావిస్తారు. ముత్తైదువలు కుంకుమ పెట్టుకుంటారు. ఇది అలంకరణ మాత్రమే కాదు. దీనికెంతో మహత్తర భావముంది. ముత్తైదువులు మొదట ముఖానికి పసుపు పూసుకుని అటుపై ఉంగరపు వేలితో నొసట బొట్టు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. కుంకుమ క్రిములను నశింపజేస్తుంది. సమస్తైశ్వరాలను ప్రసాదిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. శుభములు కలిగిస్తుంది. అలాంటి మహత్తరమైన కుంకుమ ఉంగరపు వేలితోనే పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కుంకుమ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. బొట్టు పెట్టుకోవడానికి పసుపులో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.

Wednesday, 7 January 2015

PURANA FACTS ABOUT LORD VIGNESWARA


పురాణాల్లోంచి కొన్ని వినాయక విశేషాలు

విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం

మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ,విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.

గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.

వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు.వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.

విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య 21తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.

వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .
ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.

విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు. కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .

గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.

గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.

భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.

శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది.దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.

ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).

గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).

FOOD DIETING TIPS FOR LOOSING HEAVY WEIGHT


బరువు తగ్గడానికి ప్రతిరోజు ఆచరించాల్సిన నియమాలు 

1) మొట్టమొదటిగా బరువు తగ్గి , ఆరోగ్య్యాన్ని పొందాలి అనే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి.
2) ఉదయం లేవగానే పొట్ట భాగంలో నూనెతో (కొబ్బరి నూనె /నువ్వులనూనె /ఆలివ్ నూనె ) 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేసుకోవాలి.
3) తర్వాత రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగాలి.
4) 30 నిముషాలు వ్యాయామం (వాకింగ్ /జాగింగ్) చేయాలి .
5) 10 నిముషాలు ఉదయపు సూర్యకాంతిలో ఉండాలి .
6) స్నానానికి వేడి నీళ్ళు ఉపయోగించాలి .
7) 9 గంటల్లోపు బ్రేక్ఫాస్ట్ పుష్టికరంగా ( పోషకాలు ఉండేట్లు ) తీసుకోవాలి .
8) 1 గంట లోపు లంచ్ మధ్యమంగా తీసుకోవాలి .
9) 9 గంటల్లోపు రాత్రి బోజనం ముగించుకోవాలి .
10) c -విటమిన్ ఉన్న పండ్లు బత్తాయి , నారింజ , కమల , నిమ్మ , స్ట్రాబెర్రీ , ఆపిల్ , బెర్రీస్ , తీసుకోవాలి .
11) బోజనంలో ఆకుకూరలు , నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకోవాలి .
12) రోజులో కనీసం 3-4 లీటర్ల నీటిని త్రాగాలి .
13) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి .
14) బయట దొరికే జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండాలి .
15) రాత్రి వేళ కనీసం 7 గంటలు నిద్ర ఉండేట్లు , ప్రశాంతంగా నిద్ర పోవాలి .
ఇలా చేస్తే మీ లక్ష్యం నెరవేరినట్లే , అధిక బరువు నుండి విముక్తి పొందండి , ఆరోగ్యవంతులుగా జీవించండి . .

SRI GURU DATTA TEACHINGS IN TELUGU


1. గురువుల మాటల సంపత్తిని పోగోట్టుకోకూడదు.
2. తన యొక్క పశుత్వాన్ని నిర్మూలనం చేసి , మానవత్వాన్ని దివ్యత్వం వేపు మరలించడమే ఆధ్యాత్మికం .
3. దోషరహితమైన జీవితమే ప్రశస్తమైనది.
4. కనిపించిన అందరినీ విశ్వసించడం , ఎవరినీ విశ్వసించక పోవడం రెండూ కూడా బలహీనతలే .
5. గురువు దగ్గర ఖండించ కూడదు . సృష్టి సంహారం చేసినవాడు చేసినది హింస అనిపించుకోదు .
6. పరిశుద్ధమైన సేవలో పాప పుణ్యాలంటవు
7. పాపం చేసి క్షమించమని అడగటం నేరం , ప్రాయశ్చిత్తమే శరణ్యం కావాలి .
8. అభద్రతాభావానికి లొంగిపోకూడదు, ఆత్మాభిమానం నశించిపోతుంది .
9. కొత్త ఆలోచనలు కాదు కావలసింది , గొప్పభావనల ఉత్పన్నం జరగాలి .
10. గురువును శరణుకోరటం తీర్థయాత్రతో సమానం .
11. గురువు ఆశీస్సులు లేకుండా చేపట్టే ఏ కార్యక్రమమైనా దాని పరిపూర్ణతను సాధించలేదు.
12. వివిధ సద్విషయ శ్రవణం హృదయపు లోతులను పెంచుతుంది .
13. బయటి రూపాన్ని చూసి మనిషిని అవమానించటం అజ్ఞానం , అతడిలో నిష్కల్మష హృదయం ఉండవచ్చు .
14. మూర్ఖులు అజ్ఞానులు చేసే పనుల్లో ఎవరికైతేతోడ్పడాలనుకుంటారో వారికే తీరని హాని చేస్తుంటారు .
15. కోరికలో వుండే దోషమేమిటంటే , అది నేరవేరనందువల్ల ఎంత ఆరాటం కలుగుతుందో అది నెరవేరే తీరుకూడా అంత దుఖమూ తెచ్చిపెడుతుంది.
16. జ్ఞాని మన యెడల మైత్రి నెరపినా , ఆఖరికి వైరం పూనినా మన శ్రేయస్సునే కాంక్షిస్తాడు. లోని అహాన్ని వెళ్ళగక్కించడమే అతడి పరమోద్దేశం 
17. సాటి మానవుడి మీద , అమాయక ప్రాణుల యెడల ప్రదర్శించే దయాదాక్షిణ్యాలు చూచే దేవతలు ఆనందిస్తారు , అభినందిస్తారు .
18. ఒకే గుంటను తవ్వుతూ వుంటే నీళ్ళు పడినట్టే , ఒకే గురువును ఆశ్రయించితే జ్ఞానజలం చిలకరించబడుతుంది.
19. పట్టీతో వెళితే పాక్షికమైన భక్తి . , పట్టీ లేకుండా తత్వాన్ని ఆరాధిస్తే పరిపూర్ణ మైన భక్తి .
20. మానసిక పరిపక్వత పవిత్రమైన కర్మల ద్వారానే జరుగుతుంది .
21. వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని ప్రేమించడంలోనే అందం వుంది ఆనందం వుంది .
22. ఇతరులకంటే మెరుగ్గా వుండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు .
23. కర్మ వల్ల విశ్రాంతిని పొందిన చిత్తం భగవంతుని తలిస్తే పరిశుద్దమవుతుంది .
24. ఆశ పిశాచి వంటిది , పట్టి పీడిస్తూనే వుంటుంది .
25. ప్రాయశ్చిత్తమంటే దుఃఖపడటమొక్కటే కాదు , ఆ గుణదోషాన్ని మంత్రోచ్చారణతో సంస్కరించుకోవాలి .
26. పూర్వజన్మ సంస్కారవాసనలతో సద్గురువెప్పుడూ గుబాళిస్తూనే ఉంటాడు .
27. జడజీవులను ఉద్దరించడానికే పరమాత్మ అవతారం తీసుకుంటాడు .
28. సహనం కలవాడు తన సంకల్పానుసారం ఏదైనా సాధించగలడు.
29. సమయాన్ని , శరీరాన్ని , పరిసరాలని సరిగా ఉపయోగించాలి .
30. సద్గురువు దగ్గర శ్రద్దాభక్తులతో ఉంటేనే రిపేరు చేయబడతారు . అలా శిక్షణ నివ్వడమే కరుణ .
31. సద్గురువు చెప్పే మాటలు వినేందుకు మనోధైర్యం కావాలి .అది ప్రేమను పెంచుకుంటేనే సాధ్యం .
32. నీ మైండ్ కి నీవే గుడ్ మాస్టర్ వి కావాలి . అదే ఆత్మగురువు .
33. అంతరేన్ద్రియాల్ని maintain చేస్తే బాహ్యేన్ద్రియాలు కంట్రోల్ అవుతాయి.
34. సద్గురువు అనుగ్రహభాషణం జనరేటర్ లాంటిది . శ్రవణం చేస్తుంటే ఎప్పుడూ రీచార్జ్ అవుతుంది .
35. చెడుభావాలపట్ల వైరాగ్యం పెరగాలి , అసహ్యం కాదు . 
36. ఆధ్యాత్మిక జీవనం పట్ల ఆసక్తి కలగాలి , అదే జీవన సాఫల్యహేతువు .
37. చంచలం లేకుండా సర్వం సద్గురువే అని నమ్మిన వాడికి గురువు నాయకుడై నడిపిస్తాడు .
38. ఈ జీవితచక్రం చాలించుకునేందుకు నీకు శరీరం ఇవ్వబడింది .
39. ఉపనిషత్తులను అర్థం చేసుకోడానికి మార్గం కీర్తనలు .
40. దీర్ఘ జీవితము కంటే దివ్యజీవితం శ్రేష్టం .
41. మనసును స్వాధీనము చేసుకున్నవాడు శివుడు, మనసుకు స్వాధీనమైన వాడు జీవుడు .
42. ధార్మికంగా బ్రతికినప్పుడే తలెత్తుకుని ఠీవిగా బ్రతకడమవుతుంది.
43. పరమార్థం సిద్దించని విద్య వ్యర్తమైనట్టు , వ్యక్తిత్వపు విలువలు లోపించిన జీవితం భగవత్ప్రాప్తిని కలుగజేయదు
44. విలువలు లేని జీవితం వెలితిగా వుంటుంది .
45. తీవ్రమైన ఆపేక్ష ఉన్నవాడికి ఆనందం తెలియదు . మధ్యమంగా ఉండగల వాడికే గురుతత్వం లోని ఆనందం తెలుస్తుంది .
46. ఎంతటి అజ్ఞానంలో వున్నా మనం చేసే కర్మనే జ్ఞానాన్ని ఇస్తుంది .
47. సద్గురువును తలుచుకున్నప్పుడు ఒళ్ళుపులకరించినదంటే వాళ్ళ ఒంట్లో శుద్దమైన రక్తం ప్రవహించినట్టే.. నిరీక్షణ చేయటం లోనే పులకరింపు వస్తుంది .
48. ఇష్ట పడేప్పుడు తెలియదు కష్టాలెప్పుడూ ఇష్టాలచుట్టే ఉంటాయని .
49. నీ శక్తికి నీకుపయోగపడేదే మౌనం . మనసంతా గురు ప్రబోధంతో నింపుకుని మౌనస్థితికి వెళ్లిపోవాలి 
50. ఆచరణ లేని పాండిత్యం తేనేలేని తుట్టెవంటిది .
51. దత్తస్వామి అపచారం చేస్తే ఆగ్రహిస్తారు – అనుగ్రహిస్తే అష్టయిశ్వర్యాలే సిద్దిస్తాయి .
52. అవధులు దాటిన ఆగ్రహాన్ని అతిశయించిన కరుణతో గెలవగలం.
53. నమ్ముకున్న భక్తులను అందలమెక్కించడమే భగవంతుడి ప్రధాన కర్తవ్యం.
54. ఎప్పుడూ ఒప్పుకోకు ఓటమిని , ఎప్పుడూ ఒదులుకోకు ఓర్పుని.
55. సతమతాలెందుకు , దత్తమతాన్నే నీ అభిమతం చేసుకో .
56. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు , ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు .
57. మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది , ఇతరులకోసం చేసేది శాశ్వతంగా నిలిచి వుంటుంది .
58. రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్యశ్రామికురాలు అమ్మ ఒక్కటే .
59. లోని దివ్యత్వాన్ని వ్యక్తీకరించండి , అంతా చక్కగా సర్దుకుంటుంది .
60. విశ్వాసం విశ్వాసం – ఆత్మవిశ్వాసం .. భగవంతునిపై విశ్వాసం , ఇదే ఔన్నత్య రహాస్యం !
61. తోటమాలి ఆతృతతో వంద కడవలు నీళ్ళుపోసినా కూడా ఋతువు వచ్చినప్పుడే పండ్లు పండుతాయి. మెల్ల మెల్లగానే అన్ని పనులూ అవుతాయి .
62. పురుషుడికి సంఘర్షణ , యుద్ధం ,స్వాభావికం . స్త్రీకి సమర్పణ ,శాంతి ,స్వాభావికం .
63. సృష్టిలోని వైవిధ్యమే సౌందర్యానికి మూలం . ఈ వైవిధ్యాన్ని నిర్మూలించరాదు .
64. క్రమంగా జరగనిదానిలో వికాసం వుండదు .వికాసం అనే మెట్లు లేకపోతె ప్రగతి వుండదు .
65. సెలయేరు నిర్మలంగా గనుక వుంటే అది ఎక్కడనుండి బయటికి వస్తుందనే ప్రమేయమే అవసరం లేదు . సనాతనమైనా నూతనమైన దైనా , నిర్మలమైనదైతే స్వీకరించడానికి సిద్దంగా వుండాలి .
66. శిష్యుడు గురువు వద్దకు ముడిపదార్థంగా వస్తాడు .తాను విలువైన వజ్రంగా మారాలంటే గురువు దెబ్బలు సహించక తప్పదు.
67. పరమాత్మ ఎప్పుడు ఎవ్వరికి లభించినా నిత్యనూతనంగానే లభిస్తాడు . మనకే ఆయన మొదటిసారిగా లభించిన అనుభూతి కలుగుతుంది .
68. ఈ జీవితాన్ని ఎవరైతే సొంత ఇల్లనుకుంటారో , వారు అసలు ఇంటిని పోగొట్టుకుంటారు .ఈ జీవనం ఆవలవున్న గమ్యాన్ని చేరుకోవాలి .
69. గురువు ఒక ప్రక్కన శిష్యుడికి అవసరమైన ప్రేమ ఆప్యాయతలను అందిస్తూకూడా అతడి బద్దకాన్ని , అలసత్వాన్ని , నిర్లక్ష్యాన్ని తొలగించడం కొరకు కఠినంగా కూడా ప్రయత్నిస్తాడు 
70. కరుణ అంటే ఇతరులకు పంచడానికి జీవించడం, వాసన అంటే ఇతరులనుండి స్వీకరించడానికి జీవించడం . వాసన బికారి , కరుణ సామ్రాట్టు .
71. వాసన అంటే మనము ఎదో పొందడానికి జీవించడం . అదే కరుణగా మారినపుడు ధార వెనక్కు తిరుగుతుంది . పుచ్చుకునేదగ్గర ఇవ్వడం మొదలు పెడతాము .
72. దేనినీ విభజన చేయకు .సూదిలో దారాన్ని కలిపినట్టుగా ఆత్మను పరమాత్మతో కలిపి భజించు .
73. వ్యక్తిలో మొదలైన భక్తియజ్ఞం ,భగవంతుడి దగ్గర పూర్ణాహుతిని పొందాలి .
74. యావత్ సృష్టి యెడల ఔదార్యం కలిగివుండడమే దానగుణమంటే !
75. జ్ఞాని స్థితిలో నువ్వు లేనంత కాలం ఆ స్థితిని నీకు వర్ణిస్తే కాకమ్మ కథలా వుంటుందో , అలాగే ఆధ్యాత్మికానుభూతి ఎరుగని వారికి ఆ అనుభూతి గురించి మాట్లాడటం అంతే అవుతుంది .
76. అద్భుత శక్తిని దర్శించే తరుణ మాసన్నమైనపుడు ,దాని కృపకు తానెంత అనర్హుడో మనిషికి తెలిసివస్తుంది . అపుడతడెంతో వినమ్రుడవుతాడు.
77. అడగాల్సినచోట అభిమాన పడుతున్టాము ( సద్గురు దైవం దగ్గర ). అడగకూడనిచోట అభ్యర్తిస్తున్టాము ( సాటి వారి దగ్గర )
78. తర్కమనే కత్తెరను ఉపయోగించటం మానివేసి ధ్యానమనే సూదితో నీ జీవితాన్ని పరమాత్మతో కలిపి కుట్టుకో .
79. మనకు సంప్రాప్తించినదాన్ని సత్య దృష్టితో చూడగలిగితే మనసు పరమాత్మ పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది .
80. పరమాత్మను వలచిన చిత్తం కొలతలకందే వస్తువులపైకి ఆకర్షించబడదు .
81. పరమేశ్వరుడొకడు ఉన్నాడన్న ఆరోగ్యకరమైన భయం ఆలంబనకు ఊరట .
82. సరస్వతీ కటాక్షం మనిషిని ఎంతటి స్థాయిలోనైనా నిలబెడుతుంది .
83. వున్నాడని నమ్మి మనస్పుష్పాన్ని , నమస్పుష్పాన్ని సమర్పించు . నీ వెంట పరిగెడతాడు పరమాత్మ . 
84. నీ విధిపట్ల శ్రద్దాసక్తులు పూర్తిగా కేంద్రీకృతమైనపుడు పరిపూర్ణ ప్రశాంతి లభిస్తుంది .
85. వైరమనేది ద్వేషం తోనూ , యుద్దాలతోనూ అంతమయ్యేది కాదు . విశ్వాసం తోనూ , అవగాహనతోనూ వైరాన్ని రూపుమాపాలి .
86. భక్తిలేక జ్ఞానము కలుగదు , జ్ఞానము లేక భక్తి నిలవదు .
87. మహనీయుల కరుణ కల్లోలితమైన మనసును శాంత పరచడమే కాక , దుఃఖ నివృత్తిని కూడా చేయగలదు .
88. సత్యం నిర్వచించలేనిది . అందులోకి ప్రవేశం మాత్రమే వుంటుంది .
89. శాంతిగా ఉన్నప్పుడే పరులకు ఉపకారం చేయాలన్న భావన కలుగుతుంది . అందుకే సత్వగుణ సంపదను పొందాలి .
90. మన ధర్మ సాధనలన్నీ రాబోయే తరాలకు అందించే విధంగా ధర్మాల్ని ఆచరించాలి .
91. ప్రశ్న అనేది జిజ్ఞాసతో వుండాలి . గురువులను సేవించి తద్వారా జ్ఞానం పొందినప్పుడే ప్రశ్న పుడుతుంది .
92. అవిద్య పోవాలని ప్రార్థన చేయి , మాయ పోవాలని కాదు . మాయ పరమాత్మ ఆధీనంలో వున్నది కాబట్టి .
93. దుఃఖంలో దోషాన్ని చూడు , మూలం తెలుస్తుంది .
94. జ్ఞానాన్ని సంపాదించాలంటే , గురుతత్వం ఆత్మతత్వం ముందుగా అధ్యయనం చేయాలి .
95. ఏ తీర్థమైతే మన మనసులోని మాలిన్యాలను కడుగుతుందో , ఆ గురూపదేశమే అసలైన తీర్థం ..ఇదే అమృతం !
96. ధర్మాచరణమే మనిషికి మంచి హితాన్ని కలుగజేస్తుంది .
97. గురువును గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు , సాధన చేస్తూ వారిని అనుసరించినప్పుడే ఆ గొప్పలు చెప్పుకునే అర్హత సిద్దిస్తుంది .
98. వాడిలా వీడిలా అని అనుకోకుండా’ నీవెలా ‘ అన్నవైపే నీ ఆలోచన తిప్పాలి .
99. సద్గురువును ఆశ్రయించినప్పుడే నీలో శుద్ధ సంస్కారం కలుగుతుంది .
100. మతి చెడినప్పుడు ప్రవర్తనే నీ సహజ స్వభావం ..కలలోకూడా నీ సహజ ప్రవృత్తి బయట పడుతుంది .
101. ఎప్పుడూ లోపల వుండే శివస్వరూపాన్ని తలుస్తూ చిదానందంలో తేలిపోవాలి .. శాంతి లభిస్తున్దప్పుడు.
102. ప్రతి చిన్న విషయానికి కదలి పోక , మనోబలాన్ని పెంచుకో !
103. ఔను కాదు అనే మాటలు ఎంత చిన్నవో వాటిని అనడం అంత కష్టం .
104. సర్వం పరవశం దుఖం – సర్వం ఆత్మవశం సుఖం 
105. వర్గ రహితమైనదే స్వర్గం !
106. చదవడం ద్వారా జ్ఞానం అనే ధాన్యాన్ని పండిచ్చుకోవచ్చు . కాని ఆలోచన ద్వారా అ ధాన్యం నుంచి తరకలు వేరు చేయాలి .
107. ఆశావాది ప్రతి విపత్తులోనూ అవకాశాన్ని చూస్తె , నిరాశావాది ప్రతి అవకాశంలోనూ విపత్తును చూస్తాడు .
108. మనం ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన అజ్ఞానం అంతగా తెలుస్తుంది !
109. అభ్యాసం చేదు వేరు లాంటిది ..అయినా తీపి ఫలాలనే ఇస్తుంది !