WORLD FLAG COUNTER

Flag Counter

Saturday, 15 March 2014

DEVOTIONAL ARTICLE ON GODDESS SRI MAHA LAKSHMI IN TELUGU



యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 

ఈ చరాచర జగత్తులోని అన్ని జీవులలో , బుద్ధిరూపంలో కొలువు ఉండే తల్లి లక్ష్మీ దేవి. ఆ తల్లినే విద్యా లక్ష్మి గా కొలుస్తాము. " విద్య " అనగానే మనకళ్ళముందు వాగ్దేవి సరస్వతి మాత ప్రత్యక్షం అవ్వడం అనేది సహజం. శుద్ధ ఙ్ఞాన ప్రతిపాదితమైన విద్యను ప్రసాదించే తల్లి సరస్వతి దేవి. ఆమే అనుగ్రహం ఉన్నవాళ్ళు మహావిద్వాంసూలుగా , ఙ్ఞానులుగా ప్రసిద్ధికెక్కుతారు.

విద్యాలక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికి, విద్యా సంపదతో పాటు, ఐశ్వర్య సంపద కుడా కలుగుతుంది.

శ్రీ మహాలక్ష్మి దేవి సప్తమ అంశ అవతారమైన ఈ విద్యాలక్ష్మీని పూజించినవారు త్వరిత గతిన ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

జన్మలన్నిటిలోను మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఎందుకంటే,జీవులలో మనిషికి మాత్రమే వివేకం, మంచి చెడులను గుర్తించే శక్తి, బుద్ధి కుశలతలను ఆ పరాశక్తి వరాలుగా అనుగ్రహించింది.

"విద్యలేనివాడు వింత పశువు" అని అంటారు. ఇలాగ విద్యావంతుడైన వ్యక్తిని అందరూ గౌరవించాలంటే ' వినయం' అనే లక్షణం చాలా ముఖ్యం.
"విద్యా వినయ సంపన్నే " అన్నారు పెద్దలు. వినయం లేని అహంకారి, ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎవరు గౌరవించరు.

శ్రీ విద్యాలక్ష్మి అనుగ్రహం ఉన్నవారికి వినయ సంపద కుడా అమ్మవారే వరముగా ఇస్తుంది .

విద్యా ప్రతిభ ,వినయం,మృదు సంభాషణ కలిగిన వారికి సమస్త సంపదలు అప్రయత్నముగ లభిస్తాయి.

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి శాంతి సమావృత హాసముఖే
నవ విధి దాయిని కలిమలహారిణి కామ్యఫలప్రద హాసయుతే
జయ జయహే మధుసూధన కామిని శ్రీ విద్యా లక్ష్మీ జయ పాలయమాం

No comments:

Post a Comment