WORLD FLAG COUNTER

Flag Counter

Tuesday, 1 December 2015

BRIEF INFORMATION ABOUT SIRISI SAHASRA LINGAM TEMPLE


సిరిసి సహస్ర లింగం శ్రీ మరికాంబ మందిరం

సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 17 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే, సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండుగలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి శివ భక్తులు అధికంగా వస్తారు. పూజలు చేయటమే కాక పర్యాటకులు ఈ దేవాలయంలోని ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలను దర్శించేందుకు కూడా వస్తారు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంటుంది.ఈ ప్రదేశం పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో ఉన్నది........
ఓం నమశ్సివాయ.......
నిత్యాభిషేకం...సహస్ర లింగం!!!!
కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది.
అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు.
అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 - 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు. శివలింగాల ఎదురుగా బసవన్న విగ్రహాలు కూడా చెక్కి వుండడం విశేషం.
శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చి, పూజలు చేసుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రవాహం తక్కువగా ఉండడం విశేషం. అందువలన ఎక్కువ శివలింగాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ శివలింగాలు, ఆ నదీ ప్రవాహంతో నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి.
శ్రీ మరికాంబ దేవాలయం
17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గల 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబను దర్శించేందుకు భక్తులు తరలి వస్తారు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో లభించినట్లు స్ధానికులు చెపుతారు. 1611 సంవత్సరంలో సోండా రాజు రెండవ సదాశివ రావు ఆ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటినుండి ఆ దేవి ఇక్కడ పూజలు అందుకుంటోంది. భక్తుల కోరికలు తీరుస్తోంది. సిర్సిలో ఈ దేవతా విగ్రహాన్ని మాత్రమే కాక, భక్తులు కావి కళ కూడా ఈ దేవాలయ గోడలపై చూస్తారు. మరికాంబ జాతర ఒక ప్రత్యేక ఆకర్షణ. రెండేళ్ళకోసారి చేసే ఈ జాతరకు లక్షలాది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వస్తారు. మరికాంబ దేవత అక్కడ ఉండటం వలననే ఆ ప్రాంతం చెడునుండి సంరక్షించబడుతున్నట్లు స్ధానికులు భావిస్తారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఉన్న ఈ దేవాలయం కొండలు, అడవులు, అనేక జలపాతాలతో చుట్టుముట్టి ఉంటుంది.

SRI LAKSHMI NARAYANI - GOLDEN TEMPLE - SITUATED AT MALAIKUDI - TAMILNADU


శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం” ఎక్కడవుందో..?
శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి. ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.
ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”. కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.
నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు. ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ, వికలాంగులకూ సహాయం చేశారు. మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు 600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.
ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు


DRINK HONEY WITH MILK FOR GOOD SLEEP AND LOOSE HEAVY WEIGHT


నిద్రలేమి తో బాధ పడుతున్నారా......... ?

బరువు తగ్గాలనుకు౦టున్నారా...........?

పాలు-తేనె రెండింటి కాంబినేషన్‌లో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ రెండింటిలో ఉండే న్యూట్రీషియన్స్ శరీరంలో ప్రోబయోటిక్స్ ఉత్పత్తికి పెరుగుదలకు సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి బ్యాక్టీరియాను ప్రేగుల్లో ఉత్పత్తి చేస్తుంది. దాంతో పొట్ట సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి, ఒక గ్లాసు పాలలో తేనె మిక్స్ చేసి ఉదయం తీసుకోవాలి.నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే తేనె గోరువెచ్చని పాలు ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. ఈ రెండింటిని కలిపినప్పుడు,మరింత పవర్ ఫుల్‌గా పనిచేస్తాయి . నిద్రలేమి సమస్యలను నివారిస్తాయి. ముఖ్యంగా పాలు- తేనె కాంబినేషన్ బరువు తగ్గడానికి ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. త్వరగా బరువు తగ్గిస్తాయి. తేనెలో ఎనర్జీ అందించే లక్షణాలుంటే, పాలలో ఫ్యాట్‌ను కరిగించే ప్రోటీన్స్ ఉండటం వల్ల అదనపు ఫాట్ పెరగకుండా శరీరాన్ని రక్షిస్తాయని వైద్యులు చెబుతున్నారు.