WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 5 December 2013

HEALTH BENEFITS OF INGUVA POWDER IN DAILY LIFE


ఇంగువతో మాయం

ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబుల నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.
తెమడతో కూడిన దగ్గు ఉంటే కనుక అర టీస్పూన్ ఇంగువ పొడి, అర టీస్పూన్ శొంఠి పొడి, రెండు స్పూన్ల తేనెల్ని కలిపి టాఫీ లాగా తయారుచేయాలి. దీన్ని నోట్లో పెట్టుకుని నెమ్మదిగా రసాన్ని మింగాలి. ఇంగువ టాఫీని రోజుకి మూడుసార్లు వాడితే దగ్గు తగ్గిపోతుంది.
పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీస్పూన్ ఇంగువ పొడి, ఒక టీస్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనెలను బాగా కలపాలి. దీన్ని రోజుకి ఒకసారి తీసుకోవాలి. రసాన్ని నోటిలో ఉంచుకుని నెమ్మదిగా గొంతులోకి పంపాలి. దీనివల్ల గొంతు గరగర పోతుంది. పొడి దగ్గు తగ్గిపోతుంది.
ఇక తీవ్రంగా ఇబ్బంది పెట్టే జలుబు తగ్గాలంటే కొన్ని చుక్కల ఇంగువ నూనె, రెండు చుక్కల నూనెల్ని వేడి నీళ్ల గిన్నెలో వేసి ఆవిరి పట్టాలి. అలాగే ఈ నూనెని ఛాతి, గొంతు, వీపు భాగాల్లో రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment