స్మూత్ వింటర్!
చలికాలం వస్తే చాలు... మరో భయమూ గడగడలాడించేస్తుంది.
ఇది చలి వల్ల వచ్చే వణుకు కాదు...
చర్మానికి కలిగే హానిని తలచుకుని ఈ ఆందోళన.
మామూలు టైమ్‌లో ఉండే మెరుపు తగ్గిపోయి చర్మం నిస్తేజంగా మారుతుంది.
బాగా పొడిబారిపోయి కాస్త గోరు గీరుకున్నా చారికలు పడిపోయి అసహ్యంగా కనిపిస్తుంది. ‘వింటర్’తో పాటు వచ్చే చర్మ సమస్యలకు ‘స్మూత్’ పరిష్కారమే ఈ ముందుజాగ్రత్త.
చలికాలంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటిగాలులు. అందువల్ల చర్మంలోని తేమ, సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారి, దురద మొదలవుతుంది. మంటపుడుతుంది. గీరితే పొట్టు రాలుతుంది. చలికాలంలో ఈ సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవాళ్లకి, కొన్ని రకాల మందులు వాడుతున్నవారికి ఎక్కువ. పెదవులు కూడా త్వరగా పొడిబారి, పగులుతూ ఉంటాయి. అజాగ్రత్త చేస్తే ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది. ఈకాలంలో జుట్టు కూడా పొడిబారి, కాంతి తగ్గి, బలహీనపడి, ఎక్కువగా ఊడుతుంటుంది.
వింటర్ ఎగ్జియోరోసిస్: ఈ సమస్య చేతులకి, కాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. చర్మం బాగా పొడిబారి, దురద మొదలవుతుంది. వీళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి.
ట్యానింగ్: చలిగా ఉంది కదా! అని ఎక్కువసేపు ఎండలోనే ఉండటం వల్ల పొడిబారిన చర్మం కమిలిపోతుంది.
అటోపిక్ డెర్మటైటిస్: ఈ స్కిన్ డిసీజ్ ఏడాది లోపు పిల్లల్లో బుగ్గలు, చేతులు, కాళ్ల మీద మొదలవుతుంది. చర్మం ఎరగ్రా, పొడిబారి దురద వస్తుంది. తరచూ ముక్కుకారడం, డస్ట్ అలెర్జీ, ఆస్తమాసమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఎగ్జిమా శరీరమంతా స్ప్రెడ్ అయిఎరిథ్రోడెర్మస్‌గా మారుతుంది. వీరు డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం అవసరం.
సోరియాసిస్: 30 -40 ఏళ్ల మధ్య వయస్కులు, వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువ. మోకాళ్లు, మోచేతులు, వీపు మీద ఎరన్రి ప్యాచెస్ వస్తుంటాయి. చర్మం మందంగా మారి, పొట్టు రాలుతూ ఉంటుంది. తలలో కూడా తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. గోళ్లు, కీళ్ల సమస్యలు ఉంటాయి.
రోసాసియ: ఈ చర్మ సమస్య ఉన్నవాళ్లకు బుగ్గలు, ముక్కు, తల ముందుభాగం మీద ఎరగ్రా కందిపోయి ఉంటుంది. ఇది యాక్నెనా, పింపులా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఆల్కహాల్, మసాలాలు ఎక్కువ తీసుకునేవాళ్లకు వస్తుంది.
యాక్నె, పింపుల్స్: చలికాలంలో చర్మం పొడిబారి మృతకణాలు పెరుగుతాయి. ఇవి చర్మం రంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా ఆకర్షించి మొటిమలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది.
ఆస్టియోటిక్ ఎగ్జిమా: ఈ సమస్య వృద్ధులకు వస్తుంది. పొలం ఎండి బీటలు వారినట్టు చర్మం కూడా అలా కనిపిస్తుంటుంది.
కాగ్నైటల్ డిజార్డర్
ఈ సమస్య పుట్టుకతోనే మొదలవుతుంది. చర్మం అంతా పొడిబారి చేపల పొలుసుల్లాగ ఊడిపోతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చాలా సివియర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పిల్లలకు పుట్టిన దగ్గర నుంచే చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment