యనమదుర్రు 'శక్తీశ్వరస్వామి క్షేత్రం'
యమధర్మ రాజుకు ఒకనాడు తాను చేసే విధిపై కొంచెం అసహ్యం కలిగి, శివుని గురించి తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించి ఒకానొక రాక్షసుని వధానంతరం నా దగ్గరకు రావడం జరుగుతుందని అప్పుడు తాను ఆంధ్రదేశంలో ప్రతిష్ఠించి, తద్వారా యముడు అంటే ప్రాణాలు తీసేవాడు కాదు, దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయగలడనే మంచి పేరు దక్కేలా చేయడమే కాక మనుష్యులందరి చేత స్మరింపబడతాడని యమధర్మరాజుకి వరం ఇచ్చాడు. ఆ వరప్రభావంగా ఈ 'యనమదుర్రు' గ్రామం వెలిసింది. ఈ దేవస్థానంలో మహాశివుడు శీర్షాసన భంగిమలో వెలియడం విశేషం.
శివుని ప్రతిమ (సాకారరూపం) సాధారణంగా కాళ్లపై నిలబడి ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు శీర్షాసన (తలక్రిందులుగా తపం ఆచరిస్తున్న) భంగిమలో ఉండటం విశేషం. శివుడి జటాఝూటం భూమిని తగులుతూంటుంది. ఆపైన ముఖం, కంఠం, ఉదరం...ఇలా ఆఖరుగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి. బాలింతగా తాను కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణ ధ్వేయంగా అమ్మవారు తన ఒడిలో మూడునెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలిసి, భక్తులను అనుగ్రహిస్తోంది.
దక్షిణకాశీగా విరాజిల్లుతున్న శ్రీపార్వతీ సమేత శక్తీశ్వర స్వామి క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో గల యనమదుర్రు గ్రామంలో వుంది.
No comments:
Post a Comment