సిరిసి సహస్ర లింగం శ్రీ మరికాంబ మందిరం
సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 17 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే, సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండుగలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి శివ భక్తులు అధికంగా వస్తారు. పూజలు చేయటమే కాక పర్యాటకులు ఈ దేవాలయంలోని ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలను దర్శించేందుకు కూడా వస్తారు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంటుంది.ఈ ప్రదేశం పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో ఉన్నది........
ఓం నమశ్సివాయ.......
నిత్యాభిషేకం...సహస్ర లింగం!!!!
కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది.
అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు.
అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 - 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు. శివలింగాల ఎదురుగా బసవన్న విగ్రహాలు కూడా చెక్కి వుండడం విశేషం.
శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చి, పూజలు చేసుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రవాహం తక్కువగా ఉండడం విశేషం. అందువలన ఎక్కువ శివలింగాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.
ఈ శివలింగాలు, ఆ నదీ ప్రవాహంతో నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి.
శ్రీ మరికాంబ దేవాలయం
17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గల 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబను దర్శించేందుకు భక్తులు తరలి వస్తారు. ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో లభించినట్లు స్ధానికులు చెపుతారు. 1611 సంవత్సరంలో సోండా రాజు రెండవ సదాశివ రావు ఆ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటినుండి ఆ దేవి ఇక్కడ పూజలు అందుకుంటోంది. భక్తుల కోరికలు తీరుస్తోంది. సిర్సిలో ఈ దేవతా విగ్రహాన్ని మాత్రమే కాక, భక్తులు కావి కళ కూడా ఈ దేవాలయ గోడలపై చూస్తారు. మరికాంబ జాతర ఒక ప్రత్యేక ఆకర్షణ. రెండేళ్ళకోసారి చేసే ఈ జాతరకు లక్షలాది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వస్తారు. మరికాంబ దేవత అక్కడ ఉండటం వలననే ఆ ప్రాంతం చెడునుండి సంరక్షించబడుతున్నట్లు స్ధానికులు భావిస్తారు. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తున ఉన్న ఈ దేవాలయం కొండలు, అడవులు, అనేక జలపాతాలతో చుట్టుముట్టి ఉంటుంది.
No comments:
Post a Comment