అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ఎన్నో సహజసిద్ద పదార్థాలున్నాయి. అయితే వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. నిమ్మకాయ వల్ల బ్యూటీ బెనిఫిట్స్ అధికం మరియు శక్తివంతమైనవి. ఎందుకంటే తక్షణ ప్రభావాన్ని చూపెడుతాయి. నిమ్మకాయ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్ శక్తివంతమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుం ది. కాబట్టి నిమ్మకాయ చర్మాన్ని మరియు కేశ అందాన్ని సహజంగా మెరుగుపరు స్తుంది.
నిమ్మకాయలో సిట్రస్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ఇందు లో యాంటీసెప్‌టిక్ లక్షణాలుకూడా ఎక్కువ గా కలిగి ఉంటుంది. అందుకే అందానికి మాత్రమే కాదు కొన్ని చిన్న చిన్న అంటు వ్యాధులను నివారించడానికి కూడా నిమ్మ కాయను ఉపయోగిస్తుంటారు. సాధారణం గా నిమ్మకాయ చర్మానికి ఏవిధంగా మంచి చేస్తుందనే విషయం మాత్రమే తెలుసు. అలాగే కేశాలకు కూడా అనేక ప్రయోజనా లను కలిగిస్తుందని తెలుసుకోండి. ఉదా: నిమ్మరసం తలకు మర్ధన చేయడం వల్ల హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. మరియు తలలోని చుండ్రును సులభంగా తొలగిస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ సిట్రస్ వాసనతో తల ప్రెష్‌గా సువాసన భరితంగా చేస్తుంది. నిమ్మకాయలో చర్మ సౌందర్యానికి సంబంధించి అనేక బ్యూటీ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కేశాలు అలాగే గోళ్ళకుకూడా ఉపయోగకరమే. ఒక్క మాట లో చెప్పాలంటే బ్యూటీ విషయంలో అన్ని విధాల ఉపయోగకరం. మిమ్మల్ని ఆశ్చర్య పడేలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడా
నికి... రుజువు చేయడానికి ఈ క్రింది పద్ధతులను ఫాలో అవ్వండి..
చుండ్రులేకుండా కాపాడుతుంది:
నిమ్మకాయ శక్తి వంతమైన డాండ్రఫ్ ఫైటర్. ఎందుకంటే నిమ్మ రసాన్ని తల మాడుకు
మసాజ్ చేయాలి. తర్వాత నిమ్మరసం వల్ల తల పొడిబారుతుంది కాబట్టి వెంటనే నూనె రాయాలి. అరగంట తర్వాత మేలైన షాంపూతో తలస్నానం చేసుకుంటే చుండ్రు మటు మాయం అవుతుంది.
మోచేతులు, మోకాళ్ళను మెరిపిస్తుంది:
శరీరంలో ఇతర భాగాలకంటే మోచేతులు మోకాళ్ళు నల్లగా మారి ఉంటాయి. కాబట్టి ఒకచిన్న నిమ్మ తొక్కను తీసుకొని, దానికి కొద్దిగా ఉప్పు లేదా పంచదారలో అద్ది నల్లగా మారిన మోచేతులు మోకాళ్ళ మీద స్క్రబ్ (రుద్దాలి).పదిరోజుల్లో మీమోకాళ్ళు మోచేతు లలో ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది.
స్కిన్ అలెర్జీ: నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మరియు యాంటీ బ్యాక్టీరి యల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల చిన్న చిన్న స్కిన్ అలెర్జీల నుండి మనల్ని కాపాడుతుంది.
నిమ్మరసంతో సాప్ట్ హెయిర్: కేశ సంరక్షణకు నిమ్మరసం మంచికండిషనర్‌గా ఉపయోగప డుతుంది.నేచురల్ హెయిర్ వాష్ అంటే శీకాకారు లేదా రీటావంటివి ఉపయోగించే టప్పుడు మరే ఇతర కండిషనర్లు ఉపయోగిం చకుండా నిమ్మరసంతో కండిషన్ చేసుకోవడం వల్ల హెయిర్ సాప్ట్‌గా మారుతాయి.
చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది: చర్మాన్ని శుభ్రపరచడంలో నిమ్మ రసం బెస్ట్ నేచురల్ క్లెన్సర్. నిమ్మతొక్కను ఉప్పు లేదా పంచ దారలో అద్ది ముఖం మీద మర్ధన చేయాలి. దాంతో ముఖంలో ఉన్న చర్మ రంధ్రాలు శుభ్రపడి, మురికి అంతా తొలగిపోతుంది.
మొటిమలను నివారిస్తుంది:
మొటిమలను నివారించడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. నిమ్మలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రం చేసి, ఆయిల్‌ను తొలగిస్తుంది.
ఏజింగ్: నిమ్మని సిట్రస్ ఫ్రూట్ అంటారు. ఎందుకంటే ఇందులో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెం ట్స్ వల్ల చర్మంలో చైతన్యం పెరుగుతుంది.
హెయిర్ స్మెల్: నిమ్మకాయ కేశాలను అద్భుత మైన సువాసన భరితంగా చేస్తుంది. ఇది కేశాలకు నేచురల్ ఫెర్ఫ్మూమ్.
ఆయిల్ స్కిన్: చర్మ రంధ్రాలలోని నూనెను సోక్ చేస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ముఖం జిడ్డుగా అనిపించినప్పుడు చర్మాన్ని నిమ్మ తొక్కతో రుద్దడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
తెల్లని గోళ్ళు: నిమ్మలోని బ్లీచింగ్ గుణాలవల్ల చేతి గోళ్ళు కూడా శుభ్రపడతాయి. మస్టర్ ఆయిల్లో నిమ్మతొక్కను అద్ది గోళ్ళమీద రుద్దడం వల్ల అద్భుతమైన గోరు అందాన్ని పొందవచ్చు.
No comments:
Post a Comment