WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 9 December 2013

WOMEN'S BREAST MILK IS THE BEST FEED TO THE NEWLY BORN KIDS - WORLD RECOGNISES THE FACT




శిశువుకు తల్లిపాలే సరయిన ఆహార మని ప్రపంచంలోని దేశాలన్నీ గుర్తించాయి. ప్రతి సంవత్సరం ఆగస్టునెల మొదటివారాన్ని తల్లిపాల విశిష్టతను, ప్రాముఖ్యతను, తల్లిపాల ప్రయోజనాన్ని తెలియచేసేవారంగా జరుపుకుంటున్నారు. శిశువు చనుపాలను త్రాగడం వల్ల తల్లీబిడ్డల అనుబంధం బల పడుతుంది. శిశువు ఎదుగుదలకు తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి. తల్లి బిడ్డకు ఆహా రంగా త్రాగించే చనుపాలల్లో బిడ్డకు కావల సిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి. తల్లి పాలల్లో ప్రొటీన్సు, విటమిన్‌లు ఖనిజాలు, కొవ్వు, నీరు పుష్కలంగా లభిస్తాయి. తల్లి పాలలో ఉండే 'ఇమ్యూనోగ్లోబిన్స్‌, లాక్టో ఫెర్రీస్‌, లాక్సోఫెరార్సిడేస్‌ బిడ్డ ఆరోగ్యానికి రక్షణగా పనిచేసి అంటువ్యాధులు సోకకుండా కాపాడతాయి. తల్లిపాలు త్వరగా జీర్ణమ వుతాయి. శిశువుకు అజీర్ణవ్యాధులు, వాంతులు, విరేచనాలు లాంటి అనారోగ్యాలు ఏర్పడవు. బిడ్డకు చురుకుతనాన్నీ, బుద్ధి కుశలతనూ పెంచి, వయస్సుకు తగినట్లుగా ఎదుగుదల, ఆటపాటలు, ఆరోగ్యం పెంపొందేలా చేస్తాయి తల్లిపాలు.
గర్భిణీ స్త్రీ పోషక విలువలు సమృ ద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. గర్భ ధారణ సమయంలో స్త్రీ శరీరంలో ప్రొలాక్టిన్‌ హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోను స్తనాలలోని కణాలను పాలు
ఉత్పత్తి చేసేందుకు ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను చురుకుగా పనిచేస్తూ, చనుపాలు తయారయ్యేందుకు దోహదం చేస్తుంది. చనుపాల ఉత్పత్తికి తోడ్పడే మరో హార్మోను ఆక్సిటోసిన్‌. ఈ రెండు హార్మోన్లూ శిశువుకు ఆహారంగా చనుపాలు పెరిగేందుకు తోడ్పడ తాయి. పాపాయికి స్తన్యమిస్తూంటే చనుపాలు మరింత వృద్ధి చెందుతాయి. సాధారణ ప్రసవమయితే అరగంట లేదా 40 నిమిషాల తర్వాత పాపాయికి స్తన్యమివ్వవచ్చు. మొదటి సారిగా స్రవించే చనుపాలు చిక్కగానూ, పసుపురంగులోనూ ఉంటాయి. వీటిని కొలాస్ట్రం అంటారు. ఆ పాలలో బిడ్డ ఆరో గ్యానికి అవసరమయ్యే పోషక పదార్థాలన్నీ లభిస్తాయి. పాపాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనారోగ్యాలకు గురి కాకుండా చేస్తాయి కొలాస్ట్రం పాలు. ఒకసారి ఒకవైపు, మరొకసారి ఇంకొకవైపు స్తన్య మివ్వడం మంచిది. పాపాయికి పాలు త్రాగించటానికి ప్రత్యేకంగా టైమ్‌ నియంత్రణ పాటించకుండా పాలు ఇవ్వవచ్చు. తల్లిపాలు కడుపునిండా త్రాగిన శిశువు రెండుమూడు గంటల సేపు ఆదమరచి నిద్రపోతుంది. వయస్సుకు తగిన బరువు కూడా పెరుగు తుంది. కనీసం మూడు నాలుగు నెలల వయస్సువరకయినా శిశువుకు తల్లి పాలు త్రాగించటం తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది, పిల్లలకు పాలు ఇస్తుండటం వల్ల వక్షోజాలలో పాలు నిలువవుండి గట్టిపడే స్థితిరాకుండా ఉంటుంది. పిల్లలకు స్తన్యమివ్వకపోతే రొమ్ములు గట్టిపడి, సలుపు, నొప్పి, జ్వరం కూడా రావచ్చు. అటువంటప్పుడు వక్షోజాల్ని మృదువుగా నొక్కుతూ, కొన్ని పాలను పిండేసెయ్యాలి. పాపాయి పాలు త్రాగు తూంటే ఆ నొప్పి తగ్గిపోతుంది.
పాలు త్రాగినా, పాపాయి ఏడుస్తున్నా, ఎక్కువ సమయం నిద్రపోకుండా నసుగు తున్నా, బరువు, ఎదుగుదలలో లోపం
ఉన్నా, తల్లిపాలు పాపాయికి చాలటంలేదని తెలుసుకోవాలి. లేడీ డాక్టరు సలహా ప్రకారంగా పాపకు పోతపాలు అలవాటు చేయాలి. సాధ్యమయినంతవరకూ పాపా యికి ఘన పదార్థం ఇచ్చేవరకూ తప్పనిసరిగా తల్లీ బిడ్డకు పాలు ఇవ్వడం అవసరం.
తల్లి బిడ్డకు స్తన్యమివ్వడం వల్ల పాపాయి ఎదుగుదల, ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తల్లీ బిడ్డకు పాలివ్వడం ద్వారా గర్భం ధరించినప్పుడు తాను పెరిగిన బరువును తగ్గించుకోగలుగుతుంది. గర్భసంచి తిరిగి యధాస్థితికి చేరుకుంటుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు. నెలసరి ఋతు క్రమం బిడ్డకు పాలివ్వడం ద్వారా కొంత కాలం రాకుండా ఉంటుంది. బిడ్డకు స్తన్యమి స్తూంటే తిరిగి గర్భం ధరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తల్లికీ, బిడ్డకూ మధ్య అనుబంధం పెరుగుతుంది. శిశువుకూ, మాతృమూర్తికీ సంపూర్ణ ఆరోగ్యానికీ, తల్లి శిశువుకు స్తన్యమివ్వడం దోహదం చేస్తుంది.

No comments:

Post a Comment