WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 28 May 2014

WHAT IS THE SECRET BEHIND GOD PUJA WITH FLOWERS AND TAKING PRASADAMS AFTER PUJA



దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం

1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.

3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.

4. రుద్రాక్షపూవును అర్పిస్తే - ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.

5. మొగలిపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.

6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.

7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.

8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.

10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.

11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.

12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.

13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.

14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.

15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.

16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.

17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.

18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. 
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.

20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి


AMAZING FACTS ABOUT LORD SEVEN HILLS - LORD SRI VENKATESWARA SWAMY


తిరుమలలో కొన్ని వాస్తవాలు తెలుసుకొందామా! 

* తిరుమల తిరుపతి ఆలయం మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

* వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.

* తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

*స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

* స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

* గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

* స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

* స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

* చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

* స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

*1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు

HOW TO SLEEP PERFECTLY AND NICELY - BED TIME SLEEPING TIPS FOR ALL AGES



కంటినిండా నిద్ర కోసం....!

నిద్రపోవడానికి కూడా టైమ్ మేనేజ్‌మెంట్ అవసరమంటున్నారు నిపుణులు. టైము ప్రకారం నిద్రపోతే మర్నాడు తొందరగా లేచి రోజు వారీ కార్యక్రమాలను చురుగ్గా, చేసుకోగలరని సలహా ఇస్తున్నారు. మరి మంచి నిద్ర పట్టాలంటే ఎలా అంటారా? దీన
ికి కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటింటి చూడండి...

* బెడ్ టైమ్ షెడ్యూల్ పాటించాలి. రోజూ రాత్రి నిర్దిష్ట టైముకు పడుకోవాలి. అలాగే ఉదయం కూడా నిర్దిష్ట టైముకు నిద్ర లేవాలి .


* పిల్లలు రోజుకు ఆరు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలి


* పడుకునేబోయేముందు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి.


* మర్నాడు చేయాల్సిన పనుల లిస్టును రాత్రే రాసుకుంటే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రపోతారు.


* యోగా, స్ట్రెచెస్ లాంటి రిలాక్సేషన్ ఎక్స్‌ర్‌సైజులు చేస్తే శరీరం తేలికపడి మంచి నిద్ర పడుతుంది.


* రేడియోలో పాటలు లేదా సంగీతం వినడం, మంచి పుస్తకం చదువుకోవడం చేస్తే మెదడుకు ప్రశాంతత చేకూరి తొందరగా నిద్రలోకి జారుకుంటాం.


* మానసిక ప్రశాంతతను ఇచ్చేలా బెడ్‌రూమ్ పరిసరాలను తీర్చిదిద్దుకోవాలి.


* పరుపు శుభ్రంగా లేకపోయినా, పక్క బాగుండకపోయినా కూడా నిద్ర రాదు. అందుకే తరచూ బెడ్ దులపడం, బెడ్‌షీట్స్ మారుస్తుండడం చేయాలి.


* స్లీప్ డైరీని (ఏ టైములో రోజూ నిద్రపోతున్నారు, రోజులో ఎంతసేపు నిద్రపోతున్నారు, ఎన్నిసార్లు నిద్రలో మెళకువ వస్తోంది వంటి వివరాలతో ) రాయడం కూడా మంచిది. ఒకవేళ నిద్రలేమి అనారోగ్య సమస్యగా మారితే రోగ నిర్థారణకు స్లీప్ డైరీలో రాసుకున్న అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి.


* పగటి సమయంలో మధ్యమధ్యలో చిన్నపాటి కునుకు తీయడం కూడా మంచిదే
.

HOW TO ATTAIN NATURAL BEAUTINESS - TIPS TO WOMEN TO REFRESH NATURAL BEAUTINESS



సహజమైన అందం కోసం....!

మేకప్ లేకుండా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే కింద చెప్పిన టిప్స్ పాటించండి. సహజ అందంతో అందరినీ ఆకట్టుకోండి.

* మంచినీళ్లు బాగా తాగండి. నీరు ఎక్కువ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చర్మం నునుపు దేలి కాంతివంతంగా ఉంటుంది.

* ప్రమాదకరమైన రసాయనాలు లేని మాయిశ్చరైజర్స్‌ను వాడాలి. ఇవి చర్మాన్ని రక్షించడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ముఖ్యంగా మాయిశ్చరైజర్‌ను ముఖానికి, చేతులకు, పాదాలకు, మెడకు తప్పకుండా రాసుకోవాలి. ఎందుకంటే చర్మం తొందరగా వదులు అయ్యే భాగాలు ఇవే. ఇలా చేస్తే చర్మంపై ముడతలు ఏర్పడవు. వయసు కనపడదు.

* చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ఫేస్ వాష్ బాగా ఉపయోగపడుతుంది. దుమ్ము, ధూళి చర్మంలో ఇట్టే చేరిపోతుంటాయి కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేస్తే ముఖం మీద చర్మం నిగ నిగలాడుతుంటుంది.

* చర్మం ఆరోగ్యంగా ఉండడానికి టోనర్ చాలా అవసరం. ఇది చర్మం రంగు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం బిగుతుగా ఉండేట్టు చేస్తుంది. ముడతలు పడనీయదు.

* వారానికి కనీసం మూడుసార్లు షాంపుతో తలస్నానం చేయాలి. అలా చేస్తే జుట్టు నిగ నిగలాడుతూ శుభ్రంగా ఉంటుంది. తలకు నూనె బాగా పట్టించవద్దు. అలా చేస్తే ముఖం జిడ్డోడుతూ కనిపిస్తుంది.

* బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలి. లేకపోతే ఎండవేడిమికి చర్మం దెబ్బతింటుంది.

* ఉదయం లేచిన వెంటనే నిమ్మకాయ నీళ్లను తాగడం మరవొద్దు. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయరసం పిండి ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. చర్మం సహజసిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.

yoga tips to house wives



ఇంటి పట్టున యోగా చేసేవారు కొన్ని అంశాలను క్రమం తప్పకుండా పాటించాలని యోగానిపుణులు అంటున్నారు.

* నిత్యం ఒకే రకమైన యోగసనాలను చేయాలి. ఉదాహరణకు అష్టాంగయోగ చక్కటి ఉదాహరణ. ఇందులో ఊపిరి తీసుకోవడం, దృష్టిని ఒకచోట కేంద్రీకరించడం వంటివి ఉంటాయి. ఇవన్నీ ఒక చోట కూర్చుని కదలకుండా సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాలు మెడిటేషన్‌కు కూడా బాగా సహకరిస్తాయి.

* యోగాసనాల్లో ఎప్పుడూ ఒకే క్రమం (సీక్వెన్స్) అనుసరించాలి.
ఊ నిర్దిష్ట సమయాన్ని యోగాకు కేటాయించాలి. ఆ సమయంలోనే యోగా చేయాలి. టైమింగ్స్ మార్చకూడదు.


* ఇంట్లో ఒక ప్రదేశం అనుకుని అక్కడే యోగా చేయాలి. ఆ ప్రదేశంలో ఒక దేవుడి పటమో, క్యాండిల్ ఇంకేదైనా పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఏకాగ్రతతో యోగా చేయగలరు.

* ప్రాణాయామ , జపం, మెడిటేషన్ వంటివి చేయొచ్చు. వీటి వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ఉదాహరణకు మూడు నిమిషాల పాటు మీరు చేసే ప్రాణయామ మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.

* అపుడపుడు యోగ వర్కుషాపులకు వెడుతుండాలి, యోగా టీచర్‌ని సంప్రదిస్తుండాలి. ఇవి ఇంట్లో యోగా చేసుకునే వారికి ఎంతో ఉపయోగపడతాయి.