WORLD FLAG COUNTER

Flag Counter

Friday, 7 March 2014

LIST OF DO'S AND NO DO'S/POINTS TO BE REMEMBER TO VISIT A HINDU TEMPLE



దేవాలయంను దర్శించుకునే పధ్ధతి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇది మంచి పధ్ధతి కాదు.నిరసన, సమ్మె చేసే వారు మాత్రమె సగం దుస్తులు ధరించి 'అర్ధనగ్న ప్రదర్శన' చేస్తారు. ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .)

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

హిందూ ధర్మములను ఆచరించండి ఆచరింపజేయండి.

No comments:

Post a Comment