WORLD FLAG COUNTER

Flag Counter

Wednesday, 11 December 2013

PALA KURA - POTATO - TOMATO CURRY IN RECIPES `N' RECIPES

Potato Spinach Dry Curry / Aloo Palak ki subji


పాలక్‌-ఆలూ-టమాటా


పాలకూర 2 కట్టలు
బంగాళాదుంపలు 2
టమాటాలు 4
ఉల్లిపాయలు 3
జీలకర్ర 1/2 స్పూన్‌
అల్లం చిన్నముక్క
వెల్లుల్లి 5రేకలు
నూనె 1 గరిట
ఉప్పు తగినంత
పచ్చికారం 1.1/2 స్పూన్స్‌
పసుపు చిటికెడు
చేయు విధానము: పాలకూర కడిగి సన్నగా తరిగి ఉడికించాలి. ఉల్లిపాయల ముక్కలు తరగాలి. బంగాళాదుంపలు చెక్కుతీసి చిన్న ముక్కలుగా తరగాలి. టమాటాలు సన్నగా ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద నూరాలి. బాణలిలో నూనె మరిగాక జీలకర్ర, ఉల్లిపాయలు, బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపువేసి, సన్నసెగలో మూతపెట్టి మగ్గించాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేెయించి కారం వేసి కలిపి టమాటా ముక్కలు వేసి మగ్గాక ఉడికించిన పాలకూర గరిటతో మెత్తగా మెదిపి వేసి వేయించి కొద్దిగా నీరు వేసి దగ్గర పడిన తర్వాత దించాలి. ఇది అన్నం, చపాతీ, పుల్కాలకు చాలా బావుంటుంది. ఇదే మాదిరిగా పాలకూర- బంగాళాదుంపతోను, పాలకూర-టమాటాతోను చేయవచ్చును.

No comments:

Post a Comment