ఆవు పాలు గురించిన వివరణలు
భారత దేశీయ ఆవు పాలు శరీర నిర్మాణమునకు అత్యవసరమైన ఆహారము.
భారత దేశీయ ఆవు పాలు శరీర నిర్మాణమునకు అత్యవసరమైన ఆహారము.
ఆవుపాలయందు మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్లు, సేంద్రీయ లవణములు (Minerals) కలవు. ఆవు పాలలోని మాంసకృత్తులయందు దేహనిర్మాణమున కవసరమగు యాసిడ్స్ (Amino Acids) కలవు. అవి చాలా తేలికగా జీర్ణమగు ఆల్బుమిన్ (Albumin) రూపములో ఉండును.పాలయందలి కొవ్వు-వెన్న రూపములో సూక్ష్మాతి సూక్ష్మమైన కణములుగా విభజింపబడి ఉండును. ఆవు పాలయందలి కార్బోహైడ్రేట్‌లు అతితేలికగా జీర్ణమగు లాక్టోస్ రూపములో ఉండును. ఆవుపాలయందు రోగనిరోధక శక్తిని అధికముగా పెంచు విటమిన్ "ఎ" అధికముగా ఉండును. ఈ పాలలోని "డి" విటమిన్ వలన ఎముకలు బలపును. బి కాంప్లెక్స్, బి12 విటమినులతో నాడుమండలము బలపును. ఆవుపాలయందు శరీరధాతు నిర్మాణమునకు ఉపయోగపు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం ఉన్నాయి. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన "స్వర్ణనాడి" (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మ నాడు ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది. సూర్యకిరణములు ఆవు మూపురముపై పినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని "కెసీిన్" అనే ఎంజైమ్‌ను తయారుచేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి.
No comments:
Post a Comment