WORLD FLAG COUNTER

Flag Counter

Monday, 19 September 2016

FOOD HEALTH TIPS TO PREGNANT WOMEN AND ALSO AFTER DELIVERY TO KID


ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు - 


* బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 

* గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును.

* బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను.

* బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును.

* స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను.

* బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను.

* కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర
ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి .

* ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు .

* మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు .

బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు -


* ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు.

* చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.

* పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు.

* చల్లటి పదార్దాలు ముట్టరాదు.

పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి
గమనిక -

పైన చెప్పిన ద్రాక్షారిష్ట , సౌభాగ్య శొంటి ప్రముఖ ఆయుర్వేద షాపుల్లో లభించును.

************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

HOME REMEDY FOR KNEE PAIN - TAMARIND SEEDS GIVES PERMANENT SOLUTION TO OVERCOME KNEE PAIN


లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని మోకాళ్ల నొప్పి.. చింతగింజలతో మాయం

ఒకప్పుడు ముసలి వయసులో ఉన్నవాళ్లు 'మోకాళ్ల నొప్పులు' అంటూ ఉంటె.. వయసు అయిపోయిందని అనుకునే వారు. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం.. ఆహారపు అలవాట్లు. ఈ మోకాళ్ళ నొప్పులతో నే కాలం భారంగా గడుపుతూ ఉంటారు. ఇంకొందరు డబ్బులు ఉన్నవాళ్లు.. లక్షలు పోసి మందులు వాడిన వారు ఉన్నారు. అయినా వారికి ఆ నొప్పులు తగ్గడం లేదు. అయితే.. ఎన్ని మందులు వేసుకున్నా.. తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది. ఆయుర్వేద నిపుణులు సైతం ఈ వైద్యాన్ని అంగీకరిస్తున్నారు.

చింతకాయలు, చింతపండు తిన్నాక వచ్చే.. చింతగింజలను ఉపయోగించి మోకాళ్ల నొప్పికి మంచి ఔషదం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.

1: చింతగింజలను పండుగా వేయించాలి. 

2: బాగా వేగిన చింతగింజలను 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. 

3 : నీటిని మారుస్తూ 2 రోజులు నానిన తర్వాత వాటి పొట్టు త్వరగా వస్తుంది.

4: పొట్టును తీసి.. చింతగింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. 

5: ఎండిన తర్వాత ఆ చింతగింజలను మిక్సీ లో వేసి పొడిలాగా తయారు చేసుకోవాలి. 

6: ఆ పొడిని ప్రతి రోజూ ఒక్కో స్పూన్‌ చొప్పున రెండు సార్లు నీటిలో లేదా పాలల్లో కలుపుకుని తాగాలి.

ఇలా చేయడం వల్ల 30 రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుండి శాస్వత పరిష్కారం దొరుకుతుంది. 

Argan oil HEALTH AND BEAUTI TIPS IN TELUGU


ఆర్గాన్‌ నూనెతో అందం... ఆరోగ్యం..!

అందానికీ ఆరోగ్యానికీ ఆలివ్‌ నూనె ఎంతో మంచిదన్నది తెలిసిందే. కానీ ఆర్గాన్‌ నూనె దానికన్నా అద్భుతంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాయి తాజా పరిశోధనలు. మొరాకోలో ఎక్కువగా పెరిగే ఆర్గాన్‌ చెట్ల నుంచి తీసే ఈ నూనెను అంతా ‘మొరాకో బంగారం’ అని పిలుస్తారు. ఎందుకంటే విటమిన్‌-ఇ, విటమిన్‌-ఎలు సమృద్ధిగా ఉన్న ఆ నూనె అందానికీ ఆరోగ్యానికీ పెట్టింది పేరు. ఆలివ్‌నూనె(కిలోకి 320 మి.గ్రా.)లోకన్నా ఆర్గాన్‌ నూనె (కిలోకి 620 మి.గ్రా.)లో టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ) రెట్టింపు ఉంటుంది. ఈ టోకోఫెరాల్‌ సహజ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తూ కణాల్లోకి చేరి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అంతేకాదు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఎనాలజెసిక్‌ గుణాలు ఈ నూనెలో మెండుగా ఉన్నాయట. అందుకే ఇది అద్భుత ఔషధంగానూ అంతకుమించిన సౌందర్యలేపనంగానూ పనిచేస్తుంది.

* ఈ నూనెలో మోనో అన్‌శాచ్యురేటెడ్‌, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాలు ఎక్కువగా ఉండటంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఓలియాక్‌, లినోలిక్‌ ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఫలితంగా హృద్రోగ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని అనేక పరిశోధనల్లో తేలింది.

* ఇందులో పాలీఫినాల్స్‌తోబాటు రక్తనాళాల్లో గడ్డలు కట్టకుండా నిరోధించే స్టెరాల్సూ ఎక్కువగా ఉండటంవల్ల క్యాన్సర్లు వంటివి వచ్చే అవకాశం కూడా తక్కువట. పైగా ఇది బీపీనీ తగ్గిస్తుందని ఎలుకల్లో చేసిన పరిశీలనల ద్వారా తెలుస్తోంది.

* ఇది కీళ్లనొప్పుల్నీ తగ్గిస్తుందట. సంప్రదాయ వైద్యంలో భాగంగా మొరాకన్లు ఈ నూనెను అనేక చర్మసంబంధ వ్యాధుల్లోనూ వాడుతుంటారు.

* మొహంమీద మొటిమలూ చికెన్‌పాక్స్‌ మచ్చలూ వంటి వాటిని తొలగించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీన్ని అక్కడివాళ్లు బంగారంతో సమానంగా భావిస్తారు. ఇది మేనిమెరుపుని కాపాడడంతోపాటు శిరోజాలు ఆరోగ్యంగా పెరిగేందుకూ దోహదపడుతుందట. దాంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంటోంది.

Argan oil is a plant oil produced from the kernels of the argan tree that is endemic to Morocco. In Morocco, argan oil is used to dip bread in at breakfast or to drizzle on couscous or pasta. It is also used for cosmetic purposes.