WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 2 February 2016

HEALTH BENEFITS WITH JEERA WATER / JEELAKARRA HEALTH BENEFITS


అధికబరువు - గ్యాస్ ప్రాబ్లం - అసిడిటీ - ఫైల్స్ - అజీర్తితో బాధపడేవారికి చిట్కా

1) రెండు గ్లాసుల నీటిలో 1 స్పూన్ జీలకర్ర వేసి , మరగించి , గోరువెచ్చగా ఉదయం బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి. 

2) అదేవిధంగా రాత్రి భోజనం చేసాక , పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చగా తీసుకోవాలి.

3) ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ది చెంది , అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.

4) దీనితో పాటు సంతులిత ఆహరం తీసుకొంటూ , రోజులో కనీస కాలినడక వ్యాయామం చేసుకోవాలి. 

IMPORTANCE OF ANNA DANAM


అన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏదిలోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నిటిలోకీ అన్నదానం మిన్న అని,అన్నదానాన్ని మించిన దానం ఇంకొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగాఇచ్చినా...ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది.
కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు. కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా చేయాలి. అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్పారు. దీనికి సంబంధించి ఒక కధ కూడా చెప్తారు.
మహాభారత యుధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు.అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగతసత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏంలాభం....!కర్ణుడికి ఏదో అసంతృప్తి, ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు వుండటంలేదు. సంతృప్తి అనేది లేదు. ఎందుకు ఈవిధంగా ఉంటోందో అతనికి అర్ధం కావటంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేశావని, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి... ఎప్పుడైనా అన్నదానం చేశావా? అని అడిగాడు. నేనెన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు.
"పోనీ అన్నం పెట్టే ఇల్లయిన చూపించావా"? అని అడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించి అన్నాడు కర్ణుడు. "ఓ బీద బ్రాహ్మణుడు నాదగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేనేదో ధ్యాసలో ఉండి నాకవకాశం లేదు కానీ...అక్కడ ఆ ఇంటికి వెళ్ళు " అని ఒక ఇల్లు చూపించాను. ఐతే అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలుని నువ్ నొట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు. వెంటనే ఆ వేలు నోటిలో పెట్టుకున్నాడు కర్ణుడు.ఒక్క గుటక వేశాడు, ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైపొయింది.
ఈ కధ ద్వారా అన్నదానం యొక్క మహత్య్మం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్లనుండి బయట పడటానికి చక్కని రెమెడిగా పనిచేస్తుంది అన్నదానం అని పండితులు చెప్తారు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమౌతాయని చెప్తారు. భోజనం చేసేముందు మొదటిముద్ద పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో పెడితే పక్షులను కుడా రక్షించిన ఫలితం వస్తుంది. అన్నాన్ని కాకులకు వేయటం వలన శని దోషాలు పోతాయని చెపుతారు.

AKKA MAHADEVI TEMPLE AT KARNATAKA


మహాభక్తురాలు అక్కమహాదేవి

పశ్చిమకర్ణాటకదేశంలో 'కల్యాణరాజ్యం' ఉండేది. ఆ రాజ్యం లోని "ఉడుతడి" అనే సంస్దానాన్ని "కౌశికుడు" అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సంస్దాన రాణిగారు మహాబక్తురాలు ఒకరోజు ఉదయాన్నే "శివపూజ" చేసి భక్తి గీతాలు పాడుకుంటూ కూర్చున్నారు ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ కౌశికరాజు కూడా ఆమె చెంతకు వచ్చి కూర్చొని పరవశత్వంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు ఇంతలో రాణిగారి గురువుగారు ఆమె దర్శనార్దమై ద్వారం చెంతకు రావటం గమనించిన రాణిగారు భక్తితో పరుగెత్తుకుంటూ పోయి గురువు గారికి పాదాభివందనం చేశారు ఈ హడావుడిలో పైట కౌశికరాజు చేతిలో ఉండిపోయింది. ఇది గమనించిన గురువు గారు ఆమెకు ఆ విషయాన్ని తెలియచేసారు ఆమె సిగ్గుతో తలదించుకొని లేచి వెళ్లి కౌశికుని చేతిలో వున్న పైటను తీసుకొని ధరించింది.

ఆ చేష్టను చూచిన కౌశికునికి ఎక్కడలేని కొపం వచ్చింది తీక్షణంగా ఆమె వంక చూసి కఠినంగా మాట్లడి ఆమె మనస్సును నొప్పించాడు భర్త కఠినోక్తులు ఆమెను కదిలించాయి
"వలువలు గట్టిన వారు కులముల నీడు వడల నరయుదురా..? మరులు గొన్నవారు సిగ్గుల నరయుదురా చెన్నమల్లికార్జునుని వరించిన వారు లోకాభిమానము నెరగుదురా" అని పాడుకున్నది ఆ మరుక్షణమే సంసారబంధాన్ని త్రెంచుకొని విరాగిణయై "చెన్నమల్లికార్జునుని" వెదుక్కుంటూ బయలు దేరింది కల్యాణనగరంలో బసవేశ్వరుని అనుభవమంటపంలో చాలాకాలం వేదాంతచర్చల్లో కాలం గడిపింది అనంతరం "శ్రీశైలం" చేరుకొని "కదళీవనం" అనే ప్రాంతంలో తపస్సు చేసి శివుని సన్నిది చేరుకున్నది.

'ఆమెయే మహాభక్తురాలు అక్కమహాదేవి' , శ్రీశైలమల్లికార్జుని దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడు తప్పగ దర్శించే స్దలం దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు రెండు గంటలు పడవలో నీటి మీద, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి చుట్టూ చెట్లూ చెప్పని నలవి గాని చూడచక్కని భక్కిరసపూరితమైన దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు కన్నడభాషలో తెలుగులోనూ ఆమె వ్రాసిన "వచనాలు" వందలకొద్దీ వున్నాయి అవి అన్నీ శివుణ్ణి కీర్తిస్తూ వ్రాసినవే అయితే మన దురదృష్టం వాటిలో ఎక్కువ బాగం ప్రచురితం కాకపోవటమే ...